Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అంత‌రిక్షాన్ని శాంతియుత ప్ర‌యోజ‌నాల కోసం వినియోగించుకోవ‌డంలో స‌హ‌కరించుకోవడం కోసం భార‌త‌దేశం మ‌రియు ఓమాన్ ల మ‌ధ్య కుదిరిన అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


అంత‌రిక్షాన్ని శాంతియుత ప్ర‌యోజ‌నాల కోసం వినియోగించుకోవ‌డంలో స‌హ‌క‌రించుకోవ‌డానికి గాను మ‌స్క‌ట్ లో 2018 ఫిబ్ర‌వ‌రి నెల‌లోసంత‌కాలైన ఒక అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రాన్ని (ఎంఓయూ) గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం దృష్టికి తీసుకు వ‌చ్చారు.  ఈ ఒప్పంద ప‌త్రం పై భార‌త‌దేశం ప‌క్షాన భార‌తీయ అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ఐఎస్ఆర్ఒ) మ‌రియు ఓమాన్ ప‌క్షాన ర‌వాణా మ‌రియు కమ్యూనికేశన్ ల మంత్రిత్వ శాఖ లు సంత‌కాలు చేశాయి.,  

వివ‌రాలు:

•   రోద‌సి విజ్ఞాన శాస్త్రం; భూమి యొక్క రిమోట్ సెన్సింగ్; ఉప‌గ్ర‌హ ఆధారిత మార్గ‌ద‌ర్శ‌నం; స్పేస్ సైన్స్‌ అండ్ ప్లానెటరీ ఎక్స్ ప్లొరేశన్; అంత‌రిక్ష నౌక, అంతరిక్ష వ్యవస్థలు మ‌రియు గ్రౌండ్ సిస్టమ్ ల యొక్క వినియోగం; ఇంకా అప్లికేశన్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ త‌దిత‌ర రంగాల‌లో స‌హ‌కారానికి మార్గాన్ని ఈ ఎమ్ఒయు సుగ‌మం చేస్తుంది. 

•  డిఒఎస్‌/ఐఎస్ఆర్ఒ మ‌రియు ర‌వాణా, క‌మ్యూనికేశన్ మంత్రిత్వ శాఖ‌ (ఎం టి సి) ల‌కు చెందిన స‌భ్యుల‌తో ఒక సంయుక్త కార్యాచ‌ర‌ణ బృందాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ ఎమ్ఒయు వీలు క‌ల్పిస్తుంది.  ఈ బృందం ఎమ్ఒయు అమ‌లుకు ఒక కాల అవ‌ధిని నిర్దేశించ‌డంతో పాటు ఎమ్ఒయు ను అమ‌లు చేయడం కోసం తగిన మార్గాల‌ను సూచించడం తో సహా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుంది.  

•    ఇది భూమి యొక్క రిమోట్ సెన్సింగ్ రంగంలో నూత‌న ప‌రిశోధ‌క కార్య‌క్ర‌మాల‌కు మరియు వినియోగ ఆస్కారాల‌కు; శాటిలైట్ నావిగేశన్ కు, అంతరిక్ష శాస్త్ర విజ్ఞానం మరియు రోదసి అన్వేషణ కు గ‌ల అవ‌కాశాల‌ను అన్వేషించే ప్రక్రియ కు ఉత్తేజాన్ని ఇస్తుంది.

అమలు సంబంధ వ్యూహం మరియు లక్ష్యాలు:

సంతకాలు జరిగిన ఈ ఎంఓయూ ఒక సంయుక్త కార్యాచరణ బృందం ఏర్పాటుకు దారితీస్తుంది.  ఆ బృందం ఎంఓయూ యొక్క నిబంధనలను అమలుచేసే మార్గాలను కనుగొని, అందుకు ఒక కాలావధిని నిర్దేశించడం సహా కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తుంది.

లాభాలు:

•   ఈ ఎంఓయూ అంత‌రిక్ష సంబంధ సాంకేతిక విజ్ఞానాన్ని మాన‌వాళి ప్ర‌యోజ‌నం కోసం వినియోగించ‌డంలో సంయుక్త చొర‌వ‌కు దారి తీస్తుంది. దీని ద్వారా దేశంలోని అన్ని వర్గాలు మరియు అన్ని ప్రాంతాలు లబ్ధిని పొందగలవు.
 
ప్రభావం:

ఈ ఎంఓయూ ద్వారా సల్తనత్ ఆఫ్ ఓమాన్ తో సహకారాన్ని పొందడం మానవ జాతి హితం కోసం అంత‌రిక్ష సంబంధ సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించే రంగంలో సంయుక్త కార్యక్రమాలను అమలుపరచడానికి బాటను పరుస్తుంది.

 
***