హెచ్ఎఎల్ సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.26,500 కోట్ల (పన్ను లెక్కించక ముందు) అత్యధిక ఆదాయం ఆర్జించడంపై ఆ సంస్థ సిబ్బంది మొత్తాన్నీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ.24,620 కోట్లు ఆర్జించగా, ఈ ఏడాది కార్యకలాపాల ద్వారా ఆదాయంలో 8 శాతం వృద్ధిని సాధించింది.
దీనిపై హెచ్‌ఎఎల్ సంస్థ ట్వీట్‌కు స్పందనగా పంపిన సందేశంలో:
“ఇది చాలా అరుదైన విజయం! ఈ మేరకు అద్భుతమైన నిబద్ధత, ఉత్సాహం ప్రదర్శించిన హెచ్‌ఎఎల్ బృందం మొత్తానికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Exceptional! I laud the entire team of HAL for their remarkable zeal and passion. https://t.co/KgGaCDh82R
— Narendra Modi (@narendramodi) April 1, 2023