Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు ల కోసంఉద్దేశించిన కేంద్ర ప్రాయోజిత పథకాన్ని మరో 2 సంవత్సరాల పాటు కొనసాగించడానికిఆమోదం తెలిపిన మంత్రిమండలి


389 ప్రత్యేక పోక్సో (పిఒసిఎస్ ఒ) కోర్టు లు సహా 1023 ఫాస్ట్ ట్రాక్ స్పెశల్ కోర్టు (ఎఫ్ టిఎస్ సి) లను ఒక ప్రాయోజిక పథకం (సిఎస్ఎస్) గా ఈ సంవత్సరం లో ఏప్రిల్ 1వ తేదీ మొదలుకొని 2023 వ సంవత్సరం లో మార్చి 31వ తేదీ వరకు కొనసాగించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. దీనికి గాను మొత్తం వ్యయం 1572.86 కోట్ల రూపాయలు అవుతుంది. దీనిలో 971.70 కోట్ల రూపాయలు కేంద్రం వాటా గా, 601.16 కోట్ల రూపాయలు రాష్ట్ర వాటా గా ఉంటుంది. కేంద్రం వాటా ధనాన్ని నిర్భయ నిధి నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకాన్ని 2019వ సంవత్సరం లో అక్టోబర్ 2 న ప్రారంభించడమైంది.

 

మహిళ ల, బాల ల భద్రత కు, సురక్ష కు ప్రభుత్వం సదా అత్యున్నత ప్రాధాన్యాన్ని ఇస్తూ వస్తోంది. బాలిక ల స్వశక్తీకరణ దిశ లో, ‘బేటీ బచావో భేటీ పడావోవంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. పన్నెండేళ్ల వయస్సు కన్నా తక్కువ ప్రాయం లో ఉన్న బాలికల పైన జరుగుతున్న అత్యాచార ఘటన లు, 16 ఏళ్ల వయస్సు లోపు ఉన్న మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు యావత్తు దేశ ప్రజల మనస్సాక్షి ని కుదిపివేశాయి. ఆ తరహా ఘటన లు సంభవిస్తూ ఉండడం, అపరాధుల విచారణ ఎడతెగక కొనసాగుతూ ఉండడం అనే పరిణామాలు విచారణ ను సత్వరంగా ముగించవలసిన, లైంగిక నేరాల బాధితుల కు వెనువెంటనే ఊరట ను కల్పించవలసిన ఒక ప్రత్యేక న్యాయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవలసిన అగత్యాన్ని ఏర్పరచాయి.

 

ఆ తరహా వ్యాజ్యాల ను శీఘ్ర గతి న విచారణ జరిపి, పరిష్కరించడానికి మరింత కఠినమైన నిబంధనల ను తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం ‘‘నేర శాసనం (సవరణ) చట్టం, 2018’’ కి చట్ట రూపాన్ని ఇచ్చింది. అత్యాచారాని కి తెగబడిన వారికి మరణ శిక్ష సహా అతి తీవ్రమైన దండన ను విధించే నియమాన్ని కూడా జతపరచింది. ఇది ఫాస్ట్ ట్రాక్ స్పెశల్ కోర్టు (ఎఫ్ టిఎస్ సి) ల స్థాపన కు దారి తీసింది.

 

ఫాస్ట్ ట్రాక్ స్పెశల్ కోర్టు లు అనేవి న్యాయాన్ని చాలా తొందరగా అందేటట్లు పూచీ పడే ప్రత్యేక న్యాయస్థానాలు గా పేరు ను తెచ్చుకొంటాయని ఆశించడం జరిగింది. యథావిధి గా పనిచేసే న్యాయస్థానాలతో పోల్చిచూస్తే వాటికి ఒక మెరుగైనటువంటి పరిష్కారాల రికార్డు ఉంది. మరి అవి విచారణలను వేగంగా చేపడుతున్నాయి. నిస్సహాయ బాధితురాళ్ల కు శీఘ్ర న్యాయాన్ని అందించడమే కాకుండా లైంగిక నేరగాళ్ల ను కట్టడి చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఫ్రేమ్ వర్క్ ను కూడా అవి బలోపేతం చేస్తున్నాయి.

 

ప్రస్తుతం 28 రాష్ట్రాల లో పని చేస్తున్న ఈ న్యాయస్థానాలు ఈ పథకం లో చేరడానికి అర్హత ఉన్న మొత్తం 31 రాష్ట్రాలను సైతం ఇముడ్చుకొనే విధం గా ఆ న్యాయస్థానాల పరిధి ని విస్తరించాలని ప్రతిపాదించడమైంది. ఇది దేశం లోని సుదూర ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు సహా అన్ని చోట్ల లైంగిక నేరాల బారిన పడుతున్న అశక్త బాధితురాళ్ల కు నిర్ణీత కాలం లోపల న్యాయాన్ని అందించడం కోసం రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాల కు అండదండలను అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఆశిస్తున్న ఫలితాలు ఈ కింద పేర్కొన్న విధం గా ఉన్నాయి:

· బాలిక ల, మహిళ ల భద్రత, సురక్ష అనే ఆశయానికి దన్ను గా నిలబడేందుకు దేశం మరింత వచనబద్ధురాలు అవుతోంది.

· అత్యాచారం కేసు లు మరియు పోక్సో చట్టం ల తాలూకు పరిష్కారం కాకుండా ఉన్న కేసుల సంఖ్య ను తగ్గించడం.

· లైంగిక నేరాల బారిన పడిన బాధితురాళ్ల కు న్యాయాన్ని సత్వరమే సమకూర్చడం తో పాటు లైంగిక నేరగాళ్లను నిరోధించే విధం గా కూడా కృషి చేయడం.

· నేరాల పిడికిట్లో చిక్కిన బాధితురాళ్ల కు న్యాయాన్ని సత్వరమే సమకూర్చడం తో పాటు లైంగిక నేరగాళ్ల ను నిరోధించే విధం గా కూడా కృషి చేయడం.

***