కూతురు, కుమారుడు.. ఇద్దరికీ సమానంగా గౌరవించాలనేది మన నినాదం కావాలి.
ఇకనుంచి బాలిక పుడితే మనం పండగ జరుపుకోవాలి. కూతురు పుట్టగానే ఐదు మొక్కలు నాటి సంరం చేసుకోవాలి. కూతురు పుట్టినందుకు మనం గర్వపడాలి.
తను దత్తత తీసుకున్న జయపూర్ గ్రామస్తులనుద్దేశించి ప్రధాన మంత్రి మోదీ గారు ఈవిధంగా తెలిపారు.
బేటీ బచావ్, బేటీ పఢావ్ (బీబీబీపీ) పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్‌లో ప్రారంభించారు. సమాజంలో తగ్గుతున్న బాలికల సంఖ్య, మహిళా సాధికారతకు సంబంధించి జీవితచక్రంలో వస్తున్నమార్పులను పథకం పరిష్కరిస్తుంది. ఈ విభాగాన్ని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మానవ వనరుల అభివృద్ధిశాఖలు సమన్వయంతో నిర్వహిస్తాయి.
పీసీ, పీఎన్‌డీటీ చట్టాన్ని అమలు చేయటం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తొలి విడతలో దేశవ్యాప్తంగా తక్కువ బాలికల సంఖ్య ఉన్న వంద జిల్లాల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శిక్షణ, చైతన్యం కల్పించటం ద్వారా సమాజంలో మార్పుతీసుకురావాలనేది ప్రభుత్వం ఉద్దేశం.
సమాజంలో కూతురిపై ఉన్న అభిప్రాయాన్ని చెరిపేసి.. బాలికపై నిర్మాణాత్మకమైన మార్పుతీసుకు రావాలని ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా.. తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ‘కూతురితో సెల్ఫీ’ ప్రతిపాదన చేసిన హర్యానాలోని బీబీపూర్ సర్పంచ్‌ను ప్రశంసించారు. ప్రపంచ వ్యాప్తంగా దీన్ని విజయవంతం చేసేందుకు ప్రజలంతా తమ కూతుళ్లతో సెల్ఫీలు దిగి షేర్ చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ప్రధాని కోరిక మేరకు భారతీయులంతా.. ఈ రంగా సెల్ఫీలు తీసుకుని పంపించి.. ఈ కార్యక్రమాన్ని ఘనవిజయం సాధించారు.
బేటీ బచావ్, బేటీ పఢావ్ పథకం ప్రారంభమైనప్పటినుంచి అన్ని రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో వివిధ రంగాల జిల్లా కార్యాచరణ ప్రణాళిక ద్వారా అమల్లోకి వచ్చాయి. జిల్లా స్థాయిలో పనిచేస్తున్న అధికారులు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు శిక్షణ ఇవ్వటంతోపాటు సామర్థ్యపెంపు కార్యక్రమాలను నిర్వహించారు. కేంద్ర మహిళ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2015 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 9 సార్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
పలు స్థానిక కార్యక్రమాలు
ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్ జిల్లాల్లో బేటీ బచావ్, బేటీ పఢావ్ పథకం కింద బాలికలను కాపాడటం, వారికి చదువు చెప్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఇందుకోసం జిల్లా టాస్క్ ఫోర్స్, బ్లాక్ టాస్స్ ఫోర్స్ ఏర్పాటుచేశారు. ఈ రెండు సంస్థలు కలిసి బాలికల సంఖ్య (చైల్డ్ సెక్స్ రేషియో) పెంచేందుకు సంయుక్తంగా రోడ్ మ్యాప్ తయారుచేసుకుని ముందడుగేశాయి. పెద్ద సంఖ్యలో జనాల్లోకి వెళ్లేందుకు పథకం ఉద్దేశాన్ని వివరిస్తూ.. చైతన్యపరిచే కార్యక్రమాలను చాలా ప్రభావవంతంగా నిర్వహించారు. వివిధ పాఠశాలలు, ఆర్మీ స్కూళ్లు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల సహకారంతో.. ర్యాలీలను నిర్వహించారు.
దీంతోపాటు బేటీ బచావ్, బేటీ పఢావ్ కార్యక్రమంపై చైతన్యం పెంచేందుకు వీధి నాటకాలను కూడా పితోర్‌గఢ్ జిల్లాలో ఏర్పాటుచేశారు. నాటకాల ద్వారా గ్రామాల్లో చైతన్యం రావటంతోపాటు.. ఆడపిల్ల కడుపులో ఉందని అబార్షన్ చేయించే అంశాలపై ప్రజలను ఆలోచింపజేశారు. ఆడపిల్ల పుట్టినప్పటినుంచి సమాజంనుంచి ఆమె ఎదుర్కొంటున్న సమస్యలను ఈ వీధినాటకాల ద్వారా ప్రదర్శించి ప్రజల్లో మార్పునకు కృషిచేశారు. బేటీ బచావ్, బేటీ పఢావ్ కార్యక్రమ ప్రచాకం కోసం నిర్వహించిన సంతకాల సేకరణ (సిగ్నేచర్ క్యాంపేన్) లో పీజీ కాలేజీల విద్యార్థులు, పలువు ఆర్మీ ఉద్యోగులు కలుపుకుని దాదాపు 700 మంది సంతకాలు చేశారు.
పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోనూ.. బాలికలకు విద్యాభ్యాసం అవసరాన్ని వివరిస్తూ కార్యక్రమాలు నిర్‌్హించారు. ‘ఉడాన్- సప్నేయా దీ దునియా దే రుబరు (రేపటి కోసం.. నేటి నీ కలను కాపాడుకో అనే అర్థం) నినాదంతో ప్రచారం చేశారు. ఇందుకోసం ఆరోతరగతినుంచి 12వ తరగతి వరకు బాలికలనుంచి ప్రతిపాదనలు ఆహ్వానించారు. డాక్టర్, పోలీస్, ప్రభుత్వాధికారి, ఐఏఎస్, పీపీఎస్ అధికారి వంటి వారితో ఒకరోజు ఉండటం ద్వారా ఈ బాలికలు స్ఫూర్తి పొందాలనేది ఈ పథకం ఉద్దేశం.
అధికారులు రూపొందించిన ఈ పథకానికి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. 70కి పైగా బాలికలకు ఓ నిపుణుడితో రోజంతా కలిసి.. ఆయన చేసే పనులను గమనించే అవకాశం కలిగింది. భవిష్యత్తు గురించి తీసుకోవాల్సిన నిర్ణయంపై ఓ అవగాహన కల్పించింది.