1. స్వచ్ఛంద ప్రకటన: ప్రధానమంత్రి కార్యాలయము, సమాచార హక్కు చట్టం, 2005 హక్కు లోని సెక్షన్ 4 యొక్క నిబంధనలకు (1) (బి) ప్రకారం, దాని వివరాలు స్వయంగా బహిర్గతం చేసేందుకు కట్టుబడి ఉండి, దానికి సంబంధించిన సమాచారమంతా దాని వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచడం జరిగింది. అవి వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. ఈ సమాచారం సంవత్సరానికి కనీసం ఒకసారి నవీకరించబడుతుంది. అవసరమైనప్పుడు కొంత సమాచారం అప్డేట్ చేయబడుతూవుంటుంది.
2. నిర్దిష్ట వ్యక్తి (ల)పై ప్రభావితం చూపే నిర్ణయాలకు కారణాలు తెలియజేయడం: మంత్రిత్వ శాఖ / విభాగాలు, పరిపాలనా లేదా పాక్షిక పరిపాలనా విభాగాలలో – నిర్దిష్ట వ్యక్తి లేదా తరగతి ప్రజలపై ప్రభావితం చూపే న్యాయ నిర్ణయాలు సాధారణంగా ప్రధాన మంత్రి కార్యాలయంలో తీసుకుంటారు. ఈ విధంగా కాకుండా, అత్యధిక ప్రజలపై ప్రభావితంచేసే ముఖ్యమైన నిర్ణయాలు, సంబంధిత పరిపాలనా మంత్రిత్వ శాఖ/ విభాగాలు యొక్క పరిధిలోనే ఉంటాయి.
3. సమాచారం యొక్క విస్తృత వ్యాప్తి: ప్రజలకు సమాచారాన్ని విస్తృత ప్రచారం చేయడం కోసం పిఎంఒ అనేక చర్యలు చేపట్టింది. ప్రజలకు అందుబాటు ఉంచిన సమాచారంలో ఈ క్రింది పేర్కొనబడినవి ఉన్నాయి:
(అ) గౌరవనీయులు ప్రధానమంత్రి చేసిన పత్రికా ప్రకటనలు.
(ఆ) ప్రధానమంత్రి ప్రసంగాలు
(ఇ) సామాజిక మాధ్యమాల సంభాషణ: ట్వీట్లు మరియు పేస్ బుక్
(ఈ) మన్ కీ బాత్ (మనసులో మాట)
(ఉ) తాజా వార్తలు
(ఊ) ప్రభుత్వం మరియు మంత్రిమండలి నిర్ణయాల విజయాలు
(ఋ) పరివర్తనచెందుతున్న భారతదేశం
4. వివిధ భాషలలో అందుబాటులో వున్న సమాచారం: 11 భాషలలో అందుబాటులో వున్న పిఎంఓ వెబ్ సైట్.
5. ప్రజా ప్రభావం చూపే నిర్ణయాలను ప్రకటించేటప్పటీ లేదా ముఖ్యమైన విధానాలను రూపొందించేటప్పటి సంబంధిత వాస్తవాలు: ప్రజలపై ప్రభావం చూపే నిర్ణయాలు లేదా ముఖ్యమైన విధానాల ఏర్పాటు, సంబంధిత పరిపాలనా మంత్రిత్వ శాఖ/ విభాగాలు యొక్క పరిధిలోనే ఉంటుంది.