Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అత్యవసర పరిస్థితి ని లోక్ సభ స్పీకర్ ఖండించడాన్నికొనియాడిన ప్రధాన మంత్రి


అత్యవసర పరిస్థితి ని మరియు ఆ తరువాతి కాలం లో ఒడిగట్టినటువంటి అకృత్యాలను తీవ్రం గా గర్హించినందుకు గాను గౌరవనీయ లోక్ సభ స్పీకరు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ లో –

‘‘అత్యవసర పరిస్థితి ని మానవీయ స్పీకర్ తీవ్రంగా ఖండించడం నాకు సంతోషాన్ని కలిగించింది. ఆయన అత్యవసర పరిస్థితి కాలం లో జరిగిన అఘాయిత్యాలను గురించి, దౌర్జన్యాలను గురించి ప్రముఖం గా పేర్కొనడం తో పాటుగా ప్రజాస్వామ్యాన్ని ఏ విధం గా పీక నులమడం జరిగిందో కూడా ను ప్రస్తావించారు. ఆ రోజుల లో యాతన లు పడిన వ్యక్తులు అందరి గౌరవార్థం మౌనాన్ని పాటించడం చాలా భావపూర్ణం గా ఉంది.

 

అత్యవసర పరిస్థితి ని 50 సంవత్సరాల క్రితం విధించడమైంది, అయితే దీనిని గురించి తెలుసుకోవడం ఈనాటి యువజనులకు ఎంతో ముఖ్యం; ఎందుకు అంటే రాజ్యాంగాన్ని అణగద్రొక్కినప్పుడు, ప్రజాభిప్రాయాన్ని కాలరాచినప్పుడు మరియు సంస్థల ను నష్ట పరచినప్పుడు.. అప్పుడు ఏం జరుగుతుందనే దానికి ఇది సరైన నిదర్శన అన్నమాట. అత్యవసర పరిస్థితి కాలం లో జరిగినటువంటి ఘటనలతో నియంతృత్వం అంటే ఎలా ఉంటుందనేది తెలియవస్తుంది.’’ అని పేర్కొన్నారు.