Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అక్టోబర్ 25వ తేదీన ఉత్తరప్రదేశ్ లో పర్యటించి, ఆత్మనిర్భర్ స్వస్త్ భారత్ యోజన (పి.ఎం.ఏ.ఎస్.బి.వై) ని ప్రారంభించనున్న – ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబర్, 25వ తేదీన ఉత్తరప్రదేశ్ సందర్శిస్తారు.  సిద్ధార్థ నగర్‌ లో ఉదయం 10 గంటల 30 నిముషాలకు, ఉత్తర ప్రదేశ్‌ లోని తొమ్మిది వైద్య కళాశాలలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.  అనంతరం, ప్రధానమంత్రి, వారణాసిలో మధ్యాహ్నం ఒంటి గంటా 15 నిమిషాలకు, ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్త్ భారత్ యోజన ను ప్రారంభిస్తారు.  వారణాసి కి సంబంధించి 5,200 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభిస్తారు.

దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి అమలయ్యే అతిపెద్ద పాన్-ఇండియా పథకాల్లో, ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్త్ భారత్ యోజన (పి.ఎం.ఏ.ఎస్.బి.వై) ఒకటి కానుంది.  జాతీయ ఆరోగ్య మిషన్‌ కు ఇది అదనంగా ఉంటుంది.

ప్రజారోగ్య మౌలిక సదుపాయాలలో ముఖ్యంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్లిష్టమైన సంరక్షణ సౌకర్యాలతో పాటు, ప్రాథమిక సంరక్షణ లో క్లిష్టమైన అంతరాలను పూరించడం, పి.ఎం.ఏ.ఎస్.బి.వై. లక్ష్యంగా నిర్ణయించారు.  పది 10 హై ఫోకస్ రాష్ట్రాలలోని, 17,788 గ్రామీణ ఆరోగ్య, స్వస్థత కేంద్రాలకు, ఈ పథకం మద్దతు ఇస్తుంది. అదేవిధంగా, అన్ని రాష్ట్రాలలో 11,024 పట్టణ ఆరోగ్య, స్వస్థత కేంద్రాలను ఏర్పాటు కానున్నాయి. 

దేశంలో, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న అన్ని జిల్లాలలో, ప్రత్యేకమైన క్రిటికల్ కేర్ ఆసుపత్రుల ద్వారా, క్లిష్టమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉంటాయి, కాగా, మిగిలిన జిల్లాల్లో రిఫెరల్ సేవల ద్వారా ఈ ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉంటాయి. 

దేశవ్యాప్తంగా ఉన్న ప్రయోగశాలల వ్యవస్థ ద్వారా ప్రజారోగ్య సంరక్షణ విధానంలో పూర్తి స్థాయి వ్యాధి నిర్ధారణ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.  ఇందుకోసం, అన్ని జిల్లాల్లో సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 

పి.ఎం.ఏ.ఎస్.బి.వై. కింద, పూర్తి ఆరోగ్యం కోసం ఒకటి; వైరాలజీ కోసం నాలుగు నూతన జాతీయ సంస్థలు; ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆగ్నేయాసియా ప్రాంతానికి సంబంధించి ఒక ప్రాంతీయ పరిశోధన వేదిక; 3వ స్థాయి జీవ భద్రత ప్రయోగశాలలు తొమ్మిది;  వ్యాధి నియంత్రణ కోసం ఐదు నూతన ప్రాంతీయ స్థాయి జాతీయ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. 

మహానగరాలలో బ్లాక్, జిల్లా, ప్రాంతీయ, జాతీయ స్థాయిలో నిఘా ప్రయోగశాలల వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా ఐ.టి. ఆధారిత వ్యాధి పర్యవేక్షణ విధానాన్ని నిర్మించాలని, పి.ఎం.ఏ.ఎస్.బి.వై. లక్ష్యంగా పెట్టుకుంది.  అన్ని ప్రజారోగ్య ప్రయోగశాలలను అనుసంధానం చేయడానికి సమగ ఆరోగ్య సమాచార పోర్టల్ సేవలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించడం జరుగుతుంది. 

అత్యవసర ప్రజారోగ్య పరిస్థితులను ఎదుర్కోవడం, వ్యాధి వ్యాప్తిని సమర్థవంతంగా గుర్తించడం, పరిశోధించడం, నివారించడం, పోరాడడం కోసం. 17 కొత్త ప్రజారోగ్య యూనిట్లను కార్యాచరణలో నిమగ్నం చేయడంతో పాటు, 33 ప్రజారోగ్య యూనిట్లను బలోపేతం చేయాలని కూడా   పి.ఎం.ఏ.ఎస్.బి.వై. లక్ష్యంగా పెట్టుకుంది.  ఎటువంటి అత్యవసర ప్రజారోగ్య పరిస్థితుల్లోనైనా, వెంటనే ప్రతిస్పందించడానికి వీలుగా శిక్షణ పొందిన ఫ్రంట్‌-లైన్ ఆరోగ్య కార్యకర్తలను రూపొందించడానికి కూడా ఈ పథకం పని చేస్తుంది.

ప్రస్తుతం ప్రారంభించనున్న తొమ్మిది వైద్య కళాశాలలు సిద్ధార్థనగర్, ఈటా, హర్దోయ్, ప్రతాప్‌-గఢ్, ఫతేపూర్, డియోరియా, ఘజిపూర్, మీర్జాపూర్, జౌన్‌-పూర్ జిల్లాలలో ఉన్నాయి.  “జిల్లా / రిఫరల్ ఆసుపత్రులతో జతచేయబడిన కొత్త వైద్య కళాశాలల స్థాపన” కోసం కేంద్ర ప్రాయోజిత పథకం కింద  8 వైద్య కళాశాలలు మంజూరయ్యాయి.   కాగా, జాన్‌-పూర్‌లో ఒక వైద్య కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరుల ద్వారా నిర్వహిస్తుంది. 

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద, వెనుకబడిన, సరైన సేవలు అందుబాటులో లేని, ఆశాజనక జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.  ఆరోగ్య నిపుణుల లభ్యతను పెంచడం, వైద్య కళాశాలల ఏర్పాటులో ప్రస్తుతం ఉన్న భౌగోళిక అసమతుల్యతను సరిచేయడంతో పాటు, జిల్లా ఆసుపత్రుల ప్రస్తుత మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించడం ఈ పథకం లక్ష్యంగా నిర్ణయించారు.  ఈ పథకం కింద, మూడు దశల్లో, దేశవ్యాప్తంగా 157 కొత్త వైద్య కళాశాలలను ఆమోదించడం జరుగుతుంది. వీటిలో, 63 వైద్య కళాశాలలు ఇప్పటికే పనిచేస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్, ముఖ్యమంత్రి తో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా పాల్గొంటారు. 

*****