లావో పిడిఆర్‌లోని వియంటియాన్‌లో 10వ తేదీన జరిగిన 21వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్) సభ్య దేశాలు, భారత్ జారీ చేసిన సంయుక్త ప్రకటన…
ఈ వ్యవస్థను 1992లో ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆసియాన్-భారత్ సంబంధాలు- ప్రాథమిక సూత్రాలు, భాగస్వామ్య విలువలు, నిబంధనల మార్గనిర్దేశం అనుగుణంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఆసియాన్-భారత సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. ఆసియాన్-భారతదేశ స్మారక శిఖరాగ్ర సదస్సు (2012) విజన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్న అంశాలు, ఆసియాన్-ఇండియా (2018) 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని చేసిన ఢిల్లీ డిక్లరేషన్, శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ఇండో-పసిఫిక్‌పై ఆసియాన్ దృష్టికోణం-సహకారంపై ఆసియాన్-భారత్ సంయుక్త ప్రకటన (2021); ఆసియాన్-భారత సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం (2022), సముద్ర సహకారంపై ఆసియాన్-భారత సంయుక్త ప్రకటన (2023); సంక్షోభాలకు ప్రతిస్పందనగా ఆహార భద్రత, పోషకాహారాన్ని బలోపేతం చేయడంపై ఆసియాన్-భారత నాయకుల సంయుక్త ప్రకటన (2023); వీటన్నిటిలో పేర్కొన్న అంశాలను నేడు పునరుద్ఘాటిస్తూ చేసిన ప్రకటన ఇది.
అలాగే ఈ ప్రకటనలో మరికొన్ని అంశాలను పేర్కొన్నారు. డిజిటల్ రంగంలో మార్పునకు ప్రేరణగా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) కీలక పాత్రను గుర్తించడం, పబ్లిక్ సర్వీస్ డెలివరీలో చేరిక, సామర్థ్యం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం; వివిధ దేశీయ, అంతర్జాతీయ సందర్భాలను పరిగణనలోకి తీసుకుని భౌగోళిక ప్రాంతాలలో వ్యక్తులు, సంఘాలు, పరిశ్రమలు, సంస్థలు, దేశాలను అనుసంధానించడం;
ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న డిజిటల్ అంతరాలను తగ్గించడానికి సాంకేతికత వేగవంతమైన మార్పులను తీసుకొస్తుందని ఈ సదస్సు గుర్తించింది. ప్రాంతీయ ఆర్థిక ఏకీకరణను ప్రోత్సహిస్తూ సమగ్ర, స్థిరమైన అభివృద్ధి కోసం పురోగతిని వేగవంతం చేయగలదని ఉమ్మడి ప్రకటన స్పష్టం చేసింది.
ఆసియాన్ డిజిటల్ మాస్టర్‌ప్లాన్ 2025 (ఏడిఎం 2025) అమలుకు భారతదేశం అందించిన సహకారాన్ని అభినందించారు. జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో అత్యాధునిక కేంద్రాల ఏర్పాటు ఈ కార్యక్రమాలలో ఒక భాగం. దీనితో పాటు ఆసియాన్-ఇండియా డిజిటల్ వర్క్ ప్లాన్‌లలో సహకార కార్యకలాపాల విజయాలపై సిఎల్ఎంవి (కంబోడియా, లావోస్, మయన్మార్, వియత్నాం) దేశాలలో శిక్షణపై కూడా ఒక అభిప్రాయానికి వచ్చాయి;
ఇంకా గణనీయమైన సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు కలిగించేలా, విజయవంతమైన డిపిఐ కార్యక్రమాలను అభివృద్ధి చేయడంలో, అమలు చేయడంలో భారతదేశ నాయకత్వ గణనీయమైన పురోగతిని గుర్తించడం ఈ ప్రకటనలో ఒక అంశం.
ఆసియాన్ డిజిటల్ మాస్టర్‌ప్లాన్ 2026-2030 (ఏడిఎం 2030) పురోగతిని గుర్తిస్తూ, ఆసియాన్ అంతటా డిజిటల్ అభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆసియాన్ కమ్యూనిటీ విజన్ 2045 ఉమ్మడి లక్ష్యాలకు అనుగుణంగా, ఏడిఎం 2025 విజయాల ఆధారంగా 2030 కల్లా తదుపరి దశ డిజిటల్ పురోగతికి సందిగ్ధ రహిత మార్పును సులభతరం చేస్తుంది.
ఆసియాన్ దేశాలలో డిజిటల్ అభివృద్ధి సహకారంపై దృష్టి సారించి, డిజిటల్ భవిష్యత్ కోసం ఆసియాన్-ఇండియా ఫండ్‌ను ఏర్పాటు చేసినందుకు భారతదేశాన్ని ఈ ఉమ్మడి ప్రకటన అభినందించింది.
కింది రంగాల్లో సహకారాన్ని పటిష్టం చేసుకోవాలని ప్రకటించాయి. .
1. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
1.1 ప్రాంతం అంతటా డిపిఐ అభివృద్ధిని ప్రోత్సహించడానికి వివిధ రకాల ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించాలి. దీని ద్వారా డిపిఐ అభివృద్ధి, అమలుతో పాటు పాలనలో జ్ఞానం, అనుభవాలు, ఉత్తమ అభ్యాసాలను పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటాయి. ఇందుకు ఆసియాన్ సభ్య దేశాలు, భారతదేశం పరస్పర సమ్మతితో, సహకారం కోసం మేము అవకాశాలను గుర్తించాం ;
1.2 ప్రాంతీయ అభివృద్ధి, ఏకీకరణ కోసం డిపిఐ ని ప్రభావితం చేసే ఉమ్మడి కార్యక్రమాలు, ప్రాజెక్ట్‌లకు సంభావ్య అవకాశాలను మేము గుర్తించాం.
1.3 విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాతావరణ మార్పులు వంటి విభిన్న సవాళ్లను పరిష్కరించడంలో వివిధ రంగాలలో డిపిఐ ని ప్రభావితం చేయడానికి మేము సహకారాన్ని అన్వేషిస్తాం.
2. ఫైనాన్షియల్ టెక్నాలజీ
2.1 ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యానికి ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్), ఇన్నోవేషన్ కీలకమైన చోదకాలుగా మేము గుర్తించాం:
2.2 మా లక్ష్యం… :
ఏ. భారతదేశం, ఆసియాన్ లో అందుబాటులో ఉన్న డిజిటల్ సర్వీస్ డెలివరీని ప్రారంభించే వినూత్న డిజిటల్ పరిష్కారాలను శోధించడం; దీని ద్వారా ఆసియాన్, భారతదేశంలోని చెల్లింపు వ్యవస్థల మధ్య సరిహద్దు అనుసంధానాల సంభావ్య సహకారానికి అన్వేషణ.
బి. ఫిన్‌టెక్ ఆవిష్కరణల కోసం జాతీయ ఏజెన్సీల మధ్య భాగస్వామ్యాన్ని అన్వేషించడం, డిజిటల్ ఆర్థిక పరిష్కారాలతో సహా డిజిటల్ పరిష్కారాలకు మద్దతు ఇవ్వడం
3. సైబర్ సెక్యూరిటీ
3.1 మా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సైబర్ సెక్యూరిటీలో సహకారం కీలకమైన భాగమని మేము గుర్తించాం .
3.2 మేము ‘ఆసియాన్ ఇండియా ట్రాక్ 1 సైబర్ పాలసీ చర్చలను స్వాగతిస్తున్నాం. ఈ సంవత్సరం అక్టోబర్‌లో దాని మొదటి సమావేశం కోసం ఎదురుచూస్తున్నాం;
3.3 డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా మా సైబర్ భద్రతా సహకారాన్ని విస్తరించాలని భావిస్తున్నాం. మేము క్రమంగా పెరుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థల వైపు వెళుతున్నప్పుడు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, సేవల భద్రత, స్థితిస్థాపకతను నిర్ధారించడానికి మేము ప్రయత్నిస్తాం;
4. కృత్రిమ మేధ (ఏఐ)
4.1 ఏఐ సాంకేతికతలు, అప్లికేషన్‌లను సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా ఏఐ పురోగమనాల సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటాం . ఇందుకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలు, రిస్క్ మేనేజ్‌మెంట్ విధాన వ్యవస్థలు, విధానాల అభివృద్ధికి మేము మద్దతు ఇస్తాం.
4.2 ఏఐ ద్వారా స్థిరమైన అభివృద్ధిని సాధించడంలో కంప్యూటింగ్, డేటా-సెట్‌లు, ఫౌండేషన్ మోడల్‌లతో సహా ఏఐ సాంకేతికతలు అందుబాటులో ఉండడం కీలకమని మేము గుర్తించాం. అందువల్ల, సంబంధిత జాతీయ చట్టాలు, నియమాలు, నిబంధనలకు అనుగుణంగా సామాజిక ప్రయోజనాల కోసం ఏఐ వనరుల ప్రజాస్వామ్యీకరణ కోసం మేము సహకరిస్తాం.
4.3 ఏఐ ఉద్యోగ స్థితి గతులను వేగంగా మారుస్తుందని, ఉద్యోగులకు మళ్ళీ శిక్షణ ఇవ్వడం, నూతన కౌశల్యాలు నేర్పుకోవాల్సిన అవసరం ఉందని మేము గుర్తిస్తున్నాం. మేము ఏఐ విద్యా కార్యక్రమాలపై సామర్థ్య పెంపుదలకు సహకారాన్నిఅందిస్తాం, ఏఐ లక్షిత వృత్తి శిక్షణా కార్యక్రమాలను అభివృద్ధి చేస్తాం. భవిష్యత్ లో ఆయా దేశాల్లో ఉద్యోగాలను పొందేందుకు వీలుగా అవసరమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే విధానాన్ని అందుబాటులోకి తెస్తాం.
4.4 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాల్లో అందరికీ గురి కుదిరేలా చేయడానికి బాధ్యతాయుతమైన, పటిష్ఠమైన, పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై దృష్ఠ్టి పెడతాం. దీన్ని అంచనా వేయడానికి పాలన, ప్రమాణాలు, సాధనాలపై అధ్యయనాల రూపకల్పనకు అన్ని దేశాలు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నాం
5. కెపాసిటీ బిల్డింగ్, నాలెడ్జ్ షేరింగ్
5.1. డిజిటల్ మార్పును సులభతరం చేసే లక్ష్యంతో సంబంధిత అంశాలపై దృష్టి సారించే వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం. అలాగే ఇతర సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల కోసం మేము ఆసియాన్ ఇండియా డిజిటల్ మంత్రుల సమావేశంతో సహా ఇప్పటికే ఉన్న ఫ్రేమ్‌వర్క్‌లను ఉపయోగిస్తాము;
5.2. పరస్పర అధ్యయనం, అవసరాలకు అనుగుణంగా డిపిఐతో సహా మా సంబంధిత డిజిటల్ పరిష్కారాల గురించి జ్ఞానాన్ని పంచుకోవడానికి మేము మద్దతు ఇస్తున్నాం.
6. స్థిరమైన ఫైనాన్సింగ్, పెట్టుబడి
6.1. ఈ సంవత్సరం ప్రారంభించిన ఆసియాన్ ఇండియా ఫండ్ ఫర్ డిజిటల్ ఫ్యూచర్ కింద కార్యకలాపాలకు మొదట్లో నిధులు సమకూరుస్తాం. ఆ తర్వాత పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం, అంతర్జాతీయ నిధులు, వినూత్న ఫైనాన్సింగ్ మోడల్‌లతో సహా డిజిటల్ కార్యక్రమాలకు ఫైనాన్సింగ్ చేసే విధానాలను అన్వేషిస్తాం.
7. అమలు విధానం
7.1. డిజిటల్ పరివర్తన పురోగతి కోసం ఆసియాన్, భారతదేశం మధ్య సహకారాన్ని నిర్ధారించడానికి, ఈ ఉమ్మడి ప్రకటనను అనుసరించడానికి, అమలు చేయడానికి ఆసియాన్ – భారత్‌లోని సంబంధిత సంస్థలను నియమించాల్సి ఉంటుంది.
***
Sharing my remarks at the India-ASEAN Summit.https://t.co/3HbLV8J7FE
— Narendra Modi (@narendramodi) October 10, 2024
The India-ASEAN Summit was a productive one. We discussed how to further strengthen the Comprehensive Strategic Partnership between India and ASEAN. We look forward to deepening trade ties, cultural linkages and cooperation in technology, connectivity and other such sectors. pic.twitter.com/qSzFnu1Myk
— Narendra Modi (@narendramodi) October 10, 2024
Proposed ten suggestions which will further deepen India’s friendship with ASEAN. pic.twitter.com/atAOAq6vrq
— Narendra Modi (@narendramodi) October 10, 2024