Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ర‌క్ష‌ణ రంగ పిఎస్‌యు ల ఏర్పాటు చేసే సంయుక్త‌ రంగ కంపెనీల‌కు సంబంధించిన ప్ర‌త్యేక మార్గ‌ద‌ర్శ‌కాల‌ ర‌ద్దుకు మంత్రిమండ‌లి ఆమోదం


ర‌క్ష‌ణ‌ రంగానికి చెందిన ప్ర‌భుత్వ‌ రంగ సంస్థ (డి పి ఎస్‌ యు)లు ఏర్పాటు చేసే సంయుక్త‌ రంగ సంస్థ (జె వి)ల‌కు సంబంధించి ప్రస్తుతం అమ‌లులో ఉన్న మార్గదర్శకాలను కేంద్ర మంత్రి మండ‌లి ర‌ద్దు చేసింది. ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోడీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్య‌క్ష‌త‌ వహించారు. 2012 ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌క‌టించిన ఈ మార్గదర్శకాలను డి పి ఎస్‌ యు లు నెల‌కొల్పే ప్ర‌త్యేక జె వి ల‌ విషయంలో ఇక‌పై పాటించవలసిన పని లేదు. కేంద్ర ప్ర‌భుత్వ‌రంగ సంస్థ (సి పి ఎస్ ఇ)లు అన్నింటికి ఒకే విధంగా వ‌ర్తించే విధంగా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల విభాగం (డి పి ఇ), ఆర్ధిక‌ మంత్రిత్వ శాఖ (ఎమ్ ఒ ఎఫ్‌)లు ఎప్ప‌టిక‌ప్పుడు జారీ చేసే మార్గదర్శకాలే డి పి ఎస్‌ యు లు నెల‌కొల్పే జె వి ల‌కు కూడా వ‌ర్తించగలవు. రక్షణ రంగంలో సాధించత‌ల‌పెట్టిన స్వావలంబన, స్వయంసమృద్ధి ల‌క్ష్యాలను ఈ నిర్ణయం నెర‌వేర్చగలదు.

ప్రస్తుతం అమ‌లులో ఉన్న జె వి మార్గదర్శకాల ర‌ద్దు నిర్ణయం డి పి ఎస్‌ యు ల‌కు, ప్రైవేటు రంగానికి సమాన అవకాశాలను అందించగలుగుతుంది. డి పి ఎస్ యు లు ఒక నూతన పద్ధతిలో భాగస్వామ్యాలను కుదుర్చుకోవడానికి ఇది వీలు కల్పించగలదు. దీనితో ర‌క్ష‌ణ‌ రంగంలో మ‌రింత స్వ‌యం స‌మృద్ధికి ఊతం అందగలదు. అంతే కాకుండా, డి పి ఎస్‌ యు లు జె వి లను నెలకొల్పే ప్రక్రియను సమర్థంగా నిర్వహించేందుకు, వాటికి మ‌రింత జ‌వాబుదారుత‌నాన్ని/స్వయంప్రతిపత్తిని ఇచ్చేందుకు మార్గాన్ని సుగ‌మం చేయగలదు. తద్వారా జాతీయ భద్రత ప్ర‌యోజ‌నాలను నెరవేర్చడంలో అత్యుత్తమ పరిణామాలను సాధించవచ్చు.

మొత్తం తొమ్మిది డి పి ఎస్ యు లు.. మఝ్ గాఁవ్ డాక్ లిమిటెడ్ , గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డ‌ర్స్ అండ్ ఇంజినీయర్స్ లిమిటెడ్‌, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌, భార‌త్ అర్థ్ మూవ‌ర్స్ లిమిటెడ్‌, భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌, మిశ్ర‌ ధాతు నిగ‌మ్ లిమిటెడ్ లు ఈ నిర్ణయం తాలూకు ప్ర‌యోజ‌నాన్ని పొంద‌నున్నాయి.

డి పి ఎస్‌ యు ల జె వి మార్గదర్శకాల అమ‌లులో సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణ‌యాన్ని తీసుకోవ‌డం జ‌రిగింది. ర‌క్ష‌ణ రంగంలో ప్ర‌యివేటు రంగం భాగ‌స్వామ్యం పెరుగుతున్న కొద్దీ ఈ రంగంలో కొనుగోళ్ల పరంగా పరివర్తన చోటు చేసుకొంటున్న కొద్దీ డి పి ఎస్‌ యు లు స్థాపించే జె వి ల‌కు ప్ర‌త్యేక మార్గదర్శకాలు అక్కరలేద‌నే నిర్ణయానికి ర‌క్ష‌ణ‌ ఉత్ప‌ాదన విభాగం వ‌చ్చింది. ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా ర‌క్ష‌ణ‌ రంగ ఉత్పత్తుల‌ను దేశీయంగా రూపొందించుకోవడంలోను / మేక్ ఇన్ ఇండియా ఉద్యమానికి ప్రాధాన్యం కట్టబెడుతున్నందువల్లను బహుళ విధ మార్గదర్శకాలను అవలంబించడమనేది సందిగ్ధతకు, అసమంజస్యతకు దారితీయ‌వచ్చని భావించారు.

పూర్వ‌రంగం:

ఉత్ప‌త్తుల రూప‌క‌ల్ప‌న‌, అభివృద్ధి సామ‌ర్ధ్యాల‌తో పాటు ర‌క్ష‌ణ‌ రంగంలో గ‌ణ‌నీయ‌మైన స్వ‌యం సమృద్ధిని సాధించే ల‌క్ష్యాల‌తో ర‌క్ష‌ణ‌ రంగ ఉత్పత్తి విధానాన్ని 2011 జ‌న‌వ‌రిలో అమలులోకి తీసుకువచ్చారు. ఇందుకోసం జె వి ల ఏర్పాటుతో సహా సాధ్య‌మైన అన్ని మార్గాల‌ను అన్వేషించాల‌ని ఈ విధానం సిఫారసు చేసింది. దీనికి కొన‌సాగింపుగా.. ర‌క్ష‌ణ‌ రంగ ప్ర‌త్యేక అవ‌స‌రాల‌ను తీర్చేందుకు, డి పి ఎస్‌ యు ల ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించేందుకు డి పి ఇ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప‌రిపుష్టం చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. దీంతో డి పి ఎస్‌ యు ల కోసం జెవి ప్రొటోకాల్స్, మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించవలసివ‌చ్చింది. దీనికి అనుగుణంగా డి పి ఎస్‌ యు లు సంయుక్త‌ రంగంలో కంపెనీల‌ను నెల‌కొల్పేందుకు అవ‌స‌ర‌మైన మార్గదర్శకాలను అప్ప‌టి మంత్రి మండ‌లి 2012 ఫిబ్ర‌వ‌రి 9నాడు జ‌రిగిన స‌మావేశంలో ఆమోదించింది. ఆమోదించిన మార్గదర్శకాలను 2012 ఫిబ్ర‌వ‌రి 17న ప్ర‌క‌టించారు. కాని ఇప్పుడు ర‌క్ష‌ణ‌ రంగంలో ప్రైవేటు భాగ‌స్వామ్యం పెరుగుతున్నందున, ర‌క్ష‌ణ‌ రంగంలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకుంటున్న కార‌ణంగా ప్ర‌త్యేక జె వి మార్గదర్శకాల అవ‌స‌రాన్ని పున‌:స‌మీక్షించవలసివ‌చ్చింది.