Search

పిఎంఇండియాపిఎంఇండియా

తయారీ శక్తిగా అవతరించే బాటలో భారత్


తయారీ రంగంలోనే కాకుండా ఇతర విభాగాల్లో కూడా ఔత్సాహిక పారిశ్రామిక ధోరణులు ప్రో్త్సహించేందుకు నాలుగు స్తంభాలపై “మేక్ ఇన్ ఇండియా” చొరవను ప్రభుత్వం ప్రారంభించింది.

Make in India (1)

కొత్త ప్రాసెస్లు : ఔత్సాహిక పారిశ్రామిక ధోరణులు ప్రోత్సహించడంలో దేశంలో “స్వేచ్ఛాయుత వ్యాపార వాతావరణం” అత్యవసరమని “మేక్ ఇన్ ఇండియా” గుర్తించింది. వ్యాపారాల నిర్వహణకు వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. వ్యాపారాల్లో వివిధ దశల్లో నిబంధనలు సడలించడం, లైసెన్స్ల శృంఖలాలు తెంచడం దీని లక్ష్యం.

కొత్త మౌలిక వసతులు : పరిశ్రమ వృద్ధికి అధునాతనమైన మౌలిక వసతులు అత్యంత కీలకం. అమిత వేగంతో కూడిన కమ్యూనికేషన్ వసతులు, సమగ్ర లాజిస్టిక్ వసతులు అందుబాటులోకి తేవడానికి దేశవ్యాప్తంగా పారిశ్రామిక కారిడార్లు, స్మార్ట్ సిటీలు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పని చేస్తున్న పారిశ్రామిక క్లస్టర్లన్నింటిలోనూ మౌలిక వసతులు మరింత పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది.

కొత్త రంగాలు : తయారీ, మౌలిక వసతులు, సేవల రంగాల్లో మరింత సమాచారం అందించడం ద్వారా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉన్న 25 విభాగాలను మేక్ ఇన్ ఇండియా గుర్తించింది. పరస్పరం సమాచారాన్ని అంది పుచ్చుకోగల వెబ్పోర్టల్, వృత్తిపరంగా అభివృద్ధి చేసిన బ్రోచర్ల ద్వారా సవివరమైన సమాచారం అందించేందుకు కృషి జరుగుతోంది.

కొత్త దృక్పథం :ప్రభుత్వం ఒక నియంత్రిత వ్యవస్థ అనే అభిప్రాయం పరిశ్రమలో నాటుకుపోయింది. ఈ అభిప్రాయాన్ని తొలగించి పరిశ్రమతో ప్రభుత్వం అనుసంధానమై ఉంటుందన్న అభిప్రాయం పెంచడమే “మేక్ ఇన్ ఇండియా” లక్ష్యం. ఇందులో భాగంగా పరిశ్రమతో ఆర్థికాభివృద్ధి విషయంలో ప్రభుత్వం భాగస్వామిగా నిలుస్తుంది. ఒక నియంత్రిత వ్యవస్థగా కాకుండా ఒక చోదక శక్తిగా నిలవాలన్నదే ప్రభుత్వ ధ్యేయం.
దేశంలోను, విదేశాల్లోను కూడా వ్యాపారవేత్తలు, నాయకుల్లో ఎందరో అభిమానులు, ఆరాధకులను మేక్ ఇన్ ఇండియా సాధించి పెట్టింది. ఈ చారిత్రకమైన చొరవలో భాగస్వాములయ్యేందుకు ప్రపంచం యావత్తు ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Make in India (2)

తయారీ విభాగంలో చరిత్రలోనే అతి పెద్ద చొరవకు ప్రభుత్వం ఒక సమగ్ర కార్యాచరణ రూపొందించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పరివర్తిత శక్తికి ఇది ఒక నమూనాగా నిలుస్తుంది. విజయవంతమైన ఈ చొరవలో అంతర్జాతీయ భాగస్వాములను కూడా ప్రభుత్వం కలుపుకుంటోంది.

అతి తక్కువ వ్యవధిలోనే పాతకాలం నాటి అడుగడుగునా అవరోధాలు, ఆటంకాలతో కూడిన వ్యవస్థను ప్రభుత్వం తొలగించి పెట్టుబడులను ఆకర్షించగల, నవ్యతకు పట్టం కట్టగల, నైపుణ్యాలకు పట్టం కట్టే, ఐపి రక్షణలతో కూడిన, స్నేహపూర్వకమైన వ్యవస్థను ఆ స్థానంలో ఏర్పాటు చేయగలిగింది.

పెట్టుబడులపై పరిమితులు, నియంత్రణలు తొలగిపోవడంతో రక్షణ, నిర్మాణం, రైల్వే వంటి అత్యధిక విలువ గల పారిశ్రామిక విభాగాల ద్వారాలు అంతర్జాతీయ భాగస్వామ్యానికి తెరుచుకున్నాయి. ఎఫ్డిఐలను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు వీలుగా రక్షణ విధానంలో అవసరమైన మార్పులు ప్రభుత్వం చేసింది. రక్షణ రంగంలో ఆటోమేటిక్ రూట్లో ఇప్పుడు 24 శాతం పోర్ట్ఫోలియో పెట్టుబడులు అనుమతిస్తున్నారు. రక్షణ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని ప్రవేశపెట్టేందుకు వచ్చే ప్రతిపాదనలను కేసులవారీగా నూరు శాతం పెట్టుబడులకు పరిశీలిస్తున్నారు. నిర్మాణం, రైల్వే మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో నూరు శాతం పెట్టుబడులను ఆటోమేటిక రూట్లో అనుమతిస్తున్నారు.

Make in India (3)

దేశంలో వ్యాపారానుకూల వాతావరణం ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం పన్నుల విధానాలను కూడా సరళీకృతం చేసింది. 22 రకాల మూల ముడిసరకులపై కస్టమ్స్ సుంకాలు తగ్గించడం వల్ల భిన్న రంగాల్లో ఉత్పత్తి వ్యయాలు గణనీయంగా తగ్గాయి. గార్ను ప్రభుత్వం రెండేళ్ళు వాయిదా వేసింది. కొత్త సాంకేతిక పరిజ్ఙానాలను ఆకర్షించే లక్ష్యంతో టెక్నికల్ సర్వీసులపై వచ్చే రాయల్టీలు, ఫీజులపై ఆదాయపు పన్ను 25 శాతం నుంచి 10 శాతానికి ప్రభుత్వం తగ్గించింది. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన పత్రాల సంఖ్య మూడుకి కుదించేసింది. 14 రకాల భారత ప్రభుత్వ సేవలు ఇ-బిజ్ పోర్టల్లో ఒక్క చోటనే అందుబాటులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లకు అవసరమైన మార్గదర్శకం చేయడానికి, సహాయసహకారాలు అందించడానికి ఇన్వెస్టర్ సహాయ విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరిశ్రమల ఏర్పాటు కోసం లైసెన్స్లకు, పారిశ్రామిక ఎంటర్ప్రిన్యూర్షిప్కు సంబంధించిన అవగాహనా పత్రాలకు దరఖాస్తులు ఏ క్షణాన కావాలంటే ఆ క్షణాన ఇబిజ్ పోర్టల్ ద్వారా చేసుకోగల విధానం అమలులోకి తెచ్చింది. పారిశ్రామిక లైసెన్స్ల కాలపరిమితిని మూడేళ్ళకు పెంచింది. రక్షణ రంగానికి చెందిన కీలకమైన విడిభాగాల తయారీకి పారిశ్రామిక లైసెన్సింగ్ చేసుకోవలసిన ఇబ్బందిని ప్రభుత్వం తొలగించింది. కొత్త విద్యుత్ కనెక్షన్లకు ఎన్ఓసి/అనుమతి తీసుకోవలసిన అవసరాన్ని కూడా ప్రభుత్వం తప్పించింది.

Make in India (4)

తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు, ప్రపంచంలోని అందరినీ ఈ గమ్యం దిశగా ఆకర్షించేందుకు దేశవ్యాప్తంగా పారిశ్రామిక కారిడార్ల నిర్మాణానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Make in India (5) [ PM India 619KB ]

For more details click here

లోడ్ అవుతోంది... Loading