Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అత్యాశ కన్నా, ఆవ‌శ్య‌క‌తే భార‌త‌దేశాని కి మార్గ‌ద‌ర్శ‌క సూత్రం గా ఉందన్న ప్రధాన మంత్రి


 

క్లైమేట్ యాక్ష‌న్ స‌మిట్ లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఐరాస సాధార‌ణ స‌భ సంద‌ర్భం గా ఐరాస సెక్ర‌ట‌రి జ‌న‌ర‌ల్ ఏర్పాటు చేసిన క్లైమేట్ యాక్ష‌న్ స‌మిట్ యొక్క ప్రారంభ కార్య‌క్ర‌మం లో ప్ర‌సంగించారు.  

ఈ సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, గ‌త సంవ‌త్స‌రం లో చాంపియ‌న్ ఆఫ్ ద అర్థ్ అవార్డు ను స్వీక‌రించిన త‌రువాత ఐక్య రాజ్య స‌మితి ని ఉద్దేశించి ప్ర‌సంగించే అవ‌కాశం తన కు దక్కడం ఇదే మొద‌టి సారి అని పేర్కొన్నారు.  జ‌ల వాయు ప‌రివ‌ర్త‌న వంటి ఒక గంభీర‌మైన స‌వాలు ను అధిగ‌మించ‌డం కోసం ప్ర‌స్తుతం మ‌నం చేస్తున్న కృషి ఒక్క‌టే సరిపోదు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  ప్ర‌వ‌ర్త‌న పూర్వ‌క‌మైన‌ మార్పు ను తీసుకు రావ‌డాని కి ప్ర‌పంచ వ్యాప్త ప్ర‌జా ఉద్య‌మం అవ‌స‌ర‌ం అంటూ ఆయ‌న పిలుపునిచ్చారు.

ప్ర‌కృతి ని గౌర‌వించడం, వ‌న‌రుల ను ఆలోచనాపూర్వకం గా వినియోగించుకోవ‌డం, మ‌న అవ‌స‌రాల ను త‌గ్గించుకోవ‌డం, అలాగే మ‌న‌కు ఉన్న సాధనాల తో మ‌నుగ‌డ సాగించ‌డం.. ఇవి అన్నీ కూడాను ప్ర‌స్తుతం మేము నడుంకట్టిన ప్ర‌య‌త్నాల తో పాటు మా సంప్ర‌దాయాల తాలూకు ముఖ్య‌ అంశాలు అయి వున్నాయి.  అవ‌స‌రం మాత్ర‌మే త‌ప్ప‌ అత్యాశ కూడ‌దు అనేది మాకు మార్గ‌ద‌ర్శ‌క సూత్రం గా ఉంది.
మరి ఈ కార‌ణం గా భార‌త‌దేశం ప్ర‌స్తుతం ఈ సమస్య యొక్క గంభీర‌త ను గురించి మాట్లాడ‌టం ఒక్కటే కాకుండా ఒక ఆచ‌ర‌ణాత్మక దృక్ప‌థాన్ని, ఇంకా ఒక మార్గ‌సూచీ ని ఇక్కడ ఆవిష్క‌రించానికి వచ్చింది.  మేము ఒక ట‌న్ను ప్ర‌బోధాల కన్న ఒక ఔన్సు అభ్యాసం మరింత అధిక విలువ తో కూడుకొని ఉంటుంది అని విశ్వ‌సిస్తాము అని ఆయన చెప్పారు.

శిలాజ జ‌నితం కాన‌టువంటి ఇంధ‌నం యొక్క వాటా ను పెంచుతామని, 2022వ సంవ‌త్స‌రం క‌ల్లా భారతదేశం యొక్క నవీక‌ర‌ణ యోగ్య శ‌క్తి సామ‌ర్ధ్యాన్ని 175 గీగా వాట్ కన్నా అధికంగాను మ‌రియు ఆ తరువాత 450 జిడబ్ల్యు కు సైతం పెంచడం జరుగుతుందని ఆయన ప్రతిన పూనారు.  భార‌త‌దేశం ఇ-మొబిలిటీ ద్వారాను మరియు డీజిల్ లో, పెట్రోలు లో బ‌యో ఫ్యూయ‌ల్ మిశ్ర‌ణ నిష్ప‌త్తి ని గణనీయ స్థాయి లో పెంచుకోవడం ద్వారా ను ర‌వాణా రంగాన్ని హ‌రితమయం గా మ‌ల‌చాలని ప్ర‌ణాళిక‌ లు వేస్తోంది అని ఆయన వెల్లడించారు.  భారతదేశం లో 150 మిలియ‌న్ కుటుంబాల కు శుద్ధ‌ వంట గ్యాసు ను స‌మ‌కూర్చడమైందని కూడా ఆయన తెలిపారు.  

జ‌ల సంర‌క్ష‌ణ‌, వాన నీటి నిలవ, ఇంకా జ‌ల వ‌న‌రుల అభివృద్ధి కోసం జ‌ల్ జీవ‌న్ అభియాన్ ను ప్రారంభించడమైందని శ్రీ మోదీ అన్నారు.  వీటి కోసం రానున్న కొన్ని సంవ‌త్స‌రాల కాలం లో భార‌త‌దేశం ర‌మార‌మి 50 బిలియ‌న్ డాల‌ర్ లను  వెచ్చించ‌నున్నట్లు తెలిపారు. 
 
అంత‌ర్జాతీయ స్థాయి లో, దాదాపు గా 80 దేశాలు మా యొక్క అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఎ)లో చేరాయని ఆయన అన్నారు.  భార‌త‌దేశం మరియు స్వీడ‌న్  ఇత‌ర భాగ‌స్వామ్య దేశాల తో కలసి ఇండ‌స్ట్రీ ట్రాన్జిశ‌న్ ట్రాక్‌ కు లోప‌ల నాయ‌క‌త్వ బృందాన్ని ప్రారంభించ‌నున్నాయి.  ఈ కార్య‌క్ర‌మం టెక్నాల‌జీ ఇన‌వేశ‌న్ రంగం లో స‌హ‌క‌రించుకోవ‌డం కోసం ప్ర‌భుత్వాలకు, ప్రైవేటు రంగాని కి ఒక వేదిక ను అందిస్తుంది.  ఇది ప‌రిశ్ర‌మ రంగం కోసం త‌క్కువ క‌ర్బ‌న మార్గాల ను అభివృద్ధిచేయడం లో స‌హాయ‌కారి కాగలదన్నారు.

మా మౌలిక స‌దుపాయాల ను విప‌త్తుల‌ కు త‌ట్టుకొని నిల‌చే విధం గా రూపుదిద్ద‌డం కోసం భార‌త‌దేశం ఒక కొవలిశ‌న్ ఫ‌ర్ డిజాస‌ర్ట్ రిజిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ ను ప్రారంభించ‌నుందని ఆయన చెప్తూ ఈ కూట‌మి లో చేరవలసిందిగా ఇతర స‌భ్య‌త్వ దేశాల ను ఆహ్వానించారు.  ఈ సంవ‌త్స‌రం లో ఆగ‌స్టు 15వ తేదీ న భార‌త‌దేశ స్వాతంత్య్ర దినోత్స‌వం సందర్భం గా  ఒక‌సారి వాడి పడేసే ప్లాస్టిక్ వినియోగాని కి స్వ‌స్తి ప‌లకడం కోసం ఒక ప్ర‌జా ఆందోళ‌న కు పిలుపునివ్వడమైందన్నారు.  మాటలు
చెప్తూ కాలయాపన చేయడాని కి కాలం చెల్లింది; ప్రపంచానికి ఇక కావలసింది చేతలే అని ఆయన స్పష్టం చేశారు.