Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ధ‌ర్మ‌శాల లో ‘రైజింగ్ హిమాచ‌ల్‌: గ్లోబ‌ల్ ఇన్‌ వెస్ట‌ర్స్ మీట్ 2019’ని ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల లో ‘ద రైజింగ్ హిమాచల్: గ్లోబల్ ఇన్ వెస్టర్స్ మీట్ 2019’ ను ప్రారంభించారు.

ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నందుకు హిమాచ‌ల్ ముఖ్య‌మంత్రి ని ప్ర‌ధాన మంత్రి అభినందించారు.

కార్య‌క్ర‌మాని కి విచ్చేసిన జ‌న స‌మూహాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, సంప‌ద ను సృష్టిస్తున్న వారందరి ని ఈ స‌ద‌స్సు కు ఆహ్వానిస్తున్నందుకు తాను సంతోషిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

ఇదివ‌ర‌కు రాష్ట్రాలు పెట్టుబ‌డుల ను ఆక‌ర్షించ‌డం కోసం వివిధ డిస్కౌంట్ ల‌ను ఇవ్వ‌జూపుతూ రాగా ఇన్‌ వెస్ట‌ర్ లేమో ఏ రాష్ట్రం ఎక్కువ రాయితీల ను లేదా విలువ తగ్గింపుల ను ఇస్తుందా అని ఎదురు చూశార‌ని ఆయ‌న అన్నారు.

గ‌త కొన్ని సంవ‌త్స‌రాల లో విలువ లో తగ్గింపుల‌ ను ఇవ్వ‌జూప‌డం లేదా పారిశ్రామికవేత్త‌ల కు రాయితీల‌ ను ఇవ్వ‌జూప‌డం లో నెల‌కొన్న ఈ స్పర్ధ తో పారిశ్రామిక‌వేత్తల కు గాని లేదా రాష్ట్రాల కు గాని- ఎవ్వ‌రికీ ఎటువంటి లాభమూ లేద‌ని అర్థం చేసుకొన్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

రాష్ట్రాల లో పెట్టుబ‌డి పెట్ట‌డానికి ఇన్‌ వెస్ట‌ర్ లకు ఒక అనుకూల వాతావ‌ర‌ణం.. ఎక్క‌డ‌యితే ఇన్‌స్పెక్ట‌ర్ రాజ్ కు తావు ఉండ‌దో, అదే మాదిరిగా ప్ర‌తి ద‌శ లోను అనుమ‌తుల ను పొంద‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉండ‌దో అటువంటి వాతావరణం.. ఏర్ప‌డ‌టం అనేది అత్య‌వ‌స‌రం అని ఆయ‌న అన్నారు.

ప్ర‌స్తుత కాలం లో ఆ కోవ కు చెందిన ఇకో సిస్టమ్ ను ఇన్‌ వెస్ట‌ర్ లకు క‌ల్పించాల‌ని రాష్ట్రాలు పోటీ ప‌డుతున్నాయని ఆయ‌న అన్నారు.

గ‌త కొన్ని సంవ‌త్స‌రాలు గా, వ్యాపారం చేయడం లో సౌల‌భ్యం, వ్యవహార దూరమైన చ‌ట్టాల ను ర‌ద్దు చేయ‌డం వంటి అనేక సంస్క‌ర‌ణ‌ల ను ఈ దిశ గా చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని ఆయ‌న వివ‌రించారు. రాష్ట్రాల మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన స్పర్ధ ఏర్ప‌డితే అది ప్ర‌పంచ వేదిక మీద మ‌న ప‌రిశ్ర‌మ‌ ల స్పర్ధాత్మకతను పెంపొందింపజేస్తుంద‌ని ఆయ‌న అన్నారు.

ఇది రాష్ట్రాల కు, స్థానిక జ‌నాభా కు, యావ‌త్తు దేశాని కి ప్ర‌యోజ‌నాన్ని అందిస్తుంద‌ని, అంతే కాక భార‌త‌దేశం శ‌ర వేగం గా పురోగ‌మిస్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

ప‌రిశ్ర‌మ కూడా ఒక స్వ‌చ్ఛ‌మైన‌టువంటి మ‌రియు పార‌ద‌ర్శ‌క‌మైన‌టువంటి వ్య‌వ‌స్థ ను, ప్ర‌భుత్వాల ను కోరుకొంటుందని ఆయ‌న చెప్పారు.

అవాంఛిత చ‌ట్టాలు మ‌రియు ప్ర‌భుత్వ జోక్యాలు ప‌రిశ్ర‌మ యొక్క పురోగ‌తి ని అడ్డ‌గించ‌డం లో పాత్ర ను పోషిస్తాయ‌ని ఆయ‌న అన్నారు.

ఇటువంటి మార్పుల కార‌ణం గా భార‌త‌దేశం ప్ర‌స్తుతం వ్యాపారాని కి స్నేహ‌శీలమైనటువిం గ‌మ్య‌స్థానం గా నిల‌బ‌డింద‌ని ఆయ‌న చెప్పారు.

ప్ర‌స్తుతం భార‌త‌దేశం లో అభివృద్ధి వాహ‌నం ఒక నూత‌న వైఖ‌రి తోను, ఆలోచ‌న స‌ర‌ళి తోను ముందుకు క‌దులుతోంద‌ని – స‌మాజం, ‘న్యూ ఇండియా’ను ప్రోత్స‌హిస్తున్న‌టువంటి ప్ర‌భుత్వం, ధైర్యం చేస్తున్న‌టువంటి ఒక ప‌రిశ్ర‌మ తో పాటు, పంచుకొనే ఉద్దేశ్యం క‌లిగిన జ్ఞానం.. అనే నాలుగు చ‌క్రాలు ఈ వాహనాని కి అమ‌రాయ‌ని ఆయ‌న అన్నారు.

భార‌త‌దేశం 2014వ సంవ‌త్స‌రం నుండి 2019వ సంవ‌త్స‌రం మ‌ధ్య కాలం లో వ్యాపారం చేయడం లో సౌలభ్యం స్థానాల లో 79 అంచెలు ఎగ‌బాకింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ‘‘ప్ర‌తి ఏటా మేము ప్ర‌తి ఒక్క ప‌రామితి లోను మెరుగుద‌ల ను సాధిస్తున్నాము. ఈ ర్యాంకింగ్ ల‌లో మెరుగుద‌ల కు అర్థం మా ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మ కోసం కూకటి వేళ్ల స్థాయి లో అవ‌స‌రాల ను క్షుణ్ణం గా అవ‌గాహ‌న చేసుకొని, నిర్ణ‌యాలు తీసుకొంటోంద‌నే’’ అని ఆయ‌న అన్నారు.

‘‘ఇది ర్యాంకింగ్ ల‌లో న‌మోదైన మెరుగుద‌ల ఒక్కటే కాదు. భార‌త‌దేశం లో వ్యాపారం నిర్వ‌హించే తీరు లో ఒక ప్ర‌ధాన‌మైన‌టువంటి క్రాంతి కూడాను. మేము మా ఆర్థిక పునాదుల ను బ‌ల‌హీన ప‌డ‌టానికి అనుమ‌తించ‌క పోవ‌డం తో నేటి ప్ర‌పంచ దృశ్యవివరణ లో భార‌త‌దేశం బ‌లం గా నిల‌బ‌డి వున్నది’’ అని ఆయ‌న అన్నారు.

ప‌టిష్ట‌మైన‌టువంటి ఇన్‌సాల్వన్సి ఎండ్ బ్యాంక్‌ ర‌ప్ట‌సీ కోడ్ ద్వారా ప‌రిశ్ర‌మ కు ప్ర‌స్తుతం ఒక స‌రి అయిన నిష్క్ర‌మ‌ణ మార్గాన్ని అందించడం జ‌రిగింది అని ఆయ‌న అన్నారు.

మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఒక ప్ర‌ధాన నిర్ణయాన్ని తీసుకొంది. అది ఏమిటంటే ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తం గా నిలచిపోయిన గృహ నిర్మాణ ప‌థ‌కాల ను పునః ప్రారంభించాల‌ని నిర్ణ‌యించడమే. త‌ద్వారా 4.58 ల‌క్ష‌ల కుటుంబాలు పెట్టుబ‌డి పెట్టిన వారి ఇళ్ళ ను ప్ర‌స్తుతం ద‌క్కించుకోగ‌లుగుతాయి అని ఆయ‌న తెలిపారు.

ప్ర‌భుత్వం కార్పొరేట్ ట్యాక్స్ ను నూత‌న దేశీయ కంపెనీల కోసం 15 శాతాని కి త‌గ్గించిందని కూడా ఆయ‌న వివ‌రించారు.

భార‌త‌దేశాన్ని పెట్టుబడి పెట్ట‌డం కోసం అత్యంత అనుకూల‌మైన‌టువంటి గ‌మ్య‌స్థానాల లో ఒక‌టి గా ప‌రిగ‌ణించ‌వ‌ల‌సిందంటూ ప‌రిశ్ర‌మ రంగాన్ని మ‌రియు ప్ర‌పంచ ప్ర‌తినిధుల ను ఆయ‌న కోరారు.

మౌలిక స‌దుపాయాల అభివృద్ధి కి 100 ల‌క్షల కోట్ల రూపాయ‌ల‌ కు పైగా పెట్టుబ‌డి పెట్టాల‌న్న నిర్ణ‌యం హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాని కి కూడా లాభ‌దాయ‌కం అవుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ఇన్‌ వెస్ట‌ర్ ఫ్రెండ్లీ ఇన్‌వైర‌న్‌ మంట్ ను ఏర్పాటు చేయ‌డం కోసం అనేక ప్ర‌తిష్టాత్మ‌క‌ కార్య‌క్ర‌మాల‌ ను చేప‌డుతున్నందుకు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆయ‌న ప్ర‌శంసించారు.

ఈ సంద‌ర్భం లో రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకొన్న చ‌ర్య‌ల ను ఆయ‌న ప్ర‌స్తావించారు. వాటిలో సింగిల్ విండో క్లియ‌ర‌న్స్ సిస్ట‌మ్, రంగాల వారీ గా ప్ర‌త్యేకమైనటువంటి విధానాలు, భూమి కేటాయింపున‌ కు పార‌ద‌ర్శ‌క వ్య‌వ‌స్థ తదితర చ‌ర్య‌లు ఈ రాష్ట్రాన్ని పెట్టుబ‌డి కి ఒక ఆక‌ర్ష‌ణీయ‌మైన గ‌మ్య‌స్థానం గా రూపొందించాయ‌ని చెప్పారు.

కాన్ఫెరెన్స్ టూరిజ‌మ్ ప‌రం గా హిమాచ‌ల్ లో అపార‌మైన అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అభివ‌ర్ణించారు.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ యొక్క పెట్టుబ‌డి సామ‌ర్ధ్యాన్ని మ‌రియు అవ‌కాశాల ను క‌ళ్ళ కు క‌ట్టిన ఒక ప్ర‌ద‌ర్శ‌న ను సైతం ప్ర‌ధాన మంత్రి తిలకించారు.

ఇదే సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి ఒక కాఫీ టేబ‌ల్ బుక్ ను కూడా ఆవిష్క‌రించారు.

<span