ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ క్రింద పేర్కొన్నటువంటి అంశాల కు ఆమోదం తెలిపింది:
అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం కింద, అర్హత కలిగిన ఎమ్ఎస్ఎమ్ఇ లు, ఆసక్తి గల ముద్ర రుణగ్రహీతల కు 3 లక్షల కోట్ల రూపాయల వరకు అదనపు నిధులు అందుబాటు లోకి తెచ్చేందుకు వీలు కల్పించారు.
ఈ పథకం కింద, అర్హత కలిగిన ఎమ్ఎస్ఎమ్ఇ లు, ఆసక్తి కలిగిన ముద్ర రుణగ్రహీతల కు గ్యారంటీ ఇమర్ జన్సి క్రెడిట్ లైన్ (జిఇసిఎల్) సదుపాయం కింద నేశనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ 100 శాతం గ్యారంటీ కవరేజ్ సదుపాయాన్ని కలిగిస్తుంది.
ఇందుకోసం ,కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి మరో మూడు ఆర్థిక సంవత్సరాల కాలం వరకు 41,600 కోట్ల రూపాయల కార్పస్ అందుబాటు లో ఉంచుతుంది.
ఈ పథకం జిఇసిఎల్ సదుపాయం కింద మంజూరైన అన్ని రుణాలకు, ఈ పథకం ప్రకటించిన తేదీ నుండి 2020 వ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ వరకు లేదా జిఇసిఎల్ కింద 3,00,000 కోట్ల రూపాయలు మంజూరు అయ్యే వరకు- ఏది ముందు పూర్తి అయితే దాని ప్రకారం- వర్తించేలా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
వివరాలు:
మున్నెన్నడూ లేనటువంటి కోవిడ్ -19 పరిస్థితులు, అనంతరం ప్రకటించిన లాక్ డౌన్ పరిణామాల ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యల కింద అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకాన్ని (ఇసిఎల్‌జిఎస్) రూపొందించారు. కోవిడ్ -19 పరిణామాలు, తదనంతరం లాక్‌డౌన్ ఎమ్ఎస్ఎమ్ఇ రంగం లో తయారీ పైన, ఇతర కార్యకలాపాల పైన తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఎమ్ఎస్ఎమ్ఇ లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల ను తొలగించే ఉద్దేశ్యం తో, పూర్తి స్థాయి పూచీకత్తు కలిగిన అత్యవసర క్రెడిట్ లైన్ రూపం లో అదనం గా 3 లక్షల కోట్ల రూపాయల నిధులు అందుబాటు లోకి తెచ్చేలా ఈ పథకాన్ని తీసుకువచ్చారు. కోవిడ్ -19 సంక్షోభం సృష్టించిన ఆర్థిక ఇబ్బందుల రీత్యా, సభ్య రుణదాత సంస్థలు (ఎమ్ఎల్ఐఎస్‌లు) అంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకింగేతర ఫైనాన్షియల్ కంపెనీలు(ఎన్‌బిఎఫ్‌సి లు) ఎమ్ఎస్ఎమ్ఇ రుణ గ్రహీతల కు అదనపు నిధుల సదుపాయాన్ని కల్పించడం, నిధుల అందుబాటు ను పెంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. అలాగే రుణగ్రహీత లు జిఇసిఎల్ ఫండింగు ను తిరిగి చెల్లించనందువల్ల ఏదైనా నష్టం వాటిల్లితే దానికి 100 శాతం గ్యారంటీ ని ఇందులో పొందుపరిచారు.
ఈ పథకంలోని ముఖ్యాంశాలు –
ఈ పథకం కింద జిఇసిఎల్ నిధులు పొందడానికి , ఎమ్ఎస్ఎమ్ఇ రుణ గ్రహీత ఖాతా లు కలిగిన వారై ఉండి, 2020వ సంవత్సరం ఫిబ్రవరి 29వ తేదీ నాటికి 25 కోట్ల రూపాయల వరకు రుణ బకాయి ని ఆ రోజు కంటే ముందు 60 రోజు లు, లేదా అంతకంటే తక్కువ కాలం కలిగి ఉన్న ఖాతాదారులు అంటే, రెగ్యులర్, ఎస్ఎమ్ఎ 0, ఎస్ఎమ్ఎ 1 ఖాతా లు, వార్షిక టర్నోవర్ 100 కోట్ల రూపాయల వరకు గల వారు అర్హులు.
అర్హత కలిగిన ఎమ్ఎస్ఎమ్ఇ రుణగ్రహీతల కు జిఇసిఎల్ నిధుల ను అదనపు వర్కింగ్ కాపిటల్ టరమ్ లోన్ ( బ్యాంకులు, ఆర్థిక సంస్థలైనట్లయితే) లేదా అదనపు టరమ్ లోన్ (ఎన్‌బిఎఫ్ సి లు అయినట్లయితే)ను 2020వ సంవత్సరం ఫిబ్రవరి 29వ తేదీ నాటికి, వాటి మొత్తం రుణ బకాయి లో 20 శాతం మొత్తం వరకు ఇస్తారు.
జిఇసిల్ ద్వారా అందించే మొత్తం నిధుల ను ఎన్ సిజిటిసి ద్వారా 100 శాతం గ్యారంటీ తో ఇసిఎల్‌జిఎస్ కింద ఎమ్ఎల్.ఐ ఎస్‌ల కు సమకూరుస్తారు.
ఈ పథకం కింద రుణ కాల పరిమితి 4 సంవత్సరాలు గా ఉంటుంది. అసలు పై ఒక ఏడాది మారటోరియం ఉంటుంది.
ఈ పథకం కింద మెంబర్ లెండింగ్ సంస్థ (ఎమ్ఎల్ఐ ఎస్) ల నుండి ఎసిజిటిసి ఎటువంటి గ్యారంటీ ఫీజు ను వసూలు చేయదు.
ఈ పథకం కింద వడ్డీరేట్ల పరిమితి బ్యాంకుల కు, ఆర్థిక సంస్థల కు (ఎఫ్ఐలకు) 9.25 శాతం గా, ఎన్‌బిఎఫ్‌సిల కు 14 శాతం గా నిర్ణయించారు.
పథకం అమలు కు సంబంధించిన షెడ్యూలు:
ఈ పథకం జిఇసిఎల్ కింద మంజూరైన అన్ని రుణాల కు, పథకం ప్రకటించిన తేదీ నుండి 2020 వసంవత్సరం అక్టోబర్ 31వ తేదీ వరకు లేదా జిఇసిఎల్ కింద 3 లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేసేంత వరకు- ఏది ముందు అయితే అది- వరకు ఉంటుంది.
ప్రభావం:
కోవిడ్ -19 మహమ్మారి కారణం గా తలెత్తిన అనూహ్య పరిస్థితులు, ఆ తదనంతరం ప్రకటించిన లాక్‌డౌన్ కారణంగా ఎమ్ఎస్ఎమ్ఇ రంగం తయారీ ఇతర కార్యకలాపాలు బాగా దెబ్బతిన్న నేపథ్యం లో వాటిని ఆదుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం గా ఈ పథకాన్ని రూపొందించారు. ఆర్థిక రంగం లో ఎమ్ఎస్ఎమ్ఇ లు పోషిస్తున్న కీలక పాత్ర, అవి కల్పిస్తున్న ఉపాధి అవకాశాల ను దృష్టి లో పెట్టుకొన్నప్పుడు ఈ పథకం ఈ రంగాని కి అత్యావశ్యకమైన సహాయాన్ని అందిస్తుంది. ఇందుకు ఎమ్ఎల్ఐల కు రాయితీల కింద అదనపు రుణ సదుపాయాన్ని 3 లక్షల కోట్ల రూపాయల వరకు తక్కువ ధర కు అందించడం జరుగుతుంది. దీనితో ఎమ్ఎస్ఎమ్ఇ లు వాటి యొక్క నిర్వహణ పరమైన బాధ్యతల ను నెరవేర్చడానికి వీలు కలగడంతో పాటు వాటి వ్యాపారాలను తిరిగి మొదలుపెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుత అనూహ్య పరిస్థితుల లో ఎమ్ఎస్‌ఎమ్ఇల కు మద్దతు ఇవ్వడం వల్ల అవి వాటి కార్యకలాపాల ను కొనసాగించ గలుగుతాయి. ఈ పథకం ఆర్థిక వ్యవస్థ పై సానుకూల ప్రభావాన్ని ప్రసరించే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడానికి మద్దతు ను కూడా ఇస్తుంది.