Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అంతర్జాతీయ గణితం ఒలింపియాడ్ లో భారతదేశం సర్వోత్తమ ప్రదర్శన కు ప్రధాన మంత్రి ప్రశంసలు


అంతర్జాతీయ గణితం ఒలింపియాడ్ లో భారతదేశం నాలుగో స్థానంలో నిలచింది. ఇది ఈ ఒలింపియాడ్ లో భారతదేశం ఇంతవరకు సాధించిన సర్వోత్తమ ఫలితం. భారతదేశం కనబరచిన ప్రశంసాయోగ్యమైన ప్రదర్శన పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గొప్ప ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేశారు.

 

భారతీయ సభ్యుల దళం నాలుగు బంగారు పతకాలతో పాటు ఒక వెండి పతకాన్ని కూడా గెలిచి మాతృభూమికి అందించింది.

 

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రిందివిధంగా పేర్కొన్నారు:

 

‘‘అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ లో భారతదేశం తన అత్యుత్తమ ప్రదర్శన తో నాలుగో స్థానాన్ని దక్కించుకోవడం గొప్ప ఆనందాన్ని, గర్వాన్ని అందించే విషయం.  ఈ ఒలింపియాడ్ లో పాల్గొన్న మన సభ్యుల దళం 4 స్వర్ణ పతకాలతో పాటు ఒక రజత పతకాన్ని గెలిచి వాటిని స్వదేశానికి తీసుకు వచ్చింది. ఈ ఘనత అనేక మంది ఇతర యువజనులకు ప్రేరణను కలిగించడం తో పాటు గణితశాస్త్రం మరింత ప్రజాదరణకు పాత్రం అయ్యేటట్లు తోడ్పడుతుంది.’’

 

********

DS/ST