Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దివంగత శ్రీమతి బల్ జీత్ కౌర్ తులసి గారు రాసిన పుస్తకం ‘ద రామాయణ ఆఫ్ శ్రీ గురు గోబింద్ సింహ్ జీ’ ఒకటో ప్రతి ని అందుకొన్న ప్ర‌ధాన మంత్రి


దివంగత శ్రీమతి బల్ జీత్ కౌర్ తులసి గారు రాసిన పుస్తకం ‘ద రామాయణ ఆఫ్ శ్రీ గురు గోబింద్ సింహ్ జీ’ ఒకటో ప్రతి ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అందుకొన్నారు. ప్రముఖ న్యాయవాది శ్రీ కె.టి.ఎస్. తులసి గారి మాతృమూర్తి యే శ్రీమతి బల్ జీత్ కౌర్ తులసి గారు.

ప్రధాన మంత్రి పలు ట్వీట్ లలో  ‘‘ ప్రముఖ న్యాయవాది శ్రీ కె.టి.ఎస్. తులసి గారి మాతృమూర్తి దివంగత శ్రీమతి బల్ జీత్ కౌర్ తులసి గారు రాసిన పుస్తకం ‘ద రామాయణ ఆఫ్ శ్రీ గురు గోబింద్ సింహ్ జీ’ ఒకటో ప్రతి ని అందుకొన్నాను. ఈ గ్రంథాన్ని ఐజిఎన్ సిఎ ప్రచురించింది.

మా భేటీ లో పండితుడు శ్రీ కె.టి.ఎస్. తులసి గారు సిఖ్కు మతం తాలూకు పవిత్ర సూత్రాలను గురించి వివరించారు.  ఆయన గురుబాణి శబ్దాల ను పఠించారు కూడాను.  ఆయన చేసిన ఈ కార్యం నా మనస్సు ను స్పర్శించింది. ఇదుగో ఆడియో ను ఇక్కడ వినగలరు.. https://t.co/0R9z836sLi ’’ అని పేర్కొన్నారు.

***

DS/SH