భారత ప్రజల చరిత్రాత్మక తీర్పుతో దేశ ప్రధానిగా నరేంద్రమోదీ 2014, మే 26వ తేదీ సాయంత్రం ప్రమాణస్వీకారం చేయడంతో రాష్ట్రపతి భవన్ చరిత్ర పుటల్లో కొత్త అధ్యాయం అవిష్కృతమైంది. నరేంద్రమోదీలో ప్రజలు ఒక విశిష్టమైన, నిర్ణయాత్మకమైన, అభివృద్ధిపట్ల స్పష్టమైన దృక్పథం కలిగిన నాయకుని చూశారు. కోట్లాది మంది భారతీయులు కలలకు, ఆకాంక్షలకు ఆయన ఆశాకిరణం అయ్యారు. అభివృద్ధిపై దృష్టి, నిరుపేదల జీవితాల్లో మెరుగైన మార్పు తీసుకురావాలన్న దృక్పథం నరేంద్రమోదీని యావత్ భారతావనికి ప్రజాధరణ కలిగిన, గౌరవప్రదమైన నేతగా నిలబెట్టాయి.
నరేంద్రమోదీ జీవన ప్రస్థానం ధైర్యసాహసాలు, దయ, నిరంతర శ్రమతో సాగింది. ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేయాలని ఆయన చాలా చిన్న వయసులోనే నిర్ణయం తీసుకున్నారు. అట్టడుగు స్థాయి కార్మికునిగా, ఒక నిర్వాహకునిగా, ఒక పరిపాలకునిగా ఆయన తన నైపుణ్యాలను చాటుకున్నారు. స్వరాష్ట్రం గుజరాత్‌కు 13 ...