Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అక్టోబరు 2న ప్రధానమంత్రి జార్ఖండ్ పర్యటన


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 2వ తేదీన జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించనున్నారుమధ్యాహ్నం దాదాపు గంటల సమయంలో ప్రధానమంత్రి జార్ఖండ్ లోని హజారీబాగ్ లో రూ. 83,300 కోట్లకు పైగా విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతోపాటుకొన్నింటిని ప్రారంభిస్తారు.

ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా గిరిజన సముదాయాల సమగ్రసర్వతోముఖ అభివృద్ధికి పాటుపడాలన్న తన నిబద్ధతకు అనుగుణంగా– మొత్తం రూ.79,150 కోట్లకు పైగా వ్యయంతో అమలు కానున్న ‘ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’  పథకాన్ని ప్రారంభించనున్నారు.  30 రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాలలో 549 జిల్లాలు, 2,740 బ్లాకుల పరిధిలోని దాదాపు 63 వేల పల్లెల్లో గల కోట్లకు పైచిలుకు ఆదివాసీ నివాసితులకు ఈ కార్యక్రమం లబ్ధిని చేకూర్చనుందికేంద్ర ప్రభుత్వంలో 17 మంత్రిత్వ శాఖలువిభాగాలు అమలు చేసే 25 కార్యక్రమాల ద్వారా మౌలిక సదుపాయాలుఆరోగ్యంవిద్యజీవనోపాధి రంగాలలో ఉన్న లోటుపాట్లను చక్కదిద్దిప్రభుత్వ పథకాల తాలూకు ప్రయోజనాలను అందరూ అందుకొనేట్లు చూడాలన్నదే ఈ అభియాన్ లక్ష్యం.

గిరిజనులకు విద్య పరమైన మౌలిక సదుపాయాలను పెంచే కృషిలో భాగంగా, 40 ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల (ఇఎమ్ఆర్ఎస్ను ప్రధానమంత్రి ప్రారంభించడంతో పాటు ఇఎమ్ఆర్ఎస్ తరహా 25 పాఠశాలల నిర్మాణానికి శంకుస్థాపనను కూడా చేయనున్నారువీటి కోసం రూ.2,800 కోట్లకు పైగా ఖర్చవుతుంది.

ప్రధానమంత్రి జన్ జాతీ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పిఎమ్జెఎన్ ఎఎమ్ఎన్)’ లో భాగంగా రూ.1360 కోట్ల పైచిలుకు విలువ కలిగిన అనేక ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవంశంకుస్థాపన చేయనున్నారువీటిలో 1380 కిలో మీటర్లకు పైగా పొడవైన రహదారి మార్గాల పనులు, 120 ఆంగన్‌వాడీలు, 250 బహుళ ప్రయోజన కేంద్రాలు, 10 పాఠశాల వసతి గృహాలు ఉన్నాయిపీఎమ్జన్ మన్ లో భాగంగా పలు ప్రతిష్ఠాత్మక పథకాలను కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు

 

అట్టడుగు స్థాయిలో ఉన్న 3,000 పల్లెలకు చెందిన 75,800 గిరిజలనుల(పర్టిక్యులర్లీ వల్నరబల్ ట్రైబల్ గ్రూప్స్– పివిటిజి)కు చెందిన ఆవాసాలకు విద్యుచ్ఛక్తి సరఫరా, 275 సంచార వైద్యాలయాల పునరుద్ధరణ, 500 ఆంగన్‌వాడీ కేంద్రాల పునరుద్ధరణ, 250 వన్ ధన్ వికాస్ కేంద్రాల ఏర్పాటు, 5,550 కి పైగా పివిటిజి నివాసితుల గ్రామాలకు ‘పంపుల ద్వారా తాగునీటి సరఫరా (‘నల్ సే జల్’వంటి పథకాలు ఉన్నాయి.

***