Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

“రన్ ఫర్ రియో” కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి – దేశం కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వవలసిందిగా క్రీడాకారులకు విజ్ఞ‌ప్తి

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ జాతీయ క్రీడా ప్రాంగణంలో “రన్ ఫర్ రియో” జెండా ఊపి, పరుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

భారతీయ క్రీడాకారుల దళం లో తమ తమ స్థానాలను చేజిక్కించుకొనేందుకు క్రీడాకారులు అందరూ కఠోరంగా శ్రమించారని, వారంతా తప్పకుండా రియో ఒలంపిక్స్ లో దేశం కోసం తమదైన అత్యుత్తమ ప్రదర్శనను ఇవ్వగలరన్న నమ్మకం ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచవ్యాప్త ప్రజల హృద‌యాలను భారతీయ క్రీడాకారులు గెలుచుకొంటారని, ప్రపంచానికి భారతదేశం అంటే ఏమిటో నిరూపించగలరన్న నమ్మకాన్ని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.

2020 టోక్యో ఒలంపిక్స్ కోసం ఈ రోజు నుండే సన్నద్ధం కావాలంటూ ప్రధాన మంత్రి జాతికి పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి ఒక్క జిల్లా కూడా వచ్చే సారి ఒలంపిక్స్ కు అర్హతను సాధించే కనీసం ఒక్కొక్క క్రీడాకారులను తయారు చేసే దిశగా నడుంకట్టాల్సిందిగా ఆయన సూచించారు.

ఈసారి క్రీడాకారుల దళాన్ని ముందుగానే పంపించడం జరుగుతోందని, ఇలా చేయడం వల్ల వారు అక్కడి వాతావరణంతో పరిచితులు కాగలరని ప్రధాన మంత్రి తెలిపారు.

ఒలంపిక్ క్రీడలలో క్రీడాకారులందరూ చక్కగా రాణించాలంటూ వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలు మానవ జీవనంలో ఒక అవసరం. ప్రతి ఒక్కరినీ ఆటలాడి వెలుగులీనేటట్లు చేద్దాం అని ప్రధాన మంత్రి అన్నారు.

ఆ తరువాత ప్రధాన మంత్రి ఒలంపిక్ వివరణపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం “రన్ ఫర్ రియో” కోసం రూపొందించిన పతాకాన్ని ఊపి, పరుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

***