ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ,కువైట్ లో అకౌంటింగ్, ఫైనాన్షియల్, ఆడిట్ పరిజ్ఞాన ఆధారిత సామర్ధ్యాల పెంపు,వాటిని పటిష్టం చేయడానికి సంబంధించి ఒక అవగాహనా ఒప్పందానికి ఆమోదం తెలిపింది.
ప్రయోజనాలు:
ఉభయ దేశాల కు సంబంధించిన సంస్థ ల అవగాహనా ఒప్పందం ప్రకారం:
1. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ), కువైట్ అకౌంట్స్, ఆడిటర్స్ అసోసియేషన్ (కెఎఎఎ) సంస్థలు కువైట్ లో సాంకేతిక కార్యక్రమాలు, సదస్సుల ను నిర్వహించడం ద్వారా ఇరు సంస్థల సభ్యుల ప్రయోజనాల ను కాపాడేందుకు, వారి వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచేందుకు ఉమ్మడి గా వీటిని నిర్వహించేందుకు కలిసి పని చేయనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతి కార్యక్రమాని కి సంబంధించి అయ్యే ఖర్చు ను ఇరు పార్టీలు రాత పూర్వకం గా అంగీకరించిన దాని ప్రకారం భరిస్తాయి.
2. కార్పొరేట్ పాలన, సాంకేతిక అధ్యయనం, సలహా, నాణ్యతా హామీ, ఫోరెన్సిక్ అకౌంటింగ్, చిన్న, మధ్యతరహా ప్రాక్టీసులు, ఇస్లామిక్ ఫైనాన్స్, వృత్తిపరమైన అభివృద్ధి కొనసాగింపు, ఉభయపక్షాల కు ఆసక్తి కలిగిన ఇతర అంశాలపై ఐసిఎ, కె.ఎ.ఎ.ఎ తగిన సహకారం తో వ్యవహరించేందుకు కలిసి పని చేయనున్నాయి. ఇలాంటి ఈవెంట్ లు నిర్వహించుకునేందుకు కెఎఎఎ అవకాశం ఇవ్వడంతోపాటు తన విద్యార్థులు, ఫాకల్టీ సభ్యులు ఈ ఈవెంట్‌ల లో పాల్గొనేందుకు ప్రోత్సహించనుంది.
3. ప్రతిపాదిత ఎం.ఒ.యు లోని ప్రొవిజన్ల ప్రకారం, ఐసిఎఐ, కె.ఎ.ఎ.ఎ లు పరస్పర సహకారాని కి సంబంధించి భవిష్యత్తు పరిణామాల ను చర్చించేందుకు ఆసక్తి తో ఉంది. ముందుగా ఈ చర్చలు రెండు సంస్థల సభ్యులు, రెండు వృత్తుల కు సంబంధించిన అంశాలు, స్వీయ నియంత్రణా ఫ్రేమ్ వర్క్, బాహ్య నియంత్రణ, సహకారం, వ్యవస్థ, నిర్మాణాని కి సంబంధించి న ఒక అవగాహన ఏర్పరచుకునే ప్రాతిపదిక గా ఈ చర్చలు ఉండనున్నాయి. ఇది సంబంధిత సంస్థల పాలన, వాటి ప్రభావాన్ని మెరుగు పరిచే లక్ష్యం తో ఉంటుంది.
4. కువైట్ పౌరులు, ఐసిఎఐ సభ్యుల కోసం కువైట్ లో అకౌంటింగ్, ఫైనాన్స్, ఆడిట్ డొమైన్ లో స్వల్పకాలిక ప్రొఫెషనల్ కోర్సుల ను అందించడానికి కెఎఎఎ, ఐసిఎఐ సహకరిస్తాయి
5. పరస్పర ఆసక్తి ఉన్న గుర్తించబడిన రంగాల లో సహకారాన్ని నెలకొల్పడానికి ఐసిఎ, కెఎఎఎ లు కలిసి పని చేయడానికి తగిన చర్యలు తీసుకుంటాయి. కెఎఎఎ సహకారంతో కువైట్ ప్రభుత్వ, మంత్రిత్వ శాఖ లు, సభ్యులు కువైట్ జాతీయుల ఉద్యోగుల కు సాంకేతిక కార్యక్రమాల ను అందిస్తుంది.
6. కువైట్ లో, ఇండియన్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వారు స్థానిక వ్యాపార వర్గాల కు,సంబంధిత వర్గాల కు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ విషయాల పై సహాయం చేస్తోంది ఇది చాలా గౌరవప్రదమైన స్థాయి లో ఉంది. ప్రతిపాదిత అవగాహన ఒప్పందం , కువైట్ లోని ఇండియన్ చార్టర్డ్ అకౌంటెంట్ల కోసం సానుకూల దృక్పథాన్ని ఏర్పరచడాని కి, వారిపై విశ్వాసాన్ని పటిష్ఠ పరచడాని కి సహాయ పడుతుందని భావిస్తున్నారు.
సమర్థన:
ఎ. మధ్య ప్రాచ్య ప్రాంతం లో ఐసిఎఐ కి 6000 మంది సభ్యుల బలం ఉంది, ఇక కువైట్ కు చెందిన కెఎఎఎ కు సహాయం అందించేందుకు ఉద్దేశించిన అవగాహన ఒప్పందం, ఈ ప్రాంతంలోని ఐసిఎఐ సభ్యులకు ప్రయోజనం చేకూర్చనుంది అలాగే ఐసిఎఐ సభ్యుల అవకాశాల కు అదనపు ఊతం ఇస్తుంది.
బి. ఐసిఎఐ సభ్యులు, విద్యార్థులు వారి సంస్థల ప్రయోజనం కోసం పరస్పర ప్రయోజనకరమైన సంబంధాన్ని పెంపొందించడానికి కలిసి పని చేయడం ఈ ఎంఒయు లక్ష్యం.
***