ప్రియమైన నా దేశ వాసులారా,
స్వేఛ్చ తాలూకు అమృత్ మహోత్సవ్ అయిన 75వ స్వాతంత్ర్య దినం సందర్భం లో మీ అందరి తో పాటు ప్రపంచం అంతటా ఉంటూ భారతదేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేటటువంటి వారందరికి ఇవే శుభాకాంక్షలు.
ఈ రోజు న, పావనమైన ఉత్సవం స్వేచ్ఛ తాలూకు అమృత్ మహోత్సవ్ నాడు, దేశం తన స్వాతంత్ర్య పోరాట యోధులకు, దేశ ప్రజలను కాపాడడం కోసం పగటనక రాత్రనక తమను తాము త్యాగం చేసుకొంటున్న సాహసిక వీరులు అందరి కి శిరస్సు ను వంచి ప్రణమిల్లుతున్నది. దేశం స్వేచ్ఛ ను ఒక ప్రజాందోళన గా మలచిన పూజ్య బాపు, స్వేచ్ఛ కోసం అన్నింటిని త్యాగం చేసినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను, భగత్ సింహ్, చంద్రశేఖర్ ఆజాద్, బిస్ మిల్, అశ్ ఫాకుల్లా ఖాన్, ఝాంసి రాణి లక్ష్మి బాయి, కిత్తూరు రాణి చెన్నమ్మ, రాణి గైడిన్ లియు, అసమ్ లో మాతాంగిని హజరా పరాక్రమాన్ని, దేశ ఒకటో ప్రధాని పండిత్ నెహ రూ జీ ని, దేశాన్ని ఒక సమైక్య జాతి గా కలిపిన సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ ను, భారతదేశం భావి దిశ కు ఒక బాట ను పరచినటువంటి బాబా సాహెబ్ ఆమ్బేడ్ కర్ సహా ప్రతి ఒక్క మనీషి ని స్మరించుకొంటోంది. ఈ మహనీయులైన వారందరికి దేశం రుణ పడి ఉంది.
భారతదేశం మా తృభూమి కై, సం స్కృతి కై, స్వేచ్ఛ కై శతాబ్దాల తరబడి పోరాడింది. ఈ దేశం దాస్యం తాలూకు వేదన ను ఎన్నడూ మరచిపోలేదు, శతాబ్దాలు గా స్వేచ్ఛ ను కోరుకొంటూ వచ్చింది. విజయాలు, పరాజయాల నడుమ, మనస్సు లో గూడు కట్టుకొన్న స్వేచ్ఛ కావాలి అనే ఆకాంక్ష తరిగిపోనేలేదు. ఈ రోజు ఈ సంఘర్షణలన్నిటి తాలూకు నాయకుల కు, శతాబ్దాల పోరాటం తాలూకు యోధుల కు శిరస్సు ను వంచి ప్రణమిల్లవలసినటువంటి రోజు, వారు మన ఆదరణ కు పాత్రులే మరి.
మన వైద్యులు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, పారిశుద్ధ్య సిబ్బంది, టీకామందు ను తయారు చేయడం లో తలమునకలైన శాస్త్రవేత్త లు, వర్తమాన కరోనా విశ్వమారి కాలం లో సేవ భావాన్ని చాటుకొంటున్న లక్షల కొద్దీ దేశవాసులు సైతం మన అందరి నుంచి ప్రశంస కు అర్హులు అయినటువంటి వారే.
ప్రస్తుతం దేశం లో కొన్ని ప్రాంతాల లో వరదలు వచ్చి పడ్డాయి, కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడడం కూడా జరిగింది. కొన్ని దు:ఖ భరితమైనటువంటి వార్తలు కూడా వినవస్తున్నాయి. చాలా ప్రాంతాల లో ప్రజల కష్టాలు పెరిగాయి. అటువంటి కాలం లో, కేంద్ర పరభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వారితో పాటు పూర్తి గా సన్నద్ధం గా ఉన్నాయి. ప్రస్తుతం, యువ క్రీడాకారులు, భారతదేశానికి కీర్తి ని తీసుకువచ్చిన మన ఆటగాళ్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు.
కొందరు ఇక్కడ కు విచ్చేసి, ఇక్కడ ఆసీనులై ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్న వారికి, భారతదేశం లోని ప్రతి మూల నుంచి ఈ కార్యక్రమానికి తరలివచ్చినటువంటి వారందరికి, దేశ ప్రజలందరికి నేను మనవి చేస్తున్నాను.. మన ఆటగాళ్ల గౌరవార్థం, కొన్ని క్షణాల పాటు దిక్కులు మారు మోగిపోయేటటువంటి చప్పట్ల తో, వారు సాధించిన భారీ కార్యసాధనల కు గాను గౌరవాన్ని చాటి వారికి నమస్కరించుదాము అని.
భారతదేశం క్రీడల పట్ల, భారతదేశం యువత పట్ల మన గౌరవాన్ని మనం చాటుకొందాం. మరి దేశానికి విజయాల ను అందించిన యువ భారతీయుల ను ఆదరించుదాం. కోట్ల కొద్దీ దేశప్రజానీకం భారతదేశం యువత కు, ప్రత్యేకించి భారతదేశానికి మాననీయత ను సంపాదించుకు వచ్చినట్టి ఎథ్ లీట్ ల కు ప్రతిధ్వనించే కరతాళ ధ్వనుల తో ఆదరణ ను కనబరుస్తున్నారు. వారు ఇవాళ కేవలం మన మనస్సుల ను గెలుచుకోలేదు, వారు వారి భారీ కార్య సిద్ధి తో భారతదేశం యువతీయువకుల లో, భావి తరాల లో ప్రేరణ ను కూడా కలిగించారని నేను గర్వం గా చెప్పగలను.
ప్రియమైన నా దేశ వాసులారా,
ఈ రోజు న మనం మన స్వేచ్చ ను వేడుక గా జరుపుకొంటూ ఉన్నాం, అయితే మనం భారతీయులు అందరి మది ని ఇప్పటికీ వేధిస్తున్న విభజన తాలూకు వేదన ను మనం మరచిపోలేం. ఇది గత శతాబ్ది తాలూకు అతి పెద్ద విషాదాలలో ఒకటి గా ఉంది. స్వేచ్చ ను సంపాదించుకొన్న తరువాత, ఈ మనుషుల ను చాలా త్వరగా మరచిపోవడం జరిగింది. నిన్నటి రోజే, వారి స్మృతి లో భారతదేశం ఒక భావోద్వేగభరితమైన నిర్ణయాన్ని తీసుకొంది. మనం ఇక నుంచి ఆగస్టు 14 ను ‘‘విభజన భయాల ను స్మరించుకొనే దినం’’గా పాటించబోతున్నాం. దేశ విభజన బాధితులందరి యాది లో ఈ పని ని చేయనున్నాం మనం. అమానుషమైన పరిస్థితుల లోకి నెట్టివేయబబడిన వారు, చిత్ర హింసల బారిన పడ్డ వారు, వారు కనీసం ఒక గౌరవప్రదమైన అంత్య సంస్కారానికైనా నోచుకోలేదు. వారు మన జ్ఞాపకాలలో నుంచి చెరిపివేత కు లోనవకుండా, మన యాది లో సజీవం గా ఉండిపోవాలి. 75వ స్వాతంత్ర్య దినాన్ని ‘‘విభజన భీతుల స్మరణ దినం’’ గా జరపాలన్న నిర్ణయం వారికి భారతదేశం లో ప్రతి ఒక్కరి వైపు నుంచి సముచితమైన నివాళే అవుతుంది.
ప్రియమైన నా దేశ వాసులారా,
యావత్తు ప్రపంచం లో ప్రగతి, మానవత ల మార్గం లో సాగిపోతున్న దేశానికి, కరోనా కాలం ఒక పెద్ద సవాలు గా ఎదురుపడింది. ఈ పోరు లో భారతీయులు గొప్ప ధైర్యం తో, గొప్ప సహనం తో పోరాటం చేశారు. అనేక సవాళ్లు మన ముంగిట నిలచాయి. దేశవాసులు ప్రతి ఒక్క రంగం లో అసాధారణంగా మెలగారు. మన నవ పారిశ్రామికుల, మన శాస్త్రవేత్త ల బలం వల్లే దేశం టీకామందు కోసం ఏ ఒక్కరి మీద గాని, లేదా ఏ దేశం పైన అయినా గాని ఆధారపడడం లేదు. మన దగ్గర టీకా లేదనుకోండి, ఏమి జరిగేదో ఒక్క క్షణం పాటు ఊహించండి. పోలియో టీకా ను సంపాదించుకోవడం కోసం ఎంత కాలం పట్టింది?
మహమ్మారి యావత్తు ప్రపంచాన్ని పట్టి కుదుపేస్తున్న అంతటి ప్రధానమైన సంకట కాలం లో టీకాల ను సంపాదించడం అత్యంత కష్టమైపోయింది. భారతదేశానికి అది చిక్కేదో, లేక చిక్కకపోకయేదో, ఒకవేళ టీకామందు ను అందుకొన్నప్పటికీ అది సకాలం లో దక్కుతుందా అనేది ఖాయం అని చెప్పలేని స్థితి. కానీ ప్రస్తుతం మనం గర్వంగా చెప్పగలం ప్రపంచం లోకెల్లా అతి భారీ టీకాకరణ కార్యక్రమం మన దేశం లోనే నిర్వహించడం జరుగుతున్నది అని.
ఏభై నాలుగు కోట్ల కు పైగా ప్రజలు వ్యాక్సీన్ డోసు ను తీసుకొన్నారు. కోవిన్, డిజిటల్ సర్టిఫికెట్ ల వంటి ఆన్ లైన్ వ్యవస్థ లు ఇవాళ ప్రపంచం దృష్టి ని ఆకర్షిస్తున్నాయి. విశ్వమారి కాలం లో నెలల తరబడి దేశ ప్రజల లో 80 కోట్ల మంది కి నెలల తరబడి నిరంతరం గా ఆహార ధాన్యాల ను ఉచితం గా సమకూర్చడం ద్వారా భారతదేశం పేద కుటుంబాల పొయ్యిలు చల్లారిపోకుండా చూసిన తీరు ప్రపంచం ముక్కున వేలు వేసుకొనేటట్టు చేయడమే కాకుండా ఒక చర్చనీయాంశం గా కూడా అయింది. ఇతర దేశాల తో పోల్చిచూసినప్పుడు భారతదేశం లో సంక్రమణ బారిన పడ్డ వారు తక్కువ గానే ఉన్నారన్నది సత్యం; ప్రపంచం లో ఇతర దేశాల జనాభా తో పోలిస్తే మనం భారతదేశం లో ఎక్కువ మంది ప్రాణాల ను కాపాడగలిగామనేది కూడా వాస్తవమే. అయితే అది గర్వించవలసినటువంటి అంశమేం కాదు. ఈ సఫలత ల తో మనం విశ్రమించలేం. ఏ సవాలు కూడా లేకపోయిందని అనడం మన స్వీయ అభివృద్ధి మార్గం లో ఒక ఆటంకం గా మిగలగలదు.
ప్రపంచం లోని ధనిక దేశాల తో పోల్చి చూసినప్పుడు మన వ్యవస్థలు చాలినంత గా లేవు. సంపన్న దేశాల దగ్గర ఉన్నవి మన దగ్గర లేవు. పైపెచ్చు, ప్రపంచం లోని ఇతర దేశాలతో పోలిస్తే మన జనాభా కూడా చాలా పెద్దది. మన జీవన శైలి కూడాను భిన్నమైంది. మనం శక్తి వంచన లేకుండా ప్రయత్నించినప్పటికీ, ఎంతో మంది ప్రాణాల ను మనం రక్షించుకోలేకపోయాం. ఈ కారణం గా చాలా మంది పిల్లలు తల్లి, తండ్రి లేని పిల్లలు గా మిగిలారు. ఈ భరించరాని వేదన ఎల్లకాలం ఉండేటటువంటిది.
ప్రియమైన నా దేశవాసులారా,
ప్రతి దేశం తనను తాను పునర్నిర్వచించుకుని సరికొత్త సంకల్పంతో ముందడుగు వేసినపుడే ఆ దేశ అభివృద్ధి వేగవంతం అవుతుంది. ఇవాళ భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో అలాంటి సమయం ఆసన్నమైంది. భారత స్వాతంత్ర్యానికి 75 ఏళ్లు పూర్తవుతున్నఈ సందర్భాన్ని కేవలం వేడుకలకు మాత్రమే పరిమితం చేయకుండా.. సరికొత్త సంకల్పాన్ని తీసుకుంటూ దాన్ని క్షేత్రస్థాయిలో అమయ్యేందుకు అవసరమైన కార్యాచరణతో ముందుకెళ్లాలి. ఇవాళ్టినుంచి మొదలుకుని వచ్చే 25 ఏళ్లు, అంటే భారతదేశం స్వాతంత్ర్య శతాబ్దిని జరుపుకునే నాటి వరకు జరిగే ఈ ప్రయాణం నవభారత నిర్మాణానికి ‘అమృతమైన కాలం’గా నిలిపోనుంది. ఈ అమృతకాలంలో మనం సంకల్పించుకునే లక్ష్యాలను విజయవంతంగా అమలుచేసినపుడే స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలను ఘనంగా, గర్వంగా జరుపుకోగలం.
భారతదేశం, దేశ ప్రజలు మరింత సుభిక్షంగా ఉండేందుకు, దేశం అభివృద్ధి పథంలో మరింత వేగంగా దూసుకెళ్లేందుకే ఈ అమృతకాల లక్ష్యాన్ని ఏర్పాటుచేసుకున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరాల్లేని భారత నిర్మాణానికి ఈ అమృతకాలం లక్ష్యం అవసరం. ప్రజల జీవితాల్లోకి ప్రభుత్వ అనవసర జోక్యం తగ్గేందుకు ఈ అమృతకాల లక్ష్యం అవసరం. ఆధునిక మౌలికవసతుల కల్పనకోసం మనకు ఈ అమృతకాల లక్ష్యం అవసరం.
మనం ఎవరికీ తక్కువ కాదనే భావన ప్రతి భారతీయుడిలో కలగాలి. అయితే కఠోరమైన శ్రమ, ధైర్యసాహసాలుంటేనే ఈ భావన.. సంపూర్ణతను సంతరించుకుంటుంది. అందుకే మనం మన స్వప్నాలను, లక్ష్యాలను మదిలో ఉంచుకుని తదనుగుణంగా శ్రమిస్తూ, సమృద్ధవంతమైన దేశాన్ని తద్వారా సరిహద్దులకు అతీతంగా శాంతి, సామరస్యాలు కలిగిన ప్రపంచాన్ని నిర్మాణంలో భాగస్వాములు కావాలి.
ఈ అమృతకాలం 25 ఏళ్లపాటు ఉంటుంది. ఇది చాలా ఎక్కువ సమయం కదా అని మనం అలసత్వంతో కూర్చోవచ్చు. ఇప్పటినుంచే మనం ఈ దిశగా పనిచేయడం ప్రారంభించాలి. ఇకపై ఏ ఒక్క క్షణాన్నీ మనం వదులుకోకూడదు. ఇదే సరైన సమయం. మన దేశంలో మార్పులు రావాలి. అదే సమయంలో పౌరులుగా మన ఆలోచనాధోరణిలోరూ మార్పులు రావాలి. మారుతున్న పరిస్థితులుకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలి. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అనే స్ఫూర్తితో మేం ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. కానీ ఇవాళ ఎర్రకోట సాక్షిగా నేను ఇవాళ మరో పదాన్ని ఈ స్ఫూర్తికి జోడించబోతున్నాను. మనం సంకల్పించుకునే లక్ష్యాలను చేరుకునేందుకు ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ స్ఫూర్తితో మనం ప్రయత్నాన్ని ప్రారంభించాలని మీ అందరినీ కోరుదున్నాను. గత ఏడేళ్లుగా కోట్ల మంది లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలితాలను పొందుతున్నారు. భారతదేశంలోని ప్రతి పేదవ్యక్తికీ ఉజ్వల పథకం నుంచి ఆయుష్మాన్ భారత్ వరకు పథకాల ప్రాధాన్యత తెలుసు. ఇవాళ ప్రభుత్వ సంక్షేమ పథకాల చేరవేత మరింత వేగవంతం అవుతోంది. పథకాల సంఖ్య కూడా పెరిగింది. ఈ పథకాలన్నీ లక్ష్యాలకు మరింత చేరువవుతున్నాయి. గతంలోకంటే చాలా వేగవంతంగా పథకాల అమలు జరుగుతోంది. కానీ దీనితోనే సంతృప్తి చెందాలనుకోవడం లేదు. ఒక స్థిరమైన, ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకునేవరకు విశ్రమించకూడదు. ప్రతి గ్రామానికి మంచి రోడ్డు ఉండాలి. ప్రతి కుటుంబానికి కనీసం ఒక బ్యాంకు అకౌంటైనా ఉండాలి. లబ్ధిదారులందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డులుండాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉజ్వల పథకం చేరాలి. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ బీమా, పింఛను, ఇల్లు పథకాలు చేరాలి. వందశాతం లక్ష్యాలను చేరుకునే దిశగా మన కార్యాచరణ సాగాలి. నేటి వరకు రోడ్లు, ఫుట్పాత్లపైన వస్తువులు అమ్ముకునే మన వీధివ్యాపారులకోసం సరైన ఆలోచన ఏదీ జరగలేదు. ఇలాంటి మిత్రులందరికీ బ్యాంకు అకౌంట్లు ఇచ్చి.. వాటిని స్వనిధి పథకానికి అనుసంధానం చేయాల్సి ఉంది.
ఇటీవలే భారతదేశంలో ప్రతి కుటుంబానికీ విద్యుత్తునందించే కార్యక్రమం 100 శాతం పూర్తయింది. దాదాపుగా అందరికీ మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం పూర్తయింది. వీటిలాగే ఇతర పథకాల్లోనూ అందరు అర్హులు, లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ఫలితాలు అందే లక్ష్యంతో పనిచేయాలి. ఇందుకోసం మనం డెడ్ లైన్ లాంటివి ఏవీ పెట్టుకోకుండా.. వీలైనంత త్వరగా వచ్చే కొద్ది సంవత్సరాల్లోనే అనుకున్న లక్ష్యాలను పూర్తిచేయాలి.
ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికీ తాగునీరందించేందుకు వేగంగా ముందుకెళ్తోంది. కేవలం రెండేళ్లలోనే జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా నాలుగున్నర కోట్ల కుటుంబాలకు నల్లాల ద్వారా తాగునీరు అందిస్తున్నాం. వారందరికీ ఇప్పులు పైపుల ద్వారా నీరందిస్తున్నాం. కోట్లమంది తల్లులు, సోదరీమణుల ఆశీర్వాద బలమే మన ప్రధానపెట్టుబడి. అందుకే ఏ ఒక్క అర్హుడికీ ప్రభుత్వ పథకాలు అందకుండా ఉండొద్దనేదే మా లక్ష్యం. ఈ ప్రయత్నంలో భాగంగా అవినీతికి, వివక్షకు ఎక్కడా తావుండకూడదు. సమాజంలోని చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు అంది తీరాల్సిందే.
ప్రియమైన నా దేశవాసులారా,
భారతదేశంలోని ప్రతి పేద కుటుంబానికి సరైన పౌష్టికాహారాన్ని అందించాలనేది మా ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి. పేద మహిళలు, వారి పిల్లల్లో పౌష్టికాహార లోపం కారణంగానే వారి అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే పేదలందరికీ వివిధ పథకాల పేరుతో ఆహారధాన్యాలను అందించాలని నిర్ణయించాం. పౌష్టికత కలిగిన బియ్యాన్ని, ఇతర ఆహారధాన్యాలను.. పౌరసరఫరాల పంపిణీ దుకాణాలు (రేషన్ షాపులు), పిల్లలకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ఇలా వీలైనన్ని మార్గాల్లో పౌష్టికాహారాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. 2024 నాటికి దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాం.
ప్రియమైన నా దేశవాసులారా,
దేశంలో పేదప్రజలందరికీ సరైన వైద్యవసతులు కల్పించాలనే మా లక్ష్యాన్ని వేగవంతంగా అమలుచేస్తున్నాం. ఇందుకు తగినట్లుగా వైద్యవిద్యలో చాలా సంస్కరణలను తీసుకొచ్చాం. వ్యాధులు వచ్చాక తీసుకునే చికిత్సకంటే నివారణకు సంబంధించిన అంశాలపైనే ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. దీంతో పాటుగా వైద్యవిద్యకు సంబంధించిన సీట్ల సంఖ్యను కూడా గణనీయంగా పెంచాం. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా దేశంలోని ప్రతి గ్రామంలో నాణ్యమైన వైద్య వసతులను అందిస్తున్నాం. జన్ ఔషధి కేంద్రాల ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ఔషధాలను అందిస్తున్నాం. తదనుగుణంగా దేశవ్యాప్తంగా 75వేల హెల్త్, వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటుచేశాం. ఆధునిక వసతులు కలిగిన ఆసుపత్రులు, మెడికల్ ల్యాబ్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. వీలైనంత తక్కువ సమయంలోనే దేశంలోని వేల సంఖ్యలోని ఆసుపత్రులు తమ సొంత ఆక్సీజన్ ప్లాంట్లను ప్రారంభించుకోబోతున్నాయి.
ప్రియమైన నా దేశవాసులారా,
భారతదేశం 21వ శతాబ్దంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకుంటే.. మన దేశంలో ఉన్న వనరులను వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాల్సిన తక్షణావసరం ఉంది. ఇది చాలా ముఖ్యమైన అంశం.
ఇందుకోసం బలహీన, వెనుకబడిన వర్గాలకు మనం చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. వారి కనీస అవసరాలను తీర్చడంతోపాటు దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలు, ఇతర పేదలకు అర్హత ఆధారంగా రిజర్వేషన్లను కొనసాగించాల్సిన అవసరముంది. ఇటీవలే ఆలిండియా కోటా వైద్యవిద్య సీట్లలో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఇందుకోసం పార్లమెంటులో చట్టాన్ని తీసుకొచ్చాం. దీని ద్వారా రాష్ట్రప్రభుత్వాలు వారి వారి రాష్ట్రాల్లో బీసీల సంఖ్యకు అనుగుణంగ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వొచ్చు.
ప్రియమైన నా దేశవాసులారా,
భారతదేశంలోని ఏ ఒక్క సామాజికవర్గం, ఏ ఒక ప్రాంతం భారతదేశ అభివృద్ధిపథంలో వెనకబడకూడదనేదే మా లక్ష్యం. ఈ దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి అంతటా జరగాలి. అభివృద్ధి అన్నిచోట్లా వ్యాపించాలి. సమగ్రాభివృద్ధి జరగాలి. అందుకే గత ఏడేళ్లుగా దేశంలోని వెనుకబడిన ప్రాంతాలన్నింటినీ ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అది ఈశాన్య రాష్ట్రాలైనా కావొచ్చు, అది జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అయినా కావొచ్చు. హిమాలయ శ్రేణుల్లోని రాష్ట్రాలు కావొచ్చు, మన తీరప్రాంతాలు కావొచ్చు, గిరిజన ప్రాంతాలు కావొచ్చు. ఈ ప్రాంతాలన్నీ భారతదేశాభివృద్ధిలో కీలకభూమిక పోషించేందుకు కృషిచేస్తున్నాం.
ఇవాళ ఈశాన్యభారతం అనుసంధానకు సంబంధించి సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. మనసులను కలపడంతోపాటు మౌలికవసతుల అనుసంధానతకు బీజం వేస్తోంది. త్వరలోనే అన్ని రాష్ట్రాల రాజధానులకు ఈశాన్యభారతంతో అనుసంధానం చేసే రైలు సేవల ప్రాజెక్టు పూర్తికాబోతుంది. యాక్ట్-ఈస్ట్ పాలసీలో భాగంగా.. ఇవాళ ఈశాన్య భారతం.. బంగ్లాదేశ్, మయన్మార్, ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానమైంది. గత కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాల కారణంగా శ్రేష్ఠ భారత నిర్మాణం జరుగుతోంది. ఇందుకోసం ఈశాన్యప్రాంతాల్లో శాంతిపూర్వక వాతావరణం కోసం బహుముఖ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈశాన్య భారతంలో పర్యాటక రంగ అభివృద్ధికి విస్తృతమైన అవకాశాలున్నాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్, సేంద్రియ వ్యవసాయం, మూలికావైద్యం, ఆయిల్ పంప్స్ వంటి రంగాల్లో విస్తృతమైన అభివృద్ధికి ఆస్కారం ఉంది. ఈ సామర్థ్యాన్ని వెలికితీసి సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆ ప్రాంతాన్ని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి. ఈ పనులన్నీ మనం సంకల్పించుకున్న అమృతకాలంలోనే పూర్తిచేయాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా అందరికీ సమానమైన అవకాశాలను కల్పించాలి. జమ్మూ, కశ్మీర్ ల్లోనూ అభివృద్ధి జరుగుతున్న తీరు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనబడుతోంది.
జమ్మూ, కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన కోసం కమిటీని ఏర్పాటుచేయడం జరిగింది. త్వరలోనే అక్కడ ఎన్నికలు నిర్వహిస్తాం. లద్దాఖ్ కూడా తనకున్న అపరిమితమైన అభివృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందడుగేస్తోంది. లద్దాఖ్ ఓ వైపు ఆధునిక వసతుల కల్పనతో ముందుకెళ్తుంటే.. మరోవైపు సింధ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లద్దాఖ్ ఉన్నతవిద్యాకేంద్రంగా విరాజిల్లుతోంది.
21 శతాబ్దంలోని ఈ దశాబ్దిలో భారతదేశం నీలి ఆర్థిక వ్యవస్థ దిశగా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయబోతోంది. మత్స్యపరిశ్రమతోపాటు.. సముద్రపాచి (సీవీడ్) పెంపకంలో ఉన్న విస్తృతమైన అవకాశాలను కూడా సద్వినియోగ పరచుకోవాలి. సముద్ర అవకాశాలను సద్వినియోగం చేసుకోవడలో భాగంగా తీసుకొచ్చిన ‘ద డీప్ ఓషియన్ మిషన్’ సత్ఫలితాలనిస్తోంది. సముద్రంలో నిక్షిప్తమై ఉన్న ఖనిజ సంపద, జలశక్తి వంటివి రానున్న రోజుల్లో భారతదేశ అభివృద్ధి పథకాన్ని సరికొత్త దిశల్లోకి తీసుకెళ్తాయి.
దేశంలో అభివృద్ధి విషయంలో వెనుకబడిన జిల్లాల ఆకాంక్షలను మేం గుర్తించాం. దేశంలోని 100కు పైగా ఇలాంటి (యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్) జిల్లాలల్లో విద్య, వైద్యం, పౌష్టికాహారం, రోడ్లు, ఉపాధికల్పన తదితర అంశాల అభివృద్ధికి ప్రత్యేకమైన పథకాన్ని ప్రారంభించాం. వీటిలో ఎక్కువ ప్రాంతం గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ జిల్లాల్లో అభివృద్ధికి సంబంధించి ఆరోగ్యకరమైన పోటీ ఉండేలా పోటీతత్వాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఈ పోటీ కారణంగానే ఇప్పుడు యాస్పిరేషనల్ జిల్లాలు ఇతర అభివృద్ధి చెందిన ప్రాంతాలకు అనుగుణంగా పురోగతిని సాధిస్తున్నాయి.
ప్రియమైన నా దేశవాసులారా,
ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో పెట్టుబడిదారీ విధానం, సామ్యవాదం గురించి విస్తృతంగా చర్చ జరుగుతుంది. కానీ భారతదేశం సహకార విధానం (కోఆపరేటివిజం) పై ఎక్కువగా దృష్టిసారించింది. ఇది మన విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా ఉంటుంది. సహకార విధానం అంటే.. ప్రజలందరి సంయుక్త శక్తితో ఓ బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడమని అర్థం. దేశ క్షేత్రస్థాయి ఆర్థిక వ్యవస్థకు ఇదెంతో కీలకం. సహకార వ్యవస్థలంటే కొన్ని నియమ, నిబంధనలతో పనిచేసే వ్యవస్థ మాత్రమే కాదు. సహకారం అంటే ఓ స్ఫూర్తి, సంస్కృతి, అందరం కలిసి ముందుకెళ్దామనే ఓ ఆలోచన. అందుకే సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఓ ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశాం. దీని ద్వారా రాష్ట్రాల్లోని సహకార వ్యవస్థకు సాధికారత కల్పించనున్నాం.
ప్రియమైన నా దేశవాసులారా,
ఈ దశాబ్దంలో.. మన గ్రామాల్లో సరికొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు మనం సర్వశక్తులు ఒడ్డాల్సిన అవసరముంది. మన గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరును మనం చూస్తున్నాం. గత కొన్నేళ్లుగా మా ప్రభుత్వం గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ వంటి మౌలికవసతుల కల్పన చేపట్టింది. ఈ గ్రామాల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్, ఇంటర్నెట్ తో అనుసంధానం చేస్తున్నాం. గ్రామాల్లోనూ డిజిటల్ పారిశ్రామికవేత్తలు పెరుగుతున్నారు. స్వయం సహాయక బృందాల్లోని 8కోట్లకు పైగా ఉన్న మన సోదరీమణులు ఉన్నతశ్రేణి వస్తువులను రూపొందిస్తున్నారు. ప్రభుత్వం వీరికోసం ఓ ఈ-కామర్స్ వేదికను ఏర్పాటుచేయనుంది. దీని ద్వారా వీరు తమ ఉత్పత్తులను దేశ, విదేశాల్లో విక్రయించేందుకు వీలుకలుగుతుంది. నేడు భారతదేశం ‘వోకల్ ఫర్ లోకల్’ (స్థానికతకు పెద్దపీట) పేరుతో ముందుకెళ్తున్న ఈ సమయంలో.. ఇలాంటి వేదికల ఏర్పాటు దేశవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక బృందాలకు ఎంతగానో ఉపయుక్తం అవుతాయి. తద్వారా వారి ఆర్థిక సామర్థ్యం, సాధికారత పెరుగుతాయి.
కరోనా సందర్భంగా భారతదేశం మన సాంకేతిక సామర్థ్యానికి, మన శాస్త్రవేత్తల సామర్థ్యానికి వారి చిత్తశుద్ధికి సాక్షిగా నిలిచింది. మన శాస్త్రవేత్తలు, పరిశోధకులు అహోరాత్రులు శ్రమించారు. వారి సామర్థ్యాలను ఇకపై వ్యవసాయ రంగానికి కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దీనికోసం మరి కొంతకాలం మనం వేచి ఉండలేము. దీంతోపాటుగా పళ్లు, కూరగాయలు, ఆహారధాన్యాల ఉత్పత్తిని మరింతగా పెంచి దేశానికి ఆహార భద్రతను పెంచుకోవడంతోపాటు ప్రపంచ యవనికపై మన సామర్థ్యాన్ని చాటుకోవాల్సిన అవసరముంది.
ఈ సంయుక్త ప్రయత్నాల ద్వారా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వ్యవసాయ కమతాలు పెరగకపోవడం, కుటుంబాలు విడివిడిగా ఉండటం కారణంగా కమతాల పరిణామం తగ్గుతుండటం తదితర అంశాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీని ద్వారా వ్యవసాయం కూడా తగ్గుతోంది. దీన్ని హెచ్చరిక గా పరిగణించాలి. మన దేశంలో 80 శాతానికి పైగా రైతులకు రెండు హెక్టార్లకన్నా తక్కువ భూమి ఉంది. మన దేశంలో వందకు 80 మందికి రెండు హెక్టార్లకంటే తక్కువ భూమి ఉందంటే.. మన దేశంలో చిన్నరైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని అర్థం. కానీ దురదృష్టవశాత్తూ గతంలో ప్రభుత్వాలు తీసుకున్న విధానపర నిర్ణయాల కారణంగా ఈ రంగానికి సరైన మద్దతు లభించలేదు. వారికి సరైన ప్రాధాన్యత లభించలేదు. కానీ మేము.. ఈ చిన్న, సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని వారి శ్రేయస్సుకోసం వివిధ పథకాలను తీసుకొచ్చి.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం.
వ్యవసాయ రంగంలో .. పంటబీమా పథకాన్ని అమలు చేయడం, కనీస మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు పెంచడం, కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా తక్కువ ధరకే రైతులకు రుణాలు అందించడం, సౌరవిద్యుత్ సంబంధిత పథకాలను రైతులకు వర్తింపజేయడం, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటుచేయడం వంటి ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చాం. ఈ పథకాల ద్వారా చిన్న రైతుల శక్తి పెరుగుతుంది. రానున్న రోజుల్లో బ్లాక్ స్థాయిలో వేర్ హౌజ్ సదుపాయాన్న కూడా రైతులకు అందించే పథకాన్ని తీసుకురాబోతున్నాం.
చిన్న రైతుల చిన్న చిన్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించాం. దీని ద్వారా పదికోట్లకు పైగా చిన్న రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి రూ.1.5లక్షల కోట్ల రూపాయలను నేరుగా చేరవేశాం. చిన్నరైతుల సంక్షేమం ఇప్పుడు మా ప్రధాన అంశాల్లో ఒకటి. చిన్న రైతులు దేశానికి గర్వకారణం. ఇదే మా స్వప్నం. రానున్న రోజుల్లో చిన్న రైతుల సంయుక్త శక్తిసామర్థ్యాలను పెంచెందుకు మరిన్ని సౌకర్యాలను అందజేయనున్నాం.
నేడు దేశవ్యాప్తంగా 70కి పైగా రైలు మార్గాల్లో ‘కిసాన్ రైళ్ల’ను నడుపుతున్నాం. ఈ కిసాన్ రైళ్ల ద్వారా చిన్న రైతులు తమ ఉత్పత్తులను తక్కువ ధరకే సుదూర ప్రాంతాలకు చేరవేయవచ్చు. కమలం, షాహి లిచీ, భుట్ జో లోకియా చిల్లీస్, బ్లాక్ రైస్, పసుపు వంటి వస్తువులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మన దేశంలో పండిన పంట ఉత్పత్తులు వేరే దేశాలకు ఎగుమతి అవుతుంటే ఆ ఆనందమే వేరు. ప్రపంచం మన కూరగాయలు, ఆహారధాన్యాల రుచిని ఆస్వాదిస్తోంది.
ప్రియమైన నా దేశవాసులారా,
మన గ్రామాల సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు ఉద్దేశించిన పథకం ‘స్వామిత్వ యోజన’. గ్రామాల్లోని భూముల విలువలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భూహక్కులు ఉన్నప్పటికీ.. దస్తావేజుల ప్రకారం ఆ భూముల్లో ఏ పనులూ జరగడం లేదు. దీంతో ఆ పత్రాల ఆధారంగా వారికి రుణాలు అందడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్నేళ్లుగా ఇలాగే జరుగుతోంది. ఈ స్వామిత్వ పథకం ద్వారా.. ఆ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాం. ఇవాళ ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు, ప్రతి సెంటు భూమిని డ్రోన్ల సాయంతో మ్యాపింగ్ చేశాం. దీనికి సంబంధించిన డేటా, గ్రామస్తుల వద్దనున్న భూపత్రాలను ఆన్ లైన్ లో అప్ డేట్ చేశాం. దీని ద్వారా గ్రామాల్లో భూవివాదాలు తగ్గడంతోపాటుగా.. వారి భూములపై రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు వెసులుబాటు కలిగింది. గ్రామాల్లోని రైతుల భూములు వివాదాల కన్నా అభివృద్ధి కేంద్రాలుగా మారాలనేదే మా ఉద్దేశం. యావద్భారతం ఈ దిశగానే ముందుకెళ్తోంది.
ప్రియమైన నా దేశవాసులారా,
స్వామి వివేకానంద భారతదేశ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నప్పుడు, తల్లి భారతి వైభవాన్ని దర్శింపజేస్తున్నప్పుడు.. ఒక మాట చెప్పేవారు. ‘వీలైనంత ఎక్కువగా గతంలోకి తొంగిచూడండి. అక్కడినుంచి వచ్చే అనుభవాలను సరిగ్గా అర్థం చేసుకోండి. తర్వాత భవిష్యత్తును చూడండి. ఆ అనుభవాల నుంచి నేర్చిన పాఠాలతో భవ్యమైన భారతాన్ని నిర్మించండి’ అని చెప్పేవారు. భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. మనలో అంతర్లీనంగా ఉన్న అపారమైన శక్తిసామర్థ్యాలను విశ్వసిస్తూ.. ముందుకెళ్లడం మన బాధ్యత. కొత్తతరం మౌలికవసతుల కల్పనకోసం మనమంతా కలిసి పనిచేయాలి. ప్రపంచస్థాయి వస్తువుల ఉత్పత్తికోసం అవసరమైన సాంకేతికతను వృద్ధి చేసుకోవాలి. నవతరం సాంకేతికత కోసం కూడా మనమంతా కలిసి పనిచేయాలి.
ప్రియమైన నా దేశవాసులారా,
ఆధునిక మౌలిక వసతుల ఆధారంగానే ఆధునిక ప్రపంచంలో అభివృద్ధికి మూలాలు ఏర్పడతాయి. ఈ వసతులే మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాయి. బలహీనమైన మౌలికవసతుల కారణంగా అభివృద్ధి వేగం కుంటుబడుతుంది. పట్టణ మధ్యతరగతి వర్గం కూడా చాలా ఇబ్బందులు పడుతుంది.
భవిష్యత్ తరం మౌలిక వసతుల కోసం, ప్రపంచస్థాయి తయారీ వ్యవస్థకోసం, సృజనాత్మకత, నవతరం సాంకేతికత కోసం మనమంతా కలిసి పనిచేయాల్సి ఉంది.
ప్రియమైన నా దేశవాసులారా,
ఈ అవసరాన్ని గుర్తించిన భారతదేశం సముద్రం, భూమితోపాటు ఆకాశంతో అనుసంధానమైన ప్రతి అంశంలోనూ అసాధారణమైన ప్రగతిని కనబరుస్తోంది. సరికొత్త జలమార్గాల ద్వారా సముద్ర విమానాల సాయంతో సరికొత్త ప్రాంతాలను అనుసంధానించడంతో విశేషమైన ప్రగతి జరుగుతోంది. భారతీయ రైల్వే వ్యవస్థ కూడా సరికొత్త మార్పులను ఎప్పటికప్పుడు అవగతం చేసుకుంటూ తదనుగుణంగా ముందుకెళ్తోంది. భారతదేశ స్వాతంత్ర్యానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమృత్ మహోత్సవ్ ను నిర్వహించాలని యావద్భారతం నిశ్ఛయించింది. 75 వారాల పాటు స్వాతంత్ర్యోత్సవాలను జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. 12 మార్చ్ న మొదలైన ఈ ఉత్సవాలు 2023 ఆగస్టు 15న ముగుస్తాయి. ఈ సందర్భంగా సరికొత్త ఉత్సాహంతో మనమంతా కలిసి ముందుకెళ్దాం.
ఈ 75 వారాల అమృత్ మహోత్సవ్ సంబరాల సందర్భంగా 75 వందే భారత్ రైళ్లు దేశంలోని ప్రతి మూలను అనుసంధానం చేసేలా నడపబడుతున్నాయి. ఉడాన్ పథకం ద్వారా దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాన్ని అనుసంధానం చేసేందుకు విమానాశ్రయాల నిర్మాణం కూడా వేగవంతంగా, అసాధారణ పద్ధతిలో కొనసాగుతోంది. ప్రజల ఆకాంక్షలను పూర్తిచేసేందుకు వాయు అనుసంధానత ఎలా ఉపయుక్తం అవుతుందో మనం చూడగలం.
ప్రియమైన నా దేశవాసులారా,
ఆధునిక మౌలిక వసతులను సమకూర్చుకోవడంతోపాటు.. మౌలికవసతుల నిర్మాణంలో సమగ్రమైన, పూర్ణరూపాత్మక విధానాలను స్వీకరించాల్సిన అవసరం ఉంది. అందుకోసం రానున్న రోజుల్లో.. కోట్లాది మంది భారతీయుల స్వప్నాలను నెరవేర్చేందుకు ప్రధానమంత్రి గతిశక్తి పథకం మాస్టర్ ప్లాన్ ను ఆవిష్కరించనున్నాం. 100 లక్షల కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలమంది నిరుద్యోగ యువతకు ఉపాధికల్పన జరుగుతుంది.
మన దేశ ఆర్థిక వ్యవస్థను పరిపూర్ణాత్మకంగా ముందుకు తీసుకెళ్లేందుకు, అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఈ గతిశక్తి పథకం ‘జాతీయ మౌలిక వసతుల కల్పన మాస్టర్ ప్లాన్’గా ఉండబోతోంది. ప్రస్తుతానికి మనదగ్గరున్న వివిధ రకాల రవాణా మార్గాలకు సరైన అనుసంధానత లేదు. కానీ గతిశక్తి పథకం ఈ అడ్డంకులను తొలగిస్తూ.. సరికొత్త మార్గాలకు బాటలు వేయనుంది. ఇది సామాన్య భారతీయుడి ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించడంతోపాటు ఉత్పత్తి మరింతగా పెరిగేందుకు దోహదపడుతుంది. దీంతోపాటుగా మన స్థానీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ ను కల్పించడంలో ఈ గతిశక్తి పథకం చాలా ఉపయుక్తం అవుతుంది. తద్వారా సరికొత్త ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుకు అవకాశాలు మెరుగవుతాయి. ఈ దశాబ్దంలో, ఇలాంటి వేగవంతమైన వ్యవస్థ ద్వారానే భారతదేశం సంపూర్ణమైన మార్పునకు కారణభూతం అవుతుంది.
ప్రియమైన నా దేశవాసులారా,
భారతదేశం తయారీ రంగంలో పురోతి సాధించడంతోపాటు ఎగుమతులను కూడా పెంచుకోవడం ద్వారా అభివృద్ధి పథాన్ని చేరుకోవచ్చు.
ప్రియమైన నా దేశవాసులారా,
అభివృద్ధి పథంలో పయనించేందుకు భారతదేశం తయారీ రంగంలో పురోగతి సాధించడంతోపాటు ఎగుమతులను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కొద్దిరోజుల క్రితం జరిగిన పరిణామాలను మీరు గమనించే ఉంటారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ ను సముద్ర జలాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించిన విషయం మీకు తెలిసిందే. ఇవాళ భారతదేశం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ విమానాలను, సొంత సాంకేతికతతో సబ్ మరైన్ లను తయారు చేసుకుంటోంది. అంతరిక్షంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు గగన్యాన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాం. ఇవన్నీ భారతదేశంలో అంతర్లీనంగా ఉన్న సామర్థ్యానికి మచ్చుతునకలు మాత్రమే.
కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితుల కారణంగా మేకిన్ ఇండియా కార్యక్రమానికి ఊతమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా జరుగుతున్న పురోగతికి ఎలక్ట్రానిక్ తయారీ రంగం ఓ చక్కటి ఉదాహరణగా నిలిచింది. ఏడేళ్ల క్రితం మనం దిగుమతి చేసుకున్న ఫోన్ల విలువ 8 బిలియన్ డాలర్లుగా ఉండేది. కానీ ఇప్పుడు.. ఆ దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతోపాటుగా మనమే ఇప్పుడు మూడు బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లను ఎగుమతి చేస్తున్నాం.
నేడు మన తయారీరంగం వేగవంతమైన పురోగతి సాధిస్తున్న సమయంలో.. మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం.. మన దేశంలో తయారయ్యే ఏ వస్తువైనా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, ఆ నాణ్యతా ప్రమాణాలను సంతృప్తి పరచేలా ఉండాలి. లేదా.. మనమే ఒక అడుగు ముందుకేసి.. ప్రపంచ మార్కెట్ అవసరాలను అనుగుణంగా సరికొత్త ప్రమాణాలను నిర్ణయించే స్థాయికి చేరుకుందాం. ఈ లక్ష్యంతో మనం ముందుకెళ్తే ఎన్నో అద్భుతాలు సృష్టించగలం. అందుకే దేశంలో ఉన్న తయారీదారులందరికీ ఈ సందర్భంగా నేను ఓ విషయాన్ని చెప్పదలచుకున్నాను. మీరు ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసే వస్తువులు కేవలం మీ కంపెనీకి మాత్రమే సంబంధించినవి కావు. అవి భారతదేశ గుర్తింపును, మన గౌరవమర్యాదలను,మన పౌరుల అస్తిత్వాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
అందుకే నేను మళ్ళీ చెబుతున్నాను:
ఇదే సమయం, ఇదే సరైన సమయం,
ఇది భారతదేశానికి విలువైన సమయం.
ఇదే సమయం, ఇదే సరైన సమయం,
ఇది భారతదేశానికి విలువైన సమయం.
అసంఖ్యాక ఆయుధాల శక్తిని కలిగి ఉంది,
అసంఖ్యాక ఆయుధాల శక్తిని కలిగి ఉంది,
ప్రతిచోటా దేశం పట్ల భక్తి ఉంది.
అసంఖ్యాక ఆయుధాల శక్తిని కలిగి ఉంది,
ప్రతిచోటా దేశం పట్ల భక్తి ఉంది.
నువ్వు లేచి, త్రివర్ణాన్ని ఆవిష్కరించు,
భారతదేశ భవిష్యత్తును ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్ళండి !
ఇదే సమయం, ఇదే సరైన సమయం,
ఇది భారతదేశానికి విలువైన సమయం. ..
అసాధ్యం, ఏమీ లేదు,
కఠినమైనది, అలాంటిదేమీ లేదు.
మీరు లేవండి, పని చేయండి
మీ బలాన్ని గుర్తించండి,
మీ విధులను తెలుసుకోండి,
మీ విధులను తెలుసుకోండి …
ఇదే సమయం, ఇదే సరైన సమయం,
ఇది భారతదేశానికి విలువైన సమయం …
దేశానికి స్వాతంత్య్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తయినప్పుడు, దేశ ప్రజల లక్ష్యాలు నెరవేరాలని నా కోరిక. ఇదే శుభాకాంక్షలతో, దేశంలోని సోదర సోదరీమణులందరికీ 75 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు నాతో మీ చేయి పైకెత్తి ఇలా చెప్పండి: –
జై హింద్!
జై హింద్ !!
జై హింద్ !!!
వందేమాతరం!
వందేమాతరం !!
వందేమాతరం !!
భారత మాతా కీ జై !
భారత మాతా కీ జై !!
భారత మాతా కీ జై !!!
చాలా ధన్యవాదాలు!
**********
Addressing the nation from the Red Fort. Watch. https://t.co/wEX5viCIVs
— Narendra Modi (@narendramodi) August 15, 2021
I would like to begin by conveying greetings on this special occasion of Independence Day. This is a day to remember our great freedom fighters: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2021
आजादी का अमृत महोत्सव, 75वें स्वतंत्रता दिवस पर आप सभी को और विश्वभर में भारत को प्रेम करने वाले, लोकतंत्र को प्रेम करने वाले सभी को बहुत-बहुत शुभकामनाएं: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2021
कोरोना वैश्विक महामारी में हमारे डॉक्टर, हमारे नर्सेस, हमारे पैरामेडिकल स्टाफ, सफाईकर्मी, वैक्सीन बनाने मे जुटे वैज्ञानिक हों, सेवा में जुटे नागरिक हों, वे सब भी वंदन के अधिकारी हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2021
भारत के पहले प्रधानमंत्री नेहरू जी हों, देश को एकजुट राष्ट्र में बदलने वाले सरदार पटेल हों या भारत को भविष्य का रास्ता दिखाने वाले बाबासाहेब अम्बेडकर, देश ऐसे हर व्यक्तित्व को याद कर रहा है, देश इन सबका ऋणी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2021
हम आजादी का जश्न मनाते हैं, लेकिन बंटवारे का दर्द आज भी हिंदुस्तान के सीने को छलनी करता है।
— PMO India (@PMOIndia) August 15, 2021
यह पिछली शताब्दी की सबसे बड़ी त्रासदी में से एक है।
कल ही देश ने भावुक निर्णय लिया है।
अब से 14 अगस्त को विभाजन विभीषिका स्मृति दिवस के रूप में याद किया जाएगा: PM @narendramodi
प्रगति पथ पर बढ़ रहे हमारे देश के सामने, पूरी मानवजाति के सामने कोरोना का यह कालखंड बड़ी चुनौती के रूप में आया है।
— PMO India (@PMOIndia) August 15, 2021
भारतवासियों ने संयम और धैर्य के साथ इस लड़ाई को लड़ा है: PM @narendramodi
हर देश की विकासयात्रा में एक समय ऐसा आता है, जब वो देश खुद को नए सिरे से परिभाषित करता है, खुद को नए संकल्पों के साथ आगे बढ़ाता है।
— PMO India (@PMOIndia) August 15, 2021
भारत की विकास यात्रा में भी आज वो समय आ गया है: PM @narendramodi
यहां से शुरू होकर अगले 25 वर्ष की यात्रा नए भारत के सृजन का अमृतकाल है।
— PMO India (@PMOIndia) August 15, 2021
इस अमृतकाल में हमारे संकल्पों की सिद्धि, हमें आजादी के 100 वर्ष तक ले जाएगी: PM @narendramodi
संकल्प तब तक अधूरा होता है, जब तक संकल्प के साथ परिश्रम और पराक्रम की पराकाष्ठा न हो।
— PMO India (@PMOIndia) August 15, 2021
इसलिए हमें हमारे सभी संकल्पों को परिश्रम और पराक्रम की पराकाष्ठा करके सिद्ध करके ही रहना है: PM @narendramodi
सबका साथ-सबका विकास-सबका विश्वास, इसी श्रद्धा के साथ हम सब जुटे हुए हैं।
— PMO India (@PMOIndia) August 15, 2021
आज लाल किले से मैं आह्वान कर रहा हूं- सबका साथ-सबका विकास-सबका विश्वास और सबका प्रयास हमारे हर लक्ष्यों की प्राप्ति के लिए बहुत महत्वपूर्ण है: PM @narendramodi
अब हमें सैचुरेशन की तरफ जाना है।
— PMO India (@PMOIndia) August 15, 2021
शत प्रतिशत गांवों में सड़कें हों,
शत प्रतिशत परिवारों के पास बैंक अकाउंट हो,
शत प्रतिशत लाभार्थियों के पास आयुष्मान भारत का कार्ड हो,
शत-प्रतिशत पात्र व्यक्तियों के पास उज्ज्वला योजना का गैस कनेक्शन हो: PM @narendramodi
सरकार अपनी अलग-अलग योजनाओं के तहत जो चावल गरीबों को देती है, उसे फोर्टिफाई करेगी, गरीबों को पोषणयुक्त चावल देगी।
— PMO India (@PMOIndia) August 15, 2021
राशन की दुकान पर मिलने वाला चावल हो, मिड डे मील में मिलने वाला चावल हो, वर्ष 2024 तक हर योजना के माध्यम से मिलने वाला चावल फोर्टिफाई कर दिया जाएगा: PM @narendramodi
21वीं सदी में भारत को नई ऊंचाई पर पहुंचाने के लिए भारत के सामर्थ्य का सही इस्तेमाल, पूरा इस्तेमाल जरूरी है।
— PMO India (@PMOIndia) August 15, 2021
इसके लिए जो वर्ग पीछे है, जो क्षेत्र पीछे है, हमें उनकी हैंड-होल्डिंग करनी ही होगी: PM @narendramodi
हमारा पूर्वी भारत, नॉर्थ ईस्ट, जम्मू-कश्मीर, लद्दाख सहित पूरा हिमालय का क्षेत्र हो, हमारी कोस्टल बेल्ट या फिर आदिवासी अंचल हो, ये भविष्य में भारत के विकास का बड़ा आधार बनेंगे: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2021
आज नॉर्थ ईस्ट में कनेक्टिविटी का नया इतिहास लिखा जा रहा है। ये कनेक्टिविटी दिलों की भी है और इंफ्रास्ट्रक्चर की भी है।
— PMO India (@PMOIndia) August 15, 2021
बहुत जल्द नॉर्थ ईस्ट के सभी राज्यों की राजधानियों को रेलसेवा से जोड़ने का काम पूरा होने वाला है: PM @narendramodi
सभी के सामर्थ्य को उचित अवसर देना, यही लोकतंत्र की असली भावना है।
— PMO India (@PMOIndia) August 15, 2021
जम्मू हो या कश्मीर, विकास का संतुलन अब ज़मीन पर दिख रहा है।
जम्मू कश्मीर में डी-लिमिटेशन कमीशन का गठन हो चुका है और भविष्य में विधानसभा चुनावों के लिए भी तैयारी चल रही है: PM @narendramodi
लद्दाख भी विकास की अपनी असीम संभावनाओं की तरफ आगे बढ़ चला है।
— PMO India (@PMOIndia) August 15, 2021
एक तरफ लद्दाख, आधुनिक इंफ्रास्ट्रक्चर का निर्माण होते देख रहा है तो वहीं दूसरी तरफ ‘सिंधु सेंट्रल यूनिवर्सिटी’ लद्दाख को उच्च शिक्षा का केंद्र भी बनाने जा रही है: PM @narendramodi
देश के जिन ज़िलों के लिए ये माना गया था कि ये पीछे रह गए, हमने उनकी आकांक्षाओं को भी जगाया है।
— PMO India (@PMOIndia) August 15, 2021
देश मे 110 से अधिक आकांक्षी ज़िलों में शिक्षा, स्वास्थ्य, पोषण, सड़क, रोज़गार, से जुड़ी योजनाओं को प्राथमिकता दी जा रही है।
इनमें से अनेक जिले आदिवासी अंचल में हैं: PM @narendramodi
आज हम अपने गांवों को तेजी से परिवर्तित होते देख रहे हैं।
— PMO India (@PMOIndia) August 15, 2021
बीते कुछ वर्ष, गांवों तक सड़क और बिजली जैसी सुविधाओं को पहुंचाने रहे हैं।
अब गांवों को ऑप्टिकल फाइबर नेटवर्क, डेटा की ताकत पहुंच रही है, इंटरनेट पहुंच रहा है। गांव में भी डिजिटल Entrepreneur तैयार हो रहे हैं: PM
गांव में जो हमारी सेल्फ हेल्प ग्रुप से जुड़ी 8 करोड़ से अधिक बहनें हैं, वो एक से बढ़कर एक प्रॉडक्ट्स बनाती हैं।
— PMO India (@PMOIndia) August 15, 2021
इनके प्रॉडक्ट्स को देश में और विदेश में बड़ा बाजार मिले, इसके लिए अब सरकार ई-कॉमर्स प्लेटफॉर्म तैयार करेगी: PM @narendramodi
छोटा किसान बने देश की शान, ये हमारा सपना है।
— PMO India (@PMOIndia) August 15, 2021
आने वाले वर्षों में हमें देश के छोटे किसानों की सामूहिक शक्ति को और बढ़ाना होगा। उन्हें नई सुविधाएं देनी होंगी: PM @narendramodi
देश के 80 प्रतिशत से ज्यादा किसान ऐसे हैं, जिनके पास 2 हेक्टेयर से भी कम जमीन है।
— PMO India (@PMOIndia) August 15, 2021
पहले जो देश में नीतियां बनीं, उनमें इन छोटे किसानों पर जितना ध्यान केंद्रित करना था, वो रह गया।
अब इन्हीं छोटे किसानों को ध्यान में रखते हुए निर्णय लिए जा रहे हैं: PM @narendramodi
हमें मिलकर काम करना होगा, Next Generation Infrastructure के लिए।
— PMO India (@PMOIndia) August 15, 2021
हमें मिलकर काम करना होगा, World Class Manufacturing के लिए।
हमें मिलकर काम करना होगा Cutting Edge Innovation के लिए।
हमें मिलकर काम करना होगा New Age Technology के लिए: PM @narendramodi
देश ने संकल्प लिया है कि आजादी के अमृत महोत्सव के 75 सप्ताह में 75 वंदेभारत ट्रेनें देश के हर कोने को आपस में जोड़ रही होंगी।
— PMO India (@PMOIndia) August 15, 2021
आज जिस गति से देश में नए Airports का निर्माण हो रहा है, उड़ान योजना दूर-दराज के इलाकों को जोड़ रही है, वो भी अभूतपूर्व है: PM @narendramodi
भारत को आधुनिक इंफ्रास्ट्रक्चर के साथ ही इंफ्रास्ट्रक्चर निर्माण में होलिस्टिक अप्रोच अपनाने की भी जरूरत है।
— PMO India (@PMOIndia) August 15, 2021
भारत आने वाले कुछ ही समय में प्रधानमंत्री गतिशक्ति- नेशनल मास्टर प्लान को लॉन्च करने जा रहा है: PM @narendramodi
विकास के पथ पर आगे बढ़ते हुए भारत को अपनी मैन्यूफैक्चरिंग और एक्सपोर्ट, दोनों को बढ़ाना होगा।
— PMO India (@PMOIndia) August 15, 2021
आपने देखा है, अभी कुछ दिन पहले ही भारत ने अपने पहले स्वदेशी एयरक्राफ्ट कैरियर INS विक्रांत को समुद्र में ट्रायल के लिए उतारा है: PM @narendramodi
भारत आज अपना लड़ाकू विमान बना रहा है, सबमरीन बना रहा है, गगनयान भी बना रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2021
देश के सभी मैन्यूफैक्चर्स को भी ये समझना होगा-
— PMO India (@PMOIndia) August 15, 2021
आप जो Product बाहर भेजते हैं वो आपकी कंपनी में बनाया हुआ सिर्फ एक Product नहीं होता।
उसके साथ भारत की पहचान जुड़ी होती है, प्रतिष्ठा जुड़ी होती है, भारत के कोटि-कोटि लोगों का विश्वास जुड़ा होता है: PM @narendramodi
मैं इसलिए मनुफक्चरर्स को कहता हूँ -
— PMO India (@PMOIndia) August 15, 2021
आपका हर एक प्रॉडक्ट भारत का ब्रैंड एंबेसेडर है। जब तक वो प्रॉडक्ट इस्तेमाल में लाया जाता रहेगा, उसे खरीदने वाला कहेगा - हां ये मेड इन इंडिया है: PM @narendramodi
हमने देखा है, कोरोना काल में ही हजारों नए स्टार्ट-अप्स बने हैं, सफलता से काम कर रहे हैं।
— PMO India (@PMOIndia) August 15, 2021
कल के स्टार्ट-अप्स, आज के Unicorn बन रहे हैं।
इनकी मार्केट वैल्यू हजारों करोड़ रुपए तक पहुंच रही है: PM @narendramodi
Reforms को लागू करने के लिए Good औऱ Smart Governance चाहिए।
— PMO India (@PMOIndia) August 15, 2021
आज दुनिया इस बात की भी साक्षी है कि कैसे भारत अपने यहां गवर्नेंस का नया अध्याय लिख रहा है: PM @narendramodi
मैं आज आह्वान कर रहा हूं, केंद्र हो या राज्य सभी के विभागों से, सभी सरकारी कार्यालयों से। अपने यहां नियमों-प्रक्रियाओं की समीक्षा का अभियान चलाइए।
— PMO India (@PMOIndia) August 15, 2021
हर वो नियम, हर वो प्रक्रिया जो देश के लोगों के सामने बाधा बनकर, बोझ बनकर, खड़ी हुई है, उसे हमें दूर करना ही होगा: PM @narendramodi
आज देश के पास 21वीं सदी की जरूरतों को पूरा करने वाली नई ‘राष्ट्रीय शिक्षा नीति’ भी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2021
जब गरीब के बेटी, गरीब का बेटा मातृभाषा में पढ़कर प्रोफेशनल्स बनेंगे तो उनके सामर्थ्य के साथ न्याय होगा।
— PMO India (@PMOIndia) August 15, 2021
नई राष्ट्रीय शिक्षा नीति को गरीबी के खिलाफ लड़ाई का मैं साधन मानता हूं: PM @narendramodi
नई राष्ट्रीय शिक्षा नीति की एक और विशेष बात है।
— PMO India (@PMOIndia) August 15, 2021
इसमें स्पोर्ट्स को Extracurricular की जगह मेनस्ट्रीम पढ़ाई का हिस्सा बनाया गया है।
जीवन को आगे बढ़ाने में जो भी प्रभावी माध्यम हैं, उनमें एक स्पोर्ट्स भी है: PM @narendramodi
ये देश के लिए गौरव की बात है कि शिक्षा हो या खेल, बोर्ड्स के नतीजे हों या ओलपिंक का मेडल, हमारी बेटियां आज अभूतपूर्व प्रदर्शन कर रही हैं।
— PMO India (@PMOIndia) August 15, 2021
आज भारत की बेटियां अपना स्पेस लेने के लिए आतुर हैं: PM @narendramodi
आज मैं एक खुशी देशवासियों से साझा कर रहा हूँ।
— PMO India (@PMOIndia) August 15, 2021
मुझे लाखों बेटियों के संदेश मिलते थे कि वो भी सैनिक स्कूल में पढ़ना चाहती हैं, उनके लिए भी सैनिक स्कूलों के दरवाजे खोले जाएं: PM @narendramodi
दो-ढाई साल पहले मिजोरम के सैनिक स्कूल में पहली बार बेटियों को प्रवेश देने का प्रयोग किया गया था।
— PMO India (@PMOIndia) August 15, 2021
अब सरकार ने तय किया है कि देश के सभी सैनिक स्कूलों को देश की बेटियों के लिए भी खोल दिया जाएगा: PM @narendramodi
भारत की प्रगति के लिए, आत्मनिर्भर भारत बनाने के लिए भारत का Energy Independent होना अनिवार्य है।
— PMO India (@PMOIndia) August 15, 2021
इसलिए आज भारत को ये संकल्प लेना होगा कि हम आजादी के 100 साल होने से पहले भारत को Energy Independent बनाएंगे: PM @narendramodi
भारत आज जो भी कार्य कर रहा है, उसमें सबसे बड़ा लक्ष्य है, जो भारत को क्वांटम जंप देने वाला है- वो है ग्रीन हाइड्रोजन का क्षेत्र।
— PMO India (@PMOIndia) August 15, 2021
मैं आज तिरंगे की साक्षी में National Hydrogen Mission की घोषणा कर रहा हूं: PM @narendramodi
21वीं सदी का आज का भारत, बड़े लक्ष्य गढ़ने और उन्हें प्राप्त करने का सामर्थ्य रखता है।
— PMO India (@PMOIndia) August 15, 2021
आज भारत उन विषयों को भी हल कर रहा है, जिनके सुलझने का दशकों से, सदियों से इंतजार था: PM @narendramodi
Article 370 को बदलने का ऐतिहासिक फैसला हो,
— PMO India (@PMOIndia) August 15, 2021
देश को टैक्स के जाल से मुक्ति दिलाने वाली व्यवस्था- GST हो,
हमारे फौजी साथियों के लिए वन रैंक वन पेंशन हो,
या फिर रामजन्मभूमि केस का शांतिपूर्ण समाधान, ये सब हमने बीते कुछ वर्षों में सच होते देखा है: PM @narendramodi
त्रिपुरा में दशकों बाद ब्रू रियांग समझौता होना हो,
— PMO India (@PMOIndia) August 15, 2021
ओबीसी कमीशन को संवैधानिक दर्जा देना हो,
या फिर जम्मू-कश्मीर में आजादी के बाद पहली बार हुए BDC और DDC चुनाव,
भारत अपनी संकल्पशक्ति लगातार सिद्ध कर रहा है: PM @narendramodi
आज दुनिया, भारत को एक नई दृष्टि से देख रही है और इस दृष्टि के दो महत्वपूर्ण पहलू हैं।
— PMO India (@PMOIndia) August 15, 2021
एक आतंकवाद और दूसरा विस्तारवाद।
भारत इन दोनों ही चुनौतियों से लड़ रहा है और सधे हुए तरीके से बड़े हिम्मत के साथ जवाब भी दे रहा है: PM @narendramodi
आज देश के महान विचारक श्री ऑरबिंदो की जन्मजयंती भी है।
— PMO India (@PMOIndia) August 15, 2021
साल 2022 में उनकी 150वां जन्मजयंती है: PM @narendramodi
वो कहते थे कि- हमें उतना सामर्थ्यवान बनना होगा, जितना हम पहले कभी नहीं थे।
— PMO India (@PMOIndia) August 15, 2021
हमें अपनी आदतें बदली होंगी, एक नए हृदय के साथ अपने को फिर से जागृत करना होगा: PM @narendramodi
जिन संकल्पों का बीड़ा आज देश ने उठाया है, उन्हें पूरा करने के लिए देश के हर जन को उनसे जुड़ना होगा, हर देशवासी को इसे Own करना होगा।
— PMO India (@PMOIndia) August 15, 2021
देश ने जल संरक्षण का अभियान शुरू किया है, तो हमारा कर्तव्य है पानी बचाने को अपनी आदत से जोड़ना: PM @narendramodi
मैं भविष्य़दृष्टा नहीं हूं, मैं कर्म के फल पर विश्वास रखता हूं।
— PMO India (@PMOIndia) August 15, 2021
मेरा विश्वास देश के युवाओं पर है।
मेरा विश्वास देश की बहनों-बेटियों, देश के किसानों, देश के प्रोफेशनल्स पर है।
ये Can Do Generation है, ये हर लक्ष्य हासिल कर सकती है: PM @narendramodi
21वीं सदी में भारत के सपनों और आकांक्षाओं को पूरा करने से कोई भी बाधा रोक नहीं सकती।
— PMO India (@PMOIndia) August 15, 2021
हमारी ताकत हमारी जीवटता है, हमारी ताकत हमारी एकजुटता है।
हमारी प्राणशक्ति, राष्ट्र प्रथम, सदैव प्रथम की भावना है: PM @narendramodi
यही समय है, सही समय है,
— PMO India (@PMOIndia) August 15, 2021
भारत का अनमोल समय है।
असंख्य भुजाओं की शक्ति है,
हर तरफ़ देश की भक्ति है,
तुम उठो तिरंगा लहरा दो,
भारत के भाग्य को फहरा दो: PM @narendramodi
यही समय है, सही समय है, भारत का अनमोल समय है।
— PMO India (@PMOIndia) August 15, 2021
कुछ ऐसा नहीं जो कर ना सको,
कुछ ऐसा नहीं जो पा ना सको,
तुम उठ जाओ, तुम जुट जाओ,
सामर्थ्य को अपने पहचानो,
कर्तव्य को अपने सब जानो,
भारत का ये अनमोल समय है,
यही समय है, सही समय है: PM @narendramodi
India marks Amrit Mahotsav with a sense of gratitude to those who toiled for freedom and with a commitment to build a strong and prosperous India.
— Narendra Modi (@narendramodi) August 15, 2021
Here are glimpses from the Red Fort today. #IndiaIndependenceDay pic.twitter.com/y0i0FVKKFx
I bow to the great Sri Aurobindo Ji on his Jayanti. His intellectual clarity, noble tenets and emphasis on India's regeneration give us great strength. He made pioneering contributions to India's freedom movement. pic.twitter.com/Q6UkV4swkd
— Narendra Modi (@narendramodi) August 15, 2021