1. ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ)లోని కేంద్ర ప్రజా సమాచార అధికారి (సిపిఐఒ) తమ కార్యాలయం పరిధిలోని లేదా తమ వద్ద అందుబాటులో ఉన్న మరియు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (ఎలకేషన్ ఆఫ్ బిజినెస్) రూల్స్, 1961. కింద నిర్వచించిన మేరకు తమ విధుల పరిధిలోకి వచ్చే అంశాలపై సమాచారం అందిస్తారు.
2. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలకు సంబంధించిన అంశాలు
a) 2005 సంవత్సర ఆర్ టిఐ చట్టం ప్రకారం ఏదైనా ఇతర ప్రభుత్వ శాఖకు చెందిన లేదా సంబంధిత శాఖ పరిధిలోని అంశంపై సమాచారం కోరినట్టయితే దరఖాస్తును ఆ శాఖకు బదిలీ చేస్తారు. ఈ కారణంగా దరఖాస్తుదారులు ఏ శాఖ నుండి సమాచారం కోరుతున్నారో ఆ మంత్రిత్వ శాఖ/విభాగం లోని ప్రజా సమాచార అధికారికే నేరుగా దరఖాస్తు చేసినట్టయితే వారి అభ్యర్థనలు సరైన సమయంలో పరిశీలనకు తీసుకునే వీలు ఉంటుంది. ఒక వేళ మంత్రిత్వ శాఖలు/విభాగాల విధుల కేటాయింపు విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటే అప్పుడు దరఖాస్తుదారులు వారి దరఖాస్తులను నేరుగా ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (ఎలకేషన్ ఆఫ్ బిజినెస్) రూల్స్, 1961కు అనుగుణంగా సిపిఐఒ కు పంపవచ్చు.b) బహుళ శాఖలకు సంబంధించిన (ఉదాహరణ : ఒకటి కన్నా ఎక్కువ మంత్రిత్వ శాఖ/విభాగం) అంశాలపై దరఖాస్తులు వస్తే వాటిని ఆయా శాఖలకు బదిలీ చేసే అవకాశం ఉండదు. అలాంటి దరఖాస్తులను తిరస్కరించే అవకాశాలు ఉంటాయి.
3. రాష్ర్ట ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల (యుటి) పాలన యంత్రాంగాలకు సంబంధించిన అంశాలు : రాష్ర్ట ప్రభుత్వాలు/ యుటి ల విధులకు సంబంధించిన అంశాలైతే దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను ఆయా రాష్ర్ట ప్రభుత్వం (ప్రభుత్వాలు)/ యుటి ల అధికార యంత్రాంగానికి పంపించుకోవాలి.
4. ఆయా రాష్ర్ట ప్రభుత్వాల పరిధిలోని కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాల కు చెందిన ప్రభుత్వాధికారుల నుండి సమాచారం కోరుతున్నట్టయితే భారత ప్రభుత్వ వెబ్ డైరెక్టరీలో లభ్యమయ్యే ఆయా శాఖల వెబ్ సైట్ (వెబ్ సైట్ ల)కు దరఖాస్తులను పంపించాలి.
5. ప్రధాన మంత్రి కార్యాలయం రికార్డుల పరిధిలోకి రాని అంశాలపై సిపిఐఒ సమాచారాన్ని నిక్షిప్తం చేయదు. అలాగే దిగువ అంశాలకు చెందిన సమాచారాన్ని సిపిఐఒ అందించే అవకాశం ఉండదు.
a) ఏవో ఆధారాలు ఉన్నాయంటూ అనుమానాస్పద అంశాలపై కోరే సమాచారం;
b) కాల్పనిక అంశాలు;
c) ఏదో జరిగిందంటూ అభిభాష్యాలతో కూడిన అంశాలు;
d) దరఖాస్తుదారులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారం కోసం చేసే అభ్యర్థనలు;
e) ఇతర ప్రభుత్వాధికారి (ప్రభుత్వాధికారుల) పరిధిలోని అంశాలకు సంబంధించిన సమాచారం; లేదా
f) ఊహాజనిత ప్రశ్నలకు సమాధానాలు ఇమ్మని అడగడం.
6. పిఎంఒ కు సంబంధించిన సమాచారం, ప్రభుత్వ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలకు సంబంధించిన సమాచారం అంతా “సమాచార హక్కు” శీర్షిక కింద పిఎంఒ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. దరఖాస్తుదారులు ఆర్ టిఐ కోసం దరఖాస్తు చేసే ముందు ఆ వెబ్ సైట్ లోని సమాచారాన్ని సందర్శించడం వల్ల ఏ అంశాలు పరిశీలనార్హం అన్న దానిపై అవగాహన కలుగుతుంది.
7. తమ ఫిర్యాదులు ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకునేందుకు దరఖాస్తు చేసే వారికి సూచనలుn