Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అక్టోబ‌ర్ 25న మ‌న్ కీ బాత్ రేడియో కార్య‌క్ర‌మం


ప్ర‌జ‌లు త‌మ ఆలోచ‌న‌ల్ని, వాయిస్ సందేశాల్ని పంచుకోవాలని కోరిన ప్ర‌ధాని

ఈ నెల 25వ తేదీ (ఆదివారం)న మ‌న్‌కి బాత్ కార్య‌క్ర‌మం ప్ర‌సారం కానున్న‌ది. ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ త‌న ఆలోచ‌న‌ల్ని దేశ ప్ర‌జ‌ల‌తో పంచుకోనున్నారు. మ‌న్ కి బాత్ కార్య‌క్ర‌మానికి సంబంధించి ప్ర‌జ‌లు త‌మ ఆలోచ‌న‌ల్ని మైగ‌వ్ ఓప‌న్ ఫోరంలో పంచుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని కోరారు. ఈ ఆదివారం ప్ర‌సారం కానున్న మ‌న్ కి బాత్ కార్య‌క్ర‌మంకోసం మీ ద‌గ్గ‌ర ఐడియాలేమైనా ఉన్నాయా? వాటిని మై గ‌వ్ ఓప‌న్ ఫోరంద్వారా పంచుకోండి. దీనికి సంబంధించిన లింక్‌… https://mygov.in/group-issue/give-your-inputs-prime-ministers-mann-ki-baat-25th-october-2015/ అంటూ ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ త‌న‌ ట్వీట్ ద్వారా ప్ర‌జ‌ల‌ను కోరారు. టోల్ ఫ్రీ నంబ‌రు 1800-3000-7800 ద్వారా ప్ర‌జ‌లు వాయిస్ సందేశాల‌ను కూడా పంచుకోవ‌చ్చ‌ని ప్ర‌ధాని సూచించారు. ఎంపిక చేసిన వాయిస్ సందేశాల‌ను మ‌న్ కి బాత్ కార్య‌క్ర‌మంలో ప్ర‌సారం చేస్తామ‌ని ఆయ‌న త‌న ట్వీట్ ద్వారా కోరారు. ఈ ఆదివారం (అక్టోబ‌ర్ 25) ప్ర‌సారం కానున్న మ‌న్ కి బాత్ 13వ ఎడిష‌న్‌. ఇది ఆ రోజున ఉద‌యం 11 గంట‌ల‌కు ఆల్ ఇండియా రేడియోలో ప్ర‌సారమ‌వుతుంది. ఈ కార్య‌క్ర‌మం ఆల్ ఇండియా నెట్‌వ‌ర్క్ మొత్తం ప్ర‌సార‌మ‌వుతుంది. దూర‌ద‌ర్శ‌న్ ఛానెళ్ల‌లో కూడా ఇది ప్ర‌సార‌మ‌వుతుంది. అంతే కాదు ఇది ప్ర‌ధాని కార్యాల‌యం, కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌కు సంబంధించిన యూట్యూబ్ ఛానెళ్ల‌లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం కానున్న‌ది. మ‌న్ కి బాత్ లో ప్ర‌ధాని ప్ర‌సంగం ఆయా ప్రాంతీయ భాష‌ల్లోకి త‌ర్జుమా అయి అదే రోజున సాయంత్రం 8 గంట‌ల‌కు ఆయా ప్రాంతాల ఆల్ ఇండియా రేడియో స్టేష‌న్ల‌లో ప్ర‌సార‌మ‌వుతుంది.

****