ప్ర.1: | గౌరవనీయులైన ప్రధాన మంత్రి కి నా ఇక్కట్టుపై అర్జీ పెట్టుకోవాలని భావిస్తున్నాను. దీనికి ఉన్నటువంటి పద్ధతిని గురించి దయచేసి తెలియజేయగలరు.
నేను నా ఇక్కట్టుపై ప్రధాన మంత్రి కార్యాలయానికి (పిఎమ్ఒ కు) నేను ఏ విధంగా అర్జీ పెట్టుకోవాలి ? నేను నా ఇక్కట్టును పిఎమ్ఒ లో ఎక్కడకు పంపించాలి ? నా ఇక్కట్టును గౌరవనీయులైన ప్రధాన మంత్రి లేదా పిఎమ్ఒ కు ఆన్లైన్ మాధ్యమం ద్వారా పంపవచ్చా ? |
జవాబు: | గౌరవనీయులైన ప్రధాన మంత్రికి/ పిఎమ్ఒ కు ఎలాంటి ఇక్కట్టులనైనా నివేదించవచ్చు. ఇందుకోసం”ప్రధాన మంత్రికి రాయండి” అనే ఇంటరాక్టివ్ పేజీ లింకును ఉపయోగించుకోవాలి. ఇది పిఎమ్ఒ వెబ్సైట్ : https://www.pmindia.gov.in/te/ లో దాని దిగువన గౌరవనీయులైన ప్రధాన మంత్రిని సంప్రతించండి అనే వాక్యంతో అందుబాటులో ఉంటుంది. అలాగే పిఎమ్ఒ వెబ్సైట్ ప్రధాన పేజీలో ప్రధాన మంత్రికి రాయండి అనే లింకు ద్వారా కూడా అందుబాటులో ఉంది.
పైన పేర్కొన్న లింకుపై, క్లిక్ చేశాక అది పౌరులను CPGRAMS పేజీ లోకి తీసుకువెళ్తుంది. అక్కడ మీ ఇక్కట్టును నమోదు చేసుకోవాలి. ఇది నమోదైన తరువాత ఒక విశిష్ట నమోదు సంఖ్య ప్రత్యక్షం అవుతుంది. పౌరుడు తన సమస్యకు సంబంధించిన పత్రాలు ఏవైనా ఉంటే వాటిని పంపే సౌలభ్యం కూడా ఉంది. పౌరులు తమ ఇక్కట్టుకు సంబంధించిన పత్రాలను ఇతర మార్గాలలో సైతం గౌరవనీయులైన ప్రధాన మంత్రికి/పిఎమ్ఒ కు నివేదించవచ్చు. (i) తపాలా ద్వారా- ప్రధాన మంత్రి కార్యాలయం, సౌత్ బ్లాక్, న్యూ ఢిల్లీ, పిన్ కోడ్ – 110011, (ii) నేరుగా అందించే స్థానం – పిఎమ్ఒ తపాలా కేంద్రం, సౌత్ బ్లాక్, న్యూ ఢిల్లీ; మరియు (iii) ఫ్యాక్స్ ద్వారా – ఫ్యాక్స్ సంఖ్య. 011-23016857. |
ప్ర.2: | గౌరవనీయులైన ప్రధాన మంత్రి తో నా ఆలోచనలను ఏ విధంగా పంచుకోవచ్చు?
గౌరవనీయులైన ప్రధానమంత్రి కి నేను కొన్ని సూచనలు ఇవ్వదలచాను. అందుకు అమలులో ఉన్న పద్ధతి ఏమిటో తెలియజేయగలరు ? |
జవాబు: | పౌరులు వారి ఆలోచనలను, అభిప్రాయాలను, మనోభావాలను గౌరవనీయులైన ప్రధాన మంత్రి తో/పిఎమ్ఒ తో పంచుకోవచ్చు.”మీ ఆలోచనలను, అభిప్రాయాలను, మనోభావాలను పంచుకోండి” ఇందుకోసం అనే లింకుతో పాటు పిఎమ్ఒ వెబ్సైట్: https://www.pmindia.gov.in/te/ ->లో గౌరవనీయులైన ప్రధానితో సంప్రదించండి(డ్రాప్ డౌన్ మెనూ నుండి) -> మీ ఆలోచనలను, అభిప్రాయాలను, మనోభావాలను పంచుకోండి. ఈ లింకు పిఎం వెబ్సైటు[https://www.pmindia.gov.in/te/]లో కూడా అందుబాటులో ఉంది.
పౌరులు వారి ఆలోచనలను, అభిప్రాయాలను, మనోభావాలను గౌరవనీయులైన ప్రధాన మంత్రితో/పిఎమ్ఒ తో ఇతర మార్గాలలో సైతం పంచుకోవచ్చు: (i) తపాలా ద్వారా – ప్రధాన మంత్రి కార్యాలయం, సౌత్ బ్లాక్, న్యూ ఢిల్లీ, పిన్ కోడ్ – 110011, (ii) నేరుగా అందించే స్థానం – పిఎమ్ఒ తపాలా కేంద్రం, సౌత్ బ్లాక్, న్యూఢిల్లీ; మరియు (iii) ఫ్యాక్స్ ద్వారా – ఫ్యాక్స్ సంఖ్య 011-23016857. |
ప్ర.3: | గౌరవనీయులైన ప్రధాన మంత్రి కి లేదా పిఎమ్ ఒ కు అర్జీ పెట్టుకున్న ఇక్కట్టు యొక్క పరిష్కారం ఏ స్థితిలో ఉందో పౌరులు ఏ విధంగా తెలుసుకోవచ్చు ?
నా ఇక్కట్టుపై గౌరవనీయులైన ప్రధాన మంత్రి కి/ పిఎమ్ ఒ కు ../../….(తేదీ/నెల /సంవత్సరం) నాడు పంపించిన అర్జీ మీద తీసుకున్న చర్య ఏమిటో దయచేసి తెలియజేయగలరు. ఆ అర్జీని పిఎమ్ఒ ఐడీ సంఖ్య: PMOPG/D/…. (సంవత్సరం)/123456789తో ../../….(తేదీ/నెల /సంవత్సరం)నాడు ……….. విభాగానికి పంపడమైంది. నేను పిఎమ్ఒ కు ఒక అర్జీని పెట్టుకున్నాను; నా అర్జీని పిఎమ్ ఒ PMOPG/D/…. (సంవత్సరం)/123456789తో ../../….(తేదీ/ నెల/సంవత్సరం) నాడు ………… రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. దాని స్థితిని గురించి దయ చేసి తెలియజేయగలరు. నా ఇక్కట్టును గురించి వివరిస్తూ గౌరవనీయులైన ప్రధాన మంత్రికి ../../….(తేదీ/నెల /సంవత్సరం) నాడు నమోదు సంఖ్య PMOPG/E/….(సంవత్సరం/ 123456789తో ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఒక అర్జీని పెట్టుకున్నాను. దానిని పిఎమ్ఒ ……… ఎలక్ట్రానిక్ మాధ్యమంలో మంత్రిత్వ శాఖకు పంపించింది. నా అర్జీలో ప్రస్తావించిన నా ఇక్కట్టు కు పరిష్కారం లభించిందా అనేది నేను తెలుసుకోగోరుతున్నాను. |
జవాబు: | ప్రధాని కార్యాలయానికి పెద్ద సంఖ్యలో అందే ప్రజా ఇక్కట్లలోని అంశాలు వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు లేదా రాష్ట్ర ప్రభుత్వాల పరిధికి సంబంధించినవై ఉంటాయి. ఆ సమస్యలు/ ఫిర్యాదులను ఇక్కడి ప్రజా విభాగం వేరుపరచి ఆయా మంత్రిత్వ శాఖకు/విభాగానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతుంది.
ప్రధాని కార్యాలయానికి పెద్ద సంఖ్యలో అందే ప్రజా ఇక్కట్లలోని అంశాలు వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు లేదా రాష్ట్ర ప్రభుత్వాల పరిధికి సంబంధించినవై ఉంటాయి. ఆ సమస్యలు/ ఫిర్యాదులను ఇక్కడి ప్రజా విభాగం వేరుపరచి ఆయా మంత్రిత్వ శాఖకు/విభాగానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఆ సమాచారంతో పాటు సదరు సమస్య సంబంధిత నమోదు సంఖ్యను కూడా మంత్రిత్వశాఖకు/విభాగానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది. దీని నకలును ఫిర్యాదుదారుకూ పంపుతుంది. ఫిర్యాదు/సమస్యల నమోదు/పరిశీలన సమయంలో నమోదు సంఖ్యను కూడా దరఖాస్తుదారుకు ఇమెయిల్, ఎస్ఎమ్ఎస్ ల ద్వారా తెలుపుతుంది. ఈ సంఖ్య ఆధారంగా వారు వారి ఫిర్యాదు స్థితిగతులను http://pgportal.gov.in/Status లో నేరుగా పరిశీలించుకోవచ్చు. (ఈ లింకు పిజి పోర్టల్ హోం పేజీ లోనూ లభ్యమవుతుంది). ప్రధాన మంత్రికి పంపిన లేఖ పరిస్థితిని పౌరులు 011-23386447 నంబరుకు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు. ఆయా సమస్యల పరిష్కారం వాటిని అందుకున్న మంత్రిత్వ శాఖ/విభాగం/రాష్ట్ర ప్రభుత్వాల లోని సముచిత అధికార సంస్థ పరిధిలో ఉంటుంది. అందువల్ల దరఖాస్తుదారులు సంబంధిత మంత్రిత్వ శాఖలు/విభాగాలు/రాష్ట్ర ప్రభుత్వాలను వాకబు చేయడం ద్వారా పురోగతిని గురించి వాకబు చేయవచ్చు. |
ప్ర.4: | నా ఇక్కట్టుకు సంబంధించి ../../….(తేదీ/నెల/సంవత్సరం) నాడు నేను పెట్టుకున్న అర్జీని పిఎమ్ ఒ PMOPG/D/…. (సంవత్సరం)/ 123456789తో ../../….(తేదీ/నెల /సంవత్సరం) నాడు ………… రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ ఫైలు లోని వ్యాఖ్యల నకలు ప్రతులను దయచేసి అందించగలరు .
నా ఇక్కట్టుపై పిఎమ్ఒ ఐడి సంఖ్య PMOPG/D/….(సంవత్సరం)/123456789తో ../../….(తేదీ/నెల /సంవత్సరం) నాడు ………… మంత్రిత్వ శాఖకు పంపిన ఫైలును నేను పరిశీలించాలనుకుంటున్నాను. నా ఇక్కట్టుపై నేను ../../….(తేదీ/నెల/ సంవత్సరం) నాడు పెట్టుకున్న అర్జీని పిఎమ్ఒ లేఖ సంఖ్య. PMOPG/D/….(సంవత్సరం)/ 123456789తో ../../….(తేదీ/నెల/ సంవత్సరం) నాడు ……….. రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. దీనిపై రోజువారీ పురోగతి యొక్క వివరాలను దయచేసి నాకు అందించగలరు. |
జవాబు: | ప్రజల నుండి అందే నివేదనలను, లేఖలను పిఎమ్ఒ లో పూర్తిగా కంప్యూటరీకరించిన ప్రజా విభాగం పరిశీలిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం ఒక సాఫ్ట్ వేర్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఫైలులో వ్యాఖ్యలు, రోజువారీ పురోగతి నివేదిక వంటి నిబంధనలేవీ ఉండవు. |
ప్ర.5: | గౌరవనీయులైన ప్రధాన మంత్రికి నేను ఆన్లైన్ మాధ్యమం ద్వారా అర్జీని పెట్టుకున్నాను. దీనిపై పిఎమ్ఒ …….. మంత్రిత్వశాఖకు/…….. రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన సమాచారం/లేఖ నకలును దయచేసి అందించగలరు. |
జవాబు: | ఆన్లైన్ నివేదన లను సంబంధిత అధికార సంస్థలకు ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా పంపుతారు కనుక, సమాచార లేఖ రూపొందే పరిస్థితి ఉండదు. |
ప్ర.6: | నా ఇక్కట్టుపై అర్జీ పెట్టుకోవడం కోసం గౌరవనీయులైన ప్రధాన మంత్రి ఇ-మెయిల్ ఐడి ని దయచేసి తెలియజేయగలరు. |
జవాబు: | ప్రధాన మంత్రి యొక్క ఆధికారిక ఇ-మెయిల్ ఐడి అంటూ ఏదీ లేదు. అయితే, మీ యొక్క ఇక్కట్లను ఆన్ లైన్ ద్వారా సమర్పించేందుకుగాను దయచేసి తరచుగా అడిగే ప్రశ్నల తాలూకు ఒకటో నంబరు ప్రశ్నను తరచి చూడగలరు. |
ప్ర.7: | ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించిన సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు/కాలవ్యవధి ఏమైనా ఉందా? |
జవాబు: | చర్య తీసుకోదగ్గ అభ్యర్థనలన్నింటినీ తగు చర్యలు తీసుకోవలసిందిగా సూచిస్తూ సంబంధిత అధికార స్థానాల (మంత్రిత్వ శాఖలు/విభాగాలు/ రాష్ట్ర ప్రభుత్వాల)కు CPGRAMS ద్వారా పంపబడతాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి CPGRAMS పరిధి లోని పరిపాలన సంస్కరణలు-ప్రజా సమస్యల విభాగానికి (DARPG కి) నిర్దేశిత మార్గదర్శకాలు ఉన్నాయి. ప్రజలందరికీ అందుబాటులో ఉండే DARPG వెబ్సైట్లో ఈ మార్గదర్శకాలను చూడవచ్చు. |
ప్ర.8: | ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించిన అభ్యర్థనల పరిష్కార పర్యవేక్షణకు ఏదైనా వ్యవస్థ/యంత్రాంగం ఉందా? |
జవాబు: | చర్య తీసుకోదగ్గ అభ్యర్థనలన్నింటినీ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ సంబంధిత అధికార స్థానాల (మంత్రిత్వ శాఖలు/విభాగాలు/ రాష్ట్ర ప్రభుత్వాల)కు పంపబడతాయి. సమస్యల పరిష్కారం ఆయా అధికార స్థానాల పరిధిలోనే ఉంటుంది. ఆ మేరకు సంబంధిత అధికారులు వాటిని సమీక్షిస్తారు. దీంతోపాటు CPGRAMS ద్వారా దాఖలైన అభ్యర్థనల పరిష్కార ప్రక్రియ పై సంబంధిత వ్యవస్థ లతో పరిపాలన సంస్కరణలు- ప్రజా సమస్యల విభాగం నిర్ణీత కాల వ్యవధి ప్రకారం సమీక్షిస్తూ ఉంటుంది. |
ప్ర.9: | సాధారణ ప్రజానీకం నుండి ప్రధాన మంత్రి కార్యాలయానికి అందిన అన్ని వర్తమానాలపై ప్రధా నమంత్రి స్పందిస్తారా? |
జవాబు: | ప్రధాన మంత్రి కార్యాలయానికి అందిన వర్తమానాల స్వభావం, సారాంశాన్నిబట్టి ప్రధాన మంత్రి సహా వివిధ స్థాయి లలో స్పందన ఉంటుంది.. |
పరిపాలన – మానవ వనరులకు సంబంధించిన తరచుగా అడిగే ప్రశ్నలు | |
ప్ర.1: | ప్రధాన మంత్రి కార్యాలయం (PMO)లోని అధికారుల పేర్లు, వారి హోదాలు, ఫోన్ నంబర్లను తెలియజేయగలరు..
PMOలో ————– హోదాలో పనిచేసే అధికారి శ్రీ ————– గారి ఫోన్ నంబర్ తెలపండి. |
జవాబు: | ప్రధాన మంత్రి కార్యాలయంలోని అధికారుల పేర్లు, వారి హోదాలు, ఫోన్ నంబర్లు https://www.pmindia.gov.in/te/వెబ్సైట్లో; ‘అధికారుల జాబితా’ అనే శీర్షిక కింద లభ్యమవుతాయి. |
ప్ర.2: | భారత ప్రధాన మంత్రి ప్రైవేటు కార్యదర్శి, ప్రత్యేక విధులు నిర్వహించే అధికారుల (OSD ల) పేర్లు, మొబైల్ నంబర్లు దయచేసి తెలియజేయండి.
ప్రధాన మంత్రి కార్యాలయంలో————–హోదా గల అధికారి శ్రీ ————– గారి మొబైల్ నంబరును తెలియజేయండి. |
జవాబు: | ప్రధాన మంత్రి కార్యాలయంలోని అధికారుల పేర్లు, వారి హోదాలు, ఫోన్ నంబర్లుhttps://www.pmindia.gov.in/te/ వెబ్సైట్లో; ‘అధికారుల జాబితా’ అనే శీర్షిక కింద లభ్యమవుతాయి. అధికారుల మొబైల్ నంబర్లను వెల్లడి చేస్తే వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లే అవాంఛనీయ పరిస్థితి ఏర్పడుతుంది.అంతే కాకుండా సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8(1) (జె)కింద ఇలా వెల్లడించకుండా వారికి మినహాయింపు కూడా ఉంది. |
ప్ర.3: | ప్రధాన మంత్రి కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది జీత భత్యాల వివరాలు తెలియజేయండి.
ప్రధాన మంత్రి కార్యాలయ అధికారి శ్రీ————– గారికి చెల్లిస్తున్న మొత్తం జీతం ఎంత ? |
జవాబు: | ప్రధాన మంత్రి కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది జీతభత్యాల వివరాలు ప్రధాన మంత్రి కార్యాలయ వెబ్సైట్లో : https://www.pmindia.gov.in/te/; కింద సమాచార హక్కు చట్టం – 2005 ’’ అనే శీర్షిక కింద, ‘‘సెక్షన్ 4(1)(బి)లో భాగంగా వెల్లడి చొరవ కింద లభ్యమవుతాయి |
ప్ర.4: | ప్రధాన మంత్రి కార్యాలయం గడచిన ఆర్థిక సంవత్సరంలో చేసిన మొత్తం ఖర్చు ఎంత ?
‘జీతాలు’ పద్దు కింద ప్రధాన మంత్రి కార్యాలయం నెలవారీ ఖర్చు వివరాలు దయచేసి తెలియజేయండి. |
జవాబు: | ప్రధాన మంత్రి కార్యాలయం గడచిన ఆర్థిక సంవత్సరంలో చేసిన మొత్తం ఖర్చు వివరాలు సెక్షన్ 4(1)(బి) కింద వెల్లడి చొరవ : https://www.pmindia.gov.in/te/ -> సమాచార హక్కు చట్టం (డ్రాప్ డౌన్ మెనూ లో) -> సెక్షన్ 4(1)(బి) కింద వెల్లడి చొరవ శీర్షిక కింద లభ్యమవుతాయి. |
ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF)పై తరచుగా అడిగే ప్రశ్నలు | |
ప్ర.1: | వైద్య చికిత్స కోసం ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుండి నేను ఆర్థిక సహాయాన్ని పొందడం ఎలా ? |
జవాబు: | వైద్య చికిత్స/శస్త్ర చికిత్స కోసం ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి ఆర్థిక సహాయం మంజూరు కోసం ప్రధాన మంత్రిని అర్థిస్తూ ప్రభుత్వ ఆస్పత్రి/ PMNRF గుర్తించిన జాబితాలోని ప్రైవేటు ఆస్పత్రులలో ఒక సాధారణ దరఖాస్తును సమర్పిస్తే సరిపోతుంది. దీంతోపాటు వైద్య ధ్రువీకరణ పత్రం/చికిత్స చేసే ఆస్పత్రి నుండి ఖర్చు అంచనా పత్రం, కుటుంబ వార్షికాదాయ ధ్రువీకరణ పత్రాలను జత చేయాలి. PMNRF నుండి ఆర్థిక సహాయంపై మార్గదర్శకాలు www.pmindia.gov.in వెబ్‌సైట్‌తో పాటు https://pmnrf.gov.in వెబ్సైట్ లోనూ లభ్యమవుతాయి. |
ప్ర.2: | ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం పొందిన వ్యక్తుల వివరాలను తెలియజేయండి…
ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం కింద శ్రీ/శ్రీమతి————–గారికి ఇచ్చిన మొత్తం ఎంత ? |
జవాబు: | కోరిన సమాచారం పూర్తిగా వ్యక్తిగతం. దీన్ని మూడో పక్షానికి వెల్లడించడం వల్ల వ్యక్తి (వ్యక్తుల) స్వేచ్ఛకు భంగం వాటిల్లే అవాంఛనీయ పరిస్థితి ఏర్పడవచ్చు. అంతేగాక సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8(1) (జె) కింద సమాచార వెల్లడికి మినహాయింపు వర్తిస్తుంది గనుక ఈ సమాచారం ఇవ్వడం వీలు కాదు.. |
ప్ర.3: | ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి కి వార్షిక రాబడి, ఖర్చుల వివరాలను ఇవ్వండి |
జవాబు: | ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి కి రాబడి, ఖర్చు వివరాలన్నీ ప్రధాన మంత్రి కార్యాలయ వెబ్సైట్ www.pmindia.gov.in/te/ తో పాటుhttps://pmnrf.gov.in వెబ్సైట్ లోనూ లభ్యమవుతాయి. |
సమాచార హక్కు చట్టం-2005 సంబంధిత దరఖాస్తులు, తొలి పునర్విచారణ అభ్యర్థనలపై తరచుగా అడిగే ప్రశ్నలు | |
ప్ర.1: | ప్రధాన మంత్రి కార్యాలయం లోని కేంద్ర ప్రజా సమాచార అధికారి (CPIO)ని సంప్రదించేందుకు వివరాలివ్వండి |
జవాబు: | కేంద్ర ప్రజా సమాచార అధికారి, ప్రధాన మంత్రి కార్యాలయం, సౌత్ బ్లాక్, న్యూ ఢిల్లీ-110011 టెలిఫోన్ నం.011-23382590 ఫ్యాక్స్ నం.011-23388157 ఇ-మెయిల్: rti-pmo.applications[at]gov[dot]in |
ప్ర.2: | సమాచార హక్కు చట్టం కింద అపీలు అథారిటీతో సంప్రదింపు వివరాలు తెలియజేయండి..
సమాచార హక్కు చట్టం కింద నా తొలి పునర్విచారణ అభ్యర్థనను ప్రధాన మంత్రి కార్యాలయంలో ఎవరికి సమర్పించాలి? |
జవాబు: | డైరెక్టర్ (RTI) ప్రధాన మంత్రి కార్యాలయం, సౌత్ బ్లాక్, న్యూఢిల్లీ-110011 టెలిఫోన్ నం.011-23074072 (కార్యాలయం) ఫ్యాక్స్ నం.011-23388157/23019545/23016857 ఇ-మెయిల్: rti[dot]appeal[at]gov[dot]in |
ప్ర.3: | ప్రధాన మంత్రి కార్యాలయం నుండి సమాచారాన్ని పొందడానికి పౌరులకు ఏమేం సదుపాయాలున్నాయి ?
ప్రధాన మంత్రి కార్యాలయం నుండి సమాచారం పొందే ప్రక్రియ ఎలా ఉంటుంది ? |
జవాబు: | దీనికి సంబంధించిన వివరాలను ప్రధాన మంత్రి కార్యాలయ వెబ్సైట్ అయిన https://www.pmindia.gov.in/te/ -> లోని ‘సమాచారం పొందే హక్కు’ అనే వాక్యం కింద->సమాచారం పొందే ప్రక్రియఅనే లింకు ద్వారా చూడవచ్చు.ప్రధాన మంత్రి కార్యాలయ వెబ్సైట్: https://www.pmindia.gov.in/te/-> లో ‘సమాచారాన్ని పొందే హక్కు’ అనే వాక్యం కింద -> ‘‘సమాచారం కోరే వారికి సూచనలు’’ అనే లింకును దరఖాస్తుదారులు పరిశీలించవలసిందిగా సూచిస్తున్నాం. |
ఇతరత్రా సమాచారానికి సంబంధించిన తరచుగా అడిగే ప్రశ్నలు | |
ప్ర.1: | —/—/—-(తేదీ/నెల/ సంవత్సరం)న నిర్వహించిన ‘ప్రగతి’ (PRAGATI) సమావేశం తీర్మానాల నకలును అందజేయండి
‘ప్రగతి’ సమావేశంలో ————– సంబంధిత అంశంపై తీసుకున్న నిర్ణయం వివరాలను అందజేయండి.. |
జవాబు: | ‘ప్రగతి’ సమావేశాలన్నింటికీ సంబంధించిన పూర్తి వివరాలు www.pragati.nic.inవెబ్సైట్లో లభ్యమవుతాయి. |
ప్ర.2: | గౌరవనీయులైన ప్రధాన మంత్రి చేసిన ప్రకటనల వివరాలు అందజేయండి.. |
జవాబు: | ప్రధాన మంత్రి వివిధ సందర్భాలలో అనేక ప్రకటనలు/పథకాలు ప్రకటించారు. ఇవన్నీ ప్రధాన మంత్రి ప్రసంగాలలో భాగం కాబట్టి వాటి సమాచారమంతా ప్రధాన మంత్రి కార్యాలయ వెబ్సైట్ లోని https://pmindia.gov.in/te/tag/ప్రసంగ-పాఠాలు/లింకులో లభ్యమవుతాయి. |
ప్ర.3: | గౌరవనీయులైన ప్రధాన మంత్రి ————– సందర్భంగా చేసిన ప్రసంగం నకలును అందజేయండి.
గౌరవనీయులైన ప్రధాన మంత్రి —/—/—- (తేదీ/నెల /సంవత్సరం)న ————–లో చేసిన ప్రసంగం లిఖితపూర్వక నకలును అందజేయండి. |
జవాబు: | ప్రధాన మంత్రి ప్రసంగాలన్నీ ప్రధాన మంత్రి కార్యాలయ వెబ్సైట్ లోని https://pmindia.gov.in/te/tag/ప్రసంగ-పాఠాలు/లింకు లో లభ్యమవుతాయి. | ప్రజా సమస్యలు/ఫిర్యాదులు సంబంధించిన తరచుగా అడిగే ప్రశ్నలు |
---|