ఆర్ టి ఐ అపీళ్ల కోసం ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రత్యేక ఇ-మెయిల్ చిరునామా ను వెబ్ బ్రౌజర్ల సౌకర్యార్థం సమర్పించింది.. అదే, rti.appeal[at]gov[dot]in .
ఈ ఇ-మెయిల్ అడ్రెస్ కు మీ ఆర్ టి ఐ అపీళ్ల ను పంపవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది.
ఆలస్యాన్ని నివారించడం
వేరు వేరు విషయాలను గురించిన సమాచారాన్ని కోరుతూ ప్రధాన మంత్రి కార్యాలయానికి దరఖాస్తులు అందుతున్నాయి. ఈ విషయాలలో చాలా వరకు అంశాలను మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు పర్యవేక్షిస్తున్నవి కావడంతో అటువంటి అర్జీలను ఆర్ టి ఐ చట్టం ప్రకారం సంబంధిత పబ్లిక్ అథారిటీ కి పంపించడం జరుగుతున్నది.
ఆర్ టి ఐ చట్టం, 2015 ఏ వ్యక్తి అయినా కోరిన సమాచారం కనుక మరేదైనా పబ్లిక్ అథారిటీ ఆధీనంలో ఉన్న పక్షంలో, లేదా ఆ పబ్లిక్ అథారిటీ యొక్క ప్రాథమిక విధి అయిన పక్షంలో అటువంటి అర్జీలను ఆ ఇతర పబ్లిక్ అథారిటీ కి బదలాయించే వీలును కల్పిస్తున్నది.
మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు పర్యవేక్షిస్తున్న ప్రత్యేక విషయాలకు సంబంధించిన సమాచారం కోసం దరఖాస్తులను సంబంధిత పబ్లిక్ అథారిటీ యొక్క ప్రజా సమాచార అధికారి కి నేరుగా పంపించవచ్చు. ఇలా చేస్తే ఆయా అభ్యర్థనలను సకాలంలో పరిష్కరించడానికి వీలవుతుంది.
రుసుం
ఆర్ టి ఐ చట్టం, 2015 లో భాగంగా సమాచారాన్ని కోరే అర్జీలతో పాటే 10.00 రూపాయల రుసుమును ఈ కింద పేర్కొన్న ఏదైనా పద్ధతిలో చెల్లింపు జరిపి సమర్పించవలసి ఉంటుంది:-
పి ఎమ్ ఒ క్యాషియర్ కు స్వయంగా నగదును చెల్లించవచ్చు;
లేదా రూ.10/- (దరఖాస్తు రుసుం) విలువ గల డిమాండ్ డ్రాఫ్టును గాని, లేదా బ్యాంకర్స్ చెక్ ను గాని జత చేయవచ్చు; డ్రాఫ్టును “సెక్షన్ అధికారి, ప్రధాన మంత్రి కార్యాలయం” పేరిట న్యూ ఢిల్లీలో చెల్లింపు జరిగే విధంగా తీసుకోవాలి);
లేదా “సెక్షన్ అధికారి, ప్రధాన మంత్రి కార్యాలయం” పేరిట పోస్టల్ ఆర్డర్ ను తీసుకోవాలి;
లేదా
దరఖాస్తుదారు అతడు గాని, లేదా ఆమె గాని పేదరిక రేఖ కన్నా దిగువ (బి పి ఎల్) కేటగిరీకి చెందిన వారని, కాబట్టి రుసుం చెల్లింపు నుండి మినహాయింపును పొందే వెసులుబాటు వారికి ఉన్నదని సూచించే ప్రామాణికమైన రుజువును జతపరచవచ్చు.