భారత 12వ ప్రధానిగా శ్రీ ఇందర్ కుమార్ గుజ్రాల్ 1997 ఏప్రిల్ 21న ప్రమాణస్వీకారం చేశారు.
స్వర్గీయ అవతార్ నారాయణ్ గుజ్రాల్, స్వర్గీయ శ్రీమతి పుష్పా గుజ్రాల్ కుమారుడైన ఇందర్ కుమార్ గుజ్రాల్ ఎంఏ, బి.కాం, పిహెచ్‌డి, డి.లిట్ (హెచ్ఓఎన్ఎస్, సిఐయుఎస్ఏ) చేశారు. అవిభక్త పంజాబ్‌లోని జీలంలో 1919 డిసెంబర్ 4న జన్మించారు. 1945 మే 26న శ్రీమతి షీలా గుజ్రాల్‌ను వివాహమాడారు.
గుజ్రాల్ స్వాతంత్ర యోధుల కుటుంబానికి చెందినవారు. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ పంజాబ్‌లో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. 11 ఏళ్ళ చిన్నవయసులో 1931లో గుజ్రాల్ కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. జైలుకు వెళ్ళారు. జీలం పట్టణంలో యువకులతో కలసి ఉద్యమం నిర్వహించిన సందర్భంగా పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన జైలుకు వెళ్ళారు.
భారత ప్రధాని పదవిని చేపట్టడానికి ముందు గుజ్రాల్ 1996 జూన్ 1 నుంచి విదేశాంగ మంత్రిగా ఉన్నారు. 1996 జూన్ 28 నుంచి జల వనరుల శాఖను అదనంగా నిర్వహించారు. అంతకుముందు 1989 -1990 మధ్య కూడా విదేశ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 1976 -1980 మధ్య రష్యాలో భారత రాయబారిగా (కేబినెట్ హోదా) పనిచేశారు. అంతకంటే ముందు 1967 – 1976 మధ్య ఈ క్రింది పలు మంత్రిత్వ పదవులు నిర్వహించారు.
కమ్యూనికేషన్లు, పార్లమెంటరీ వ్యవహారాలు
సమాచార, ప్రసార, కమ్యూనికేషన్లు
వర్క్స్, హౌసింగ్, సమాచార, ప్రసారశాఖ,
ప్రణాళికా శాఖ
పార్లమెంటరీ పదవులు
1996 జూన్ నుంచి రాజ్యసభలో సభా నాయకుడు, 1993 నుంచి 1996 ఏప్రిల్ వరకు వాణిజ్య, జౌళి శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్. 1996 ఏప్రిల్ వరకు విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడు, 1964 నుంచి 1976 వరకు, 1979 నుంచి 1991 వరకు పార్లమెంటు సభ్యుడు. 1992లో బీహార్ నుంచి రాజ్యసభకు తిరిగి ఎన్నికతో పాటు పిటీషన్లకు సంబంధించిన సభ్యుడుగాను, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడుగాను, రాజ్యసభ నిబంధనల కమిటీ సభ్యుడుగాను, రాజ్యసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సభ్యుడుగాను, రాజ్యసభ జనరల్ పర్పసెస్ కమిటీ సభ్యుడుగాను, విదేశ వ్యవహారాల స్థాయీ సంఘం సభ్యుడుగాను పని చేశారు.
ఇతర ముఖ్యమైన పదవులు
ఛైర్మన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సౌత్ ఆసియన్ కో-ఆపరేషన్, మెంబర్ ఆఫ్ ది కేపిటల్ ప్లాన్ మానిటరింగ్ కమిటీ, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్ (ఐడిఎస్ఏ), ఛైర్మన్ ఆఫ్ ది అఫీషియల్ కమిటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ (గుజ్రాల్ కమిటీ), వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (1959-64), ప్రెసిడెంట్ – లాహోర్ స్టూడెంట్స్ యూనియన్, జనరల్ సెక్రటరీ ఆఫ్ ది పంజాబ్ స్టూడెంట్స్ ఫెడరేషన్, కన్వీనర్ అండ్ స్పోక్స్ మేన్ ఆఫ్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీస్ కాన్‌క్లేవ్ – కోల్‌కతా, శ్రీనగర్, ఢిల్లీ.
అంతర్జాతీయ ప్రతినిధి వర్గాలు
1996 – ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి భారత ప్రతినిధి వర్గం నాయకుడు. 1995 – జెనీవాలో మానవహక్కులపై ఐక్యరాజ్యసమితి సదస్సుకు భారత ప్రతినిధివర్గం నాయకుడు, 1990 – ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి భారత ప్రతినిధి వర్గం నాయకుడు, 1990 -ఆర్థికాభివృద్ధిపై యుఎన్ ప్రెసిడెంట్ సదస్సుకు భారత ప్రతినిధి వర్గం నాయకుడు. 1995, 1994 – యుఎన్ఓకు భారత ప్రతినిధి వర్గం సభ్యుడు. 1997 – విద్యా పర్యావరణంపై యునెస్కో సదస్సుకు భారత ప్రతినిధి వర్గం నాయకుడు. 1970, 1972, 1974 – యునెస్కో సదస్సుకు భారత ప్రతినిధివర్గ ప్రత్యామ్నాయ నాయకుడు, 1973 – పారిస్‌లో మేన్ అండ్ న్యూ కమ్యూనికేషన్ సిస్టమ్స్ పై యునెస్కో సదస్సుకు ఛైర్మన్, 1995 – బుఖారెస్ట్ లో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ కాన్ఫరెన్సుకు ప్రతినిధి. 1994 – కెనడాలో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కాన్ఫరెన్సుకు ప్రతినిధి. 1967 – కాన్‌బెర్రా (ఆస్ట్రేలియా)లో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సమావేశానికి ప్రతినిధి. 1974 – స్టాక్‌హోంలో పర్యావరణంపై యూఎన్ సదస్సుకు భారత ప్రతినిధివర్గ ప్రత్యామ్నాయ నాయకుడు. 1975 – గబన్, కా మెరూన్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ సెంటర్ ఆఫ్రికాలలో భారత ప్రత్యేక దూత, 1966 – రిపబ్లిక్ ఆఫ్ మలవీ ప్రారంభోత్సవానికి భారత ప్రత్యేక దూత, 1961 – బల్గేరియాకు ప్రత్యేక దూత, 1961 – శ్రీలంక, భూటాన్, ఈజిప్ట్, సూడన్‌లలో భారత రాష్ట్రపతి అధికార పర్యటనలలో కేంద్ర మంత్రి హోదాలో హాజరు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సౌత్ ఆసియన్ కోపరేషన్‌కు ఛైర్మన్, ఏషియన్ రోటరీ కాన్ఫరెన్సుకు కో-ఛైర్మన్.
సామాజిక సంస్థలతో అనుబంధం
ప్రెసిడెంట్, నారీ నికేతన్ ట్రస్ట్ అండ్ ఏఎన్ గుజ్రాల్ స్కూల్, జలంధర్ (పంజాబ్), ప్రెసిడెంట్ ఇండో-పాక్ ఫ్రెండ్‌షిప్ సొసైటీ, ఫౌండర్ ప్రెసిడెంట్ ఢిల్లీ ఆర్ట్ థియేటర్, వైస్ ప్రెసిడెంట్ లోక్ కళ్యాణ్ సమితి, ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ ఆఫ్ ఢిల్లీ – 1960, కో-ఛైర్మన్ ఏషియన్ రోటరీ కాన్ఫరెన్స్ – 1961.
ప్రత్యేక అభిరుచులు
గుజ్రాల్ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై రచనలు, వ్యాఖ్యానం పట్ల ఆసక్తి కనబరిచారు. రంగస్థల కళలపై కూడా ఆయనకు మక్కువ.