అధికారంలోకి వచ్చిన మొదటిరోజునుంచే ఎన్డీయే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రైల్వేలు, రోడ్లు, షిప్పింగ్.. ఇలా ఏదైనా కావచ్చు.. మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీపై కేంద్రం దృష్టి పెట్టింది.
తొలిసారిగా, రైల్వే బడ్జెట్ మౌలిక వసతుల మార్పుపై నిర్మాణాత్మకమైన దృష్టిపెట్టింది. కొత్త రైళ్లను ప్రకటించటం ఇన్నాళ్లూ ప్రభుత్వాల రాజకీయ గిమ్మిక్కుగా మారింది. కానీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక.. రైళ్లలో ప్రయాణికుల కోసం వివిధ సేవలు అందుబాటులోకి తేవటం, రైల్వేస్టేషన్లలో వై-ఫై, ప్రయాణికుల సహాయ నెంబరు (138), భద్రత హెల్ప్ లైన్ (182), కాగిత రహిత టికెటింగ్ వ్యవస్థ, ఈ-కేటరింగ్, మొబైల్ సెక్యూరిటీ యాప్, మహిళల కోసం సీసీటీవీ కెమెరాల ఏర్పాటు మొదలైనవి అందుబాటులోకి వచ్చాయి. రైల్వేలు దేశ ఆర్థిక రంగానికి ఊతమివ్వటంతోపాటు.. గనులు, కోస్తా ప్రాంతాలను కలుపుతూ.. ముందుకెళ్తోంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య వేగవంతమైన బుల్లెట్ రైలుకు ప్రణాళిక సిద్ధమైంది. న్యూఢిల్లీ-చెన్నై రైల్వే లైన్ కోసం సాధ్యాసాధ్యాల పరిశీలన జరుగుతోంది. ఒక ఏడాదిలోనే 1,983 కిలోమీటర్ల రైల్వే లైన్లు వేయగా.. 1,375 కిలోమీటర్ల దూరం రైల్వే లైను విద్యుదీకరణ పూర్తయింది. ఇప్పటివరకు భారత్ రైల్వేలో జరిగిన అత్యుత్తమ పని ఇదే. యాత్రికుల కోసం 6 కొత్త లైన్లు ప్రారంభమయ్యాయి. వైష్ణోదేవికి వెళ్లేందుకు కటారా లైన్ ను ప్రారంభించారు.
రోడ్డు విభాగంలో స్తంభించిన రోడ్డు ప్రాజెక్టులన్నీ తిరిగి ప్రారంభమయ్యాయి. చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న కాంట్రాక్టు వివాదాలన్నీ పరిష్కృతమయ్యాయి. పనికిరాని ప్రాజెక్టులు రద్దయ్యాయి. భారత దేశంలోని కోస్తా ప్రాంతాలు, సరిహద్దులను కలుపుతూ.. భారత్ మాల ప్రాజెక్టు ప్రారంభమైంది. ప్రయాణికుల సౌకర్యార్థం 62 టోల్ ప్లాజాలు రద్దు చేయటం జరిగింది. గతేడాదితో పోలిస్తే.. జాతీయ రహదారుల నిర్మాణంలో 120 శాతం వృద్ధి కనిపించింది. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన క్రింద నిర్మించిన రోడ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.
షిప్పింగ్ రంగంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం వేగంగా మార్పులు తీసుకువస్తోంది. సాగర మాల ప్రాజెక్టు ద్వారా అన్ని పోర్టులను కలిపేందుకు తీసుకున్న నిర్ణయం ద్వారా కోస్తా ప్రాంతాల్లో ఊహించని అభివృద్ధి జరుగుతుంది. ఈ ఏడాది పోర్టుల్లో కార్గోల ద్వారా జరిగిన వృద్ధి రేటు 4 నుంచి 8 శాతానికి పెరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా.. గరిష్టంగా 71ఎంటీపీఏ నమోదైంది. చహాబహర్ పోర్టు వ్యూహాత్మక అభివృద్ధి కోసం ఇరాన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. దీని ద్వారా ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఏషియా దేశాలకు చేరుకోవటం సులభం అవుతుంది. గంగానదిలో అంతర్గత జలరవాణా కోసం జల్మార్గ్ వికాస్ ప్రాజెక్టును కేంద్రం ప్రారంభించింది.
పౌర విమానయాన రంగంలోనూ చాలా వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొహాలీ, తిరుపతి, ఖజురహోర్ ప్రాంతాల్లో చేపట్టిన సమగ్ర టర్మినల్ నిర్మాణ పనులు పూర్తయ్యే దశకు వచ్చాయి. కడప, బికనేర్ లలో టర్నినల్స్ పూర్తయ్యాయి. ప్రాంతీయంగా కనెక్టివిటీ పెంచేందుకు హుబ్లి, బెల్గాం, కిసాన్ గఢ్, తేజు, ఝర్సుగూడ విమానాశ్రయాల అభివృద్ధి చేయటం జరిగింది. భారత అంతర్జాతీయ విమానయాన భద్రత సంస్థ (ఐఏఎస్ఏ)ను మరింత భద్రత సంబంధింత రేటింగ్, మరిన్ని విమానాలు వచ్చేందుకు ఎఫ్ఏఏ ద్వారా ఆధునీకరించటం జరిగింది.
సాంకేతికను పెంచటం ద్వారా మౌలిక వసతులు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో మీరే చూడండి.