Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఎ) ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ పై సంతకాలకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి


ఇంటర్ నేషనల్ సోలార్ అలయెన్స్ (ఐఎస్ఎ) యొక్క ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ ను భారతదేశం అనుమోదించాలని కొత్త మరియు నవీకరణ యోగ్య శక్తి మంత్రిత్వ శాఖ (ఎమ్ఎన్ఆర్ఇ) చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు. శీతోష్ణ స్థితిపై ఐక్య రాజ్య సమితి ఫ్రేమ్ వర్క్ కన్ వెన్శన్ యొక్క 21వ సిఒపి సమావేశాలు ప్యారిస్ లో జరిగిన సందర్భంగా 2015 నవంబర్ 30వ తేదీన భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇద్దరూ కలిసి ఐఎస్ఎ ను ప్రారంభించారు.

సౌర శక్తి వనరులు సంపన్నంగా ఉన్న 121 కి పైగా దేశాలను సమన్వయంతో కూడిన పరిశోధనలు, తక్కువ వ్యయమయ్యే ఆర్థిక సహాయం, శీఘ్ర నియుక్తి కోసం ఒక చోటుకు తీసుకురావడానికి ఐఎస్ఎ పాటుపడుతుంది. ఐఎస్ఎ ప్రధానకేంద్రానికి హరియాణా లోని గుర్ గావ్ లో ఉన్న గువాల్ పహాడీలో పునాదిరాయి వేశారు. ఐఎస్ఎ నిర్వహణకు అవసరమైన మద్దతును అందించడానికి భారతదేశం ఇప్పటికే సంసిద్ధతను వ్యక్తం చేసింది. శీతోష్ఠ స్థితి, నవీకరణ యోగ్య శక్తి అంశాలలో ప్రపంచంలో భారతదేశానికి నాయకత్వ భూమికను ఐఎస్ఎ కట్టబెట్టగలదు. అంతేకాదు, భారతదేశం తన సౌర సంబంధ కార్యక్రమాలను చాటడానికి ఒక వేదికను కూడా ఐఎస్ఎ అందజేయగలదు.

పూర్వ రంగం

మొరాకో లోని మరాకేశ్ లో 22వ సిఒపి సమావేశం జరిగిన సందర్భంగా ఈ ఒప్పందాన్ని సంతకాల కోసం తెరచి ఉంచారు. ఐఎస్ఎపై ప్యారిస్ తీర్మానాన్ని ఈ ఒప్పందం ఆవాహన చేస్తుంది. అంతే కాక ఇందులో సభ్యత్వం పొందాలనుకుంటున్న దేశాల అంతర్ దృష్టిని సంక్షిప్తంగా వ్యక్తపరుస్తుంది. యుఎన్ డిపి మరియు ప్రపంచ బ్యాంక్ లు ఇప్పటికే తాము ఐఎస్ఎ తో భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఇంతవరకు 25 దేశాలు ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ మీద సంతకాలు చేశాయి.