Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సిబిఎస్‌ఇ 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు

సిబిఎస్‌ఇ 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు


సిబిఎస్‌ఇ పన్నెండో తరగతి పరీక్షలకు సంబంధించి సమీక్షా సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, వివిధ భాగస్వాములతో ఇప్పటివరకు నిర్వహించిన విస్తృతమైన సంప్రదింపులపై అధికారులు సవివరంగా తెలియజేసారు. 

PM India

కోవిడ్ అనిశ్చిత పరిస్థితులతో పాటు వివిధ వాటాదారుల నుండి పొందిన ఫీడ్‌బ్యాక్ దృష్ట్యా, ఈ సంవత్సరం పన్నెండో తరగతి బోర్డు పరీక్షలు జరగవని నిర్ణయించారు. పన్నెండో తరగతి విద్యార్థుల ఫలితాలను నిర్దిష్ట ఆబ్జెక్టివ్ ప్రమాణాల ప్రకారం నిర్ణీత కాలవ్యవధిలో సంకలనం చేయడానికి సిబిఎస్‌ఇ చర్యలు తీసుకుంటుందని కూడా నిర్ణయించారు.

12 వ తరగతి సిబిఎస్‌ఇ పరీక్షలపై విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామని ప్రధాని చెప్పారు. కోవిడ్-19 అకాడెమిక్ క్యాలెండర్‌ పై ఎంతో ప్రభావం చూపిందని, బోర్డు పరీక్షల సమస్య విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ఈ స్థితికి ముగింపును ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. 

కోవిడ్ దేశవ్యాప్తంగా డైనమిక్ పరిస్థితిగా ఉందని ప్రధాని అన్నారు. దేశంలో సంఖ్యలు తగ్గుతున్నాయి, కొన్ని రాష్ట్రాలు సమర్థవంతమైన మైక్రో-కంటైనేషన్ ద్వారా పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ లాక్డౌన్ వైపు మొగ్గు చూపాయి. అటువంటి పరిస్థితిలో విద్యార్థుల ఆరోగ్యం గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు సహజంగా ఆందోళన చెందుతారు. ఇలాంటి ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో విద్యార్థులు బలవంతంగా పరీక్షలకు హాజరుకావద్దని ప్రధాన మంత్రి అన్నారు.

మన విద్యార్థుల ఆరోగ్యం మరియు భద్రతకు చాలా ప్రాముఖ్యత ఉందని, ఈ అంశంపై రాజీ ఉండదని ప్రధాని నొక్కి చెప్పారు. నేటి కాలంలో, ఇలాంటి పరీక్షలు మన యువతను ప్రమాదంలో పడటానికి కారణం కాదని ఆయన అన్నారు. 

ఈ అంశంలో భాగస్వాములైన వారంతా విద్యార్థుల పట్ల సున్నితంగా ఉండాలని ప్రధాని అన్నారు. నిర్ధారిత  ప్రమాణాలకు అనుగుణంగా, సుస్పష్ట విధానాలను పాటిస్తూ నిర్దిష్ట కాలవ్యవధిలో ఫలితాలు సిద్ధం అయ్యేలా చూడాలని ప్రధాన మంత్రి అధికారులను ఆదేశించారు.

విస్తృత సంప్రదింపుల ప్రక్రియను ప్రస్తావిస్తూ, దేశవ్యాప్తంగా ఇందుకు సంబంధించిన వారిని సంప్రదించిన తరువాత ఈ నిర్ణయానికి రావడాన్ని ప్రధాని ప్రశంసించారు. ఈ అంశంపై అభిప్రాయాన్ని తెలియజేసిన రాష్ట్రాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

గత సంవత్సరం మాదిరిగానే, కొంతమంది విద్యార్థులు పరీక్షలు రాయాలనుకుంటే ఎప్పుడు పరిస్థితి అనుకూలంగా మారుతుందో అప్పుడు అలాంటి ఎంపికను సిబిఎస్‌ఇ, వారికి అందిస్తుందని కూడా నిర్ణయించారు. గౌరవ ప్రధాని ఇంతకు ముందు 2021 మే 21న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఆ తరువాత 23.05.2021 న కేంద్ర రక్షణ మంత్రి అధ్యక్షతన సమావేశం జరిగింది, దీనికి రాష్ట్రాల విద్య మంత్రులు హాజరయ్యారు. సిబిఎస్‌ఇ పరీక్షల నిర్వహణకు వివిధ ఎంపికలు సమావేశంలో చర్చించారు. నేటి సమావేశంలో కేంద్ర హోం, రక్షణ, ఆర్థిక, వాణిజ్యం, సమాచార, ప్రసార, పెట్రోలియం, మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలు ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి, క్యాబినెట్ కార్యదర్శి, పాఠశాల విద్య, ఉన్నత విద్యా శాఖల కార్యదర్శులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

*****