పారదర్శక, అవినీతి రహిత ప్రభుత్వంతో, పాలనతో దేశానికి చేకూరే ప్రయోజనాలు అపారం. గత దశాబ్దమంతా ఏకపక్ష నిర్ణయాలు, అవినీతి, విధాన పరనిర్ణయాల స్థానంలో వ్యక్తిగత విచక్షణ నిర్ణయాల మయంగా మారిన కథల్ని చూశాం. కానీ గత ఏడాదికాలంగా మంచి దిశగా మార్పును చూస్తున్నాం.
సుప్రీంకోర్టు కోల్‌బ్లాక్‌ల కేటాయింపులను రద్దు చేసిన తర్వాత ఈ ప్రభుత్వం మునుపెన్నడూ లేనంత పారదర్శకత, సత్వర నిర్ణయాలకు పెద్దపీట వేసింది. ఫలితంగా 67 కోల్‌బ్లాక్‌ల కేటాయింపు వేలంపాటల ద్వారా సుమారు 3.35 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. *వేలంపాట ప్రక్రియ సజావుగా సాగింది. ఈ ప్రక్రియలో మాకెలాంటి వివక్షగానీ, అహేతుకతగానీ కన్పించటం లేదు. అంతేగాకుండా ఎవరో ఒకరికి లాభంమునుపెన్నడూ లేని పారదర్శకత
పారదర్శక, అవినీతి రహిత ప్రభుత్వంతో, పాలనతో దేశానికి చేకూరే ప్రయోజనాలు అపారం. గత దశాబ్దమంతా ఏకపక్ష నిర్ణయాలు, అవినీతి, విధాన పరనిర్ణయాల స్థానంలో వ్యక్తిగత విచక్షణ నిర్ణయాల మయంగా మారిన కథల్ని చూశాం. కానీ గత ఏడాదికాలంగా మంచి దిశగా మార్పును చూస్తున్నాం.
సుప్రీంకోర్టు కోల్‌బ్లాక్‌ల కేటాయింపులను రద్దు చేసిన తర్వాత ఈ ప్రభుత్వం మునుపెన్నడూ లేనంత పారదర్శకత, సత్వర నిర్ణయాలకు పెద్దపీట వేసింది. ఫలితంగా 67 కోల్‌బ్లాక్‌ల కేటాయింపు వేలంపాటల ద్వారా సుమారు 3.35 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. *వేలంపాట ప్రక్రియ సజావుగా సాగింది. ఈ ప్రక్రియలో మాకెలాంటి వివక్షగానీ, అహేతుకతగానీ కన్పించటం లేదు. అంతేగాకుండా ఎవరో ఒకరికి లాభం చేకూరేలా వేలంప్రక్రియను నిర్ధారించారనే ఆరోపణలు కూడా రాలేదు* అని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. స్పెక్ర్టమ్ వేలంలో కూడా గత ప్రభుత్వ శూన్యనష్టం (జీరోలాస్) సిద్ధాంతానికి భిన్నంగా భారీలాభాలు చేకూరాయి.
అంతేగాకుండా ఏడేళ్ళుగా నాన్చుతూ వస్తున్న డిఫెన్స్ బ్యాండ్ గుర్తింపు కూడా సత్వరమే పరిష్కారమైంది. రక్షణ శాఖ విడుదల చేసిన 2100 మెగాహెడ్జ్స్ బ్యాండ్ ను వేలంలో పెట్టారు. తొలిసారిగా నాలుగు బ్యాండ్లలోని- 800 మెగాహెడ్జ్స్, 900, 1800, 2100 మెగాహెడ్జ్స్- స్పెక్ట్రమ్‌ను ఏకకాలంలో వివిధ రౌండ్లలో వేలానికి పెట్టారు. ఆపరేటర్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకునేందుకు ఈ పారదర్శకత పాటించారు. తద్వారా ఆమోదిత రిజర్వ్ ధర రూ.80277 కోట్లుకాగా, వచ్చింది రికార్డు స్థాయిలో రూ.109875 కోట్లు! పారదర్శకత కోసం పర్యావరణ మంత్రిత్వ శాఖ వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టింది. పర్యవరణ అనుమతుల కోసం దరఖాస్తుల దాఖలును ఆన్‌లైన్ పద్ధతిలోనే దాఖలు చేయాలని నిర్ణయించింది. తద్వారా అనుమతుల కోసం మంత్రిత్వ శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదిక. తమ దరఖాస్తుల స్థితిని కూడా ఎప్పటికప్పడు ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. సమాచారం అందించేలా, వేగవంతంగా ప్రక్రియ పూర్తయ్యేందుకు అటవీ అనుమతుల కోసం డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ (డీఎస్ఎస్)ను ఆరంభించారు.
నల్లధనంపై బాధ్యతలు చేపట్టిన తొలిరోజే సిట్‌ను ఏర్పాటు చేసిందీ ప్రభుత్వం. స్విస్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఐటీ విభాగం దర్యాప్తు చేస్తున్న కేసుల వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంటోంది. వెల్లడించని విదేశీ ఆదాయం, ఆస్తుల (పన్నుకువీలైన) బిల్లు 2015ను ప్రభుత్వం ఆమోదించింది. విదేశాల్లోని ఆస్తులు, ఆదాయాన్ని వెల్లడించకుంటే ఈ బిల్లుప్రకారం తీవ్ర జరిమానా, చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి సమకూరింది. లక్ష రూపాయల పైబడిన లావాదేవీలకు పాన్ కార్డు నెంబరు తెలపటం తప్పనిసరి చేశారు.
చేకూరేలా వేలంప్రక్రియను నిర్ధారించారనే ఆరోపణలు కూడా రాలేదు* అని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. స్పెక్ర్టమ్ వేలంలో కూడా గత ప్రభుత్వ శూన్యనష్టం (జీరోలాస్) సిద్ధాంతానికి భిన్నంగా భారీలాభాలు చేకూరాయి. అంతేగాకుండా ఏడేళ్ళుగా నాన్చుతూ వస్తున్న డిఫెన్స్ బ్యాండ్ గుర్తింపు కూడా సత్వరమే పరిష్కారమైంది. రక్షణ శాఖ విడుదల చేసిన 2100 మెగాహెడ్జ్స్ బ్యాండ్ ను వేలంలో పెట్టారు. తొలిసారిగా నాలుగు బ్యాండ్లలోని- 800 మెగాహెడ్జ్స్, 900, 1800, 2100 మెగాహెడ్జ్స్- స్పెక్ట్రమ్‌ను ఏకకాలంలో వివిధ రౌండ్లలో వేలానికి పెట్టారు. ఆపరేటర్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకునేందుకు ఈ పారదర్శకత పాటించారు. తద్వారా ఆమోదిత రిజర్వ్ ధర రూ.80277 కోట్లుకాగా, వచ్చింది రికార్డు స్థాయిలో రూ.109875 కోట్లు.