భారతీయులు/విదేశాల పౌరులు ‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (‘Prime Minister’s National Relief Fund’) పేరిట చెక్కు/డ్రాఫ్ట్ ద్వారా చెల్లింపు జరిపి, వాటిని ప్రధాన మంత్రి కార్యాలయం, సౌత్ బ్లాక్, న్యూ ఢిల్లీ-110011 (Prime Minister’s Office, South Block, New Delhi 110011) కి పంపాలి. ఈ అంశం పైన జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా పిఎమ్ఎన్ఆర్ఎఫ్ పేరిట తీసే డ్రాఫ్టు లను సిద్ధం చేయడానికిగాను ఎలాంటి కమిశన్ ను జాతీయ బ్యాంకులు వసూలు చేయవు.
పిఎమ్ఎన్ఆర్ఎఫ్ కు చెల్లింపులను బిహెచ్ఐఎమ్/యుపిఐ/వర్చువల్ పేమెంట్ అడ్రస్ [VPA]: pmnrf@centralbank ద్వారా కూడా జరపవచ్చును. ఈ పోర్టల్ ను విదేశీ పౌరులు కూడా వినియోగించుకొని చందాలను ఇవ్వవచ్చును.
చందాలను ఈ కింద పేర్కొన్న బ్యాంకుల శాఖలలో నేరుగా సైతం అందజేయవచ్చును: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, పంజాబ్ నేశనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్, కార్పొరేశన్ బ్యాంక్, బ్యాంక్ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, విజయా బ్యాంక్, యూకో బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిఎఫ్ సి బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, పంజాబ్ & సింద్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐడిబిఐ బ్యాంక్, కొటక్ మహీంద్ర బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఎస్ బ్యాంక్.
చందాలను మనీ ఆర్డర్ ల ద్వారా కూడా పంపవచ్చును. ఈ విధమైన ఎంఒ లకు ఎటువంటి కమిశన్ ను వసూలు చేయబోరు.
పిఎమ్ఎన్ఆర్ఎఫ్ కు అందించే చందాలకు ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 80 (జి) లో భాగంగా పన్ను విధించదగ్గ ఆదాయం నుండి 100 శాతం మినహాయింపు ను ఇస్తూ నోటిఫై చేయడం జరిగింది.