Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అగ్ని 5 ను ప్రయోగాత్మకంగా పరీక్షించడంలో సఫలమైన డిఆర్ డిఒ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


అగ్ని 5 ను ప్రయోగాత్మకంగా పరీక్షించడంలో సఫలమైన డిఆర్ డిఒ ను, డిఆర్ డి ఒ శాస్త్రవేత్తలను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

“అగ్ని 5 ను ప్రయోగాత్మకంగా పరీక్షించడం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వపడేటట్లు చేస్తోంది. ఇది మన వ్యూహాత్మక రక్షణకు బ్రహ్మాండమైన శక్తిని జోడించేటటువంటిది.

అగ్ని 5 ను ప్రయోగాత్మకంగా పరీక్షించడంలో లభించిన విజయం డిఆర్ డి ఒ మరియు ఆ సంస్థ కు చెందిన శాస్త్రజ్ఞ‌ుల కఠిన పరిశ్రమ ఫలితం. వారికి ఇవే నా అభినందనలు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.