నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం.. మనందరి ధైర్యాన్ని, దుఃఖాన్ని, సహనాన్ని కరోనా పరీక్షిస్తున్న ఈ సమయంలో నేను ఈ మన్ కీ బాత్ ద్వారా మీతో మాట్లాడుతున్నాను. చాలామంది మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. కరోనా మొదటి దశను విజయవంతంగా ఎదుర్కొన్న తరువాత దేశం ఆత్మవిశ్వాసాన్ని పొందింది. కానీ ఈ తుఫాను దేశాన్ని కదిలించింది.
మిత్రులారా! గతంలో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో నేను సుదీర్ఘంగా చర్చించాను. ఔషధ పరిశ్రమకు చెందినవారు, టీకా తయారీదారులు, ఆక్సిజన్ ఉత్పత్తిలో పాల్గొన్న వ్యక్తులు, వైద్య రంగ పరిజ్ఞానం ఉన్నవారు తమ ముఖ్యమైన సలహాలను ప్రభుత్వానికి అందజేశారు. ఈ సమయంలో- ఈ యుద్ధంలో విజయం సాధించడానికి నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలో భారత ప్రభుత్వం పూర్తిగా నిమగ్నమై ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ బాధ్యతలను నెరవేర్చడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి.
మిత్రులారా! దేశంలోని వైద్యులు ,ఆరోగ్య కార్యకర్తలు ఈ సమయంలో కరోనాపై భారీ పోరాటం చేస్తున్నారు. గత ఏడాదిలో ఈ వ్యాధికి సంబంధించి వారికి అన్ని రకాల అనుభవాలు కలిగాయి. ముంబాయికి చెందిన ప్రసిద్ధ వైద్యులు డాక్టర్ శశాంక్ జోషి ఈ సమయంలో మనతో ఉన్నారు.
కరోనా చికిత్స, సంబంధిత పరిశోధనలలో డాక్టర్ శశాంక్ గారికి చాలా అనుభవం ఉంది. ఆయన ఇండియన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ డీన్ గా కూడా ఉన్నారు. డాక్టర్ శశాంక్ గారితో మాట్లాడదాం: –
మోదీ గారు: నమస్కారం డాక్టర్ శశాంక్ గారూ!
డాక్టర్ శశాంక్: నమస్కారం సార్!
మోదీ గారు: కొద్ది రోజుల క్రితం మీతో మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. మీ ఆలోచనలలోని స్పష్టతను నేను ఇష్టపడ్డాను. దేశంలోని ప్రజలందరూ మీ అభిప్రాయాలను తెలుసుకోవాలని నేను భావించాను. మనం వింటున్న విషయాలను నేను మీకు ప్రశ్నగా అందిస్తున్నాను. డాక్టర్ శశాంక్ గారూ.. మీరు ప్రస్తుతం రాత్రింబగళ్లు ప్రాణాలను రక్షించే పనిలో నిమగ్నమై ఉన్నారు. మొదట మీరు కరోనా రెండవ దశ గురించి ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. వైద్యపరంగా ఇది ఎలా భిన్నంగా ఉంటుంది? ఏ జాగ్రత్తలు అవసరం?
డాక్టర్ శశాంక్ : ధన్యవాదాలు సార్. ఇది రెండవ వేవ్. ఇది వేగంగా వచ్చింది. కాబట్టి ఈ వైరస్ మొదటి వేవ్ కంటే వేగంగా నడుస్తోంది. కాని మంచి విషయం ఏమిటంటే ఈ దశలో వేగంగా కోలుకుంటున్నారు. మరణాల రేట్లు చాలా తక్కువ. ఇందులో రెండు- మూడు తేడాలు ఉన్నాయి. ఇది యువతలో, పిల్లలలో కూడా కొద్దిగా ప్రభావాన్ని కలిగిస్తోంది. గతంలో కరోనా లక్షణాలైన శ్వాస తీసుకోలేకపోవడం, పొడి దగ్గు, జ్వరం- ఇవన్నీ ఉన్నాయి. వాటితో పాటు కొంచెం వాసన, రుచి తెలియకపోవడం కూడా ఉంది. ప్రజలు కొద్దిగా భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. 80-90 శాతం మందికి ఇందులో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఈ ఉత్పరివర్తనాలు భయాందోళనకు గురిచేసేవి కాదు. మనం బట్టలు మార్చినట్టుగానే వైరస్ కూడా దాని రంగును మారుస్తుంది. అందువల్ల భయపడటానికి ఏమీ లేదు. మనం ఈ దశను దాటుతాం. వేవ్ వస్తూపోతూ ఉంటుంది. ఈ వైరస్ వస్తూపోతూ ఉంటుంది. ఇవి విభిన్నమైన లక్షణాలు. వైద్యపరంగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది కోవిడ్ 14 నుండి 21 రోజుల టైమ్ టేబుల్. ఇందులో వైద్యుల సలహా తీసుకోవాలి.
మోదీ గారు: డాక్టర్ శశాంక్ గారూ! మీరు చెప్పిన విశ్లేషణ చాలా ఆసక్తికరంగా ఉంది. నాకు చాలా లేఖలు వచ్చాయి. వాటి ప్రకారం ప్రజలకు చికిత్స గురించి చాలా సందేహాలు ఉన్నాయి. కొన్ని ఔషధాల అవసరం చాలా ఉంది. కాబట్టి కోవిడ్ చికిత్స గురించి చెప్పండి.
డాక్టర్ శశాంక్: అవును సార్! క్లినికల్ ట్రీట్మెంట్ ను ప్రజలు చాలా ఆలస్యంగా ప్రారంభిస్తారు. ఈ వ్యాధి చికిత్స స్వయంగా చేసుకుంటారు. వారు నమ్మకంతో జీవిస్తారు. మొబైల్లో వస్తున్న విషయాలను విశ్వసిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని అనుసరిస్తే మనకు ఈ కష్టం ఎదురుకాదు. కోవిడ్ క్లినికల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ లో మూడు రకాల తీవ్రతలు ఉన్నాయి. ఒకటి తేలికపాటి కోవిడ్. రెండవది మధ్యస్థంగా ఉండే కోవిడ్. మూడవది తీవ్రమైన కోవిడ్.
తేలికపాటి కోవిడ్ విషయంలో ఆక్సిజన్ ను, పల్స్ ను, జ్వరాన్ని పరిశీలిస్తూ ఉంటాం. జ్వరం పెరుగుతున్నప్పుడు కొన్నిసార్లు పారాసెటమాల్ వంటి మందులను వాడతాం. కోవిడ్ మధ్యస్థంగా కానీ తీవ్రంగా కానీ ఉంటే వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి. సరైన, చవకైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఔషధాల్లో ఉండే స్టెరాయిడ్లు ఇన్హేలర్ల లాగా ప్రాణాలను కాపాడతాయి. మందులతో పాటు ఆక్సిజన్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. దీనికి చిన్న చిన్న చికిత్సలున్నాయి. రెమ్‌డెసివిర్ అనే కొత్త ప్రయోగాత్మక ఔషధం ఉంది. ఈ ఔషధంతో ఉపయోగం ఏమిటంటే దీనివల్ల ఆసుపత్రిలో రెండు మూడు రోజులు తక్కువ కాలం ఉండవచ్చు. క్లినికల్ రికవరీలో ఈ ఔషధం కొద్దిగా ఉపయోగపడుతుంది. మొదటి 9-10 రోజులలో ఇచ్చినప్పుడు ఈ ఔషధం పనిచేస్తుంది. దీన్ని కేవలం ఐదు రోజులు మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. రెమ్‌డెసివిర్ వెనుక పరుగెత్తడం ఉండకూడదు. ఈ ఔషధం ఆక్సిజన్ అవసరమైన పరిస్థితుల్లో మాత్రమే – అది కూడా ఆసుపత్రిలో చేరిన తర్వాత డాక్టర్ చెప్పినప్పుడు మాత్రమే తీసుకోవాలి. ప్రజలందరినీ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం ప్రాణాయామం చేస్తాం. మన ఊపిరితిత్తులను కొద్దిగా విస్తరిస్తాం. రక్తాన్ని పల్చగా చేసే హెపారిన్ అనే ఇంజెక్షన్ మొదలైన చిన్నచిన్న మందులు ఇస్తే 98% మంది ప్రజల్లో తగ్గిపోతుంది. ఆశావహ దృక్పథం కలిగి ఉండటం చాలా ముఖ్యం. వైద్యుడి సలహాతో చికిత్స పొందడం చాలా ముఖ్యం. ఈ ఖరీదైన ఔషధాల వెంట పడవలసిన అవసరం లేదు సార్. మన దగ్గర మంచి చికిత్స ఉంది. ప్రాణ వాయువు ఆక్సిజన్ ఉంది. వెంటిలేటర్ సౌకర్యం కూడా ఉంది. ప్రతిదీ ఉంది. ఈ ఔ షధాలను నిజంగా అవసరమైన వారికి మాత్రమే ఇవ్వాలి. ప్రపంచంలోనే ఉత్తమమైన చికిత్స మనకు అందుబాటులో ఉందని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను సార్. భారతదేశంలో రికవరీ రేటు కూడా ఎక్కువగా ఉంది. ఐరోపా, అమెరికా దేశాలతో పోలిస్తే మన చికిత్స పద్ధతులు బాగున్నాయి సార్.
మోదీ గారు: చాలా ధన్యవాదాలు డాక్టర్ శశాంక్ గారూ! డాక్టర్ శశాంక్ గారు మనకు ఇచ్చిన సమాచారం చాలా ముఖ్యమైంది. మనందరికీ ఉపయోగపడుతుంది.
మిత్రులారా! మీకు ఏదైనా సమాచారం కావాలంటే- మీకు ఏవైనా సందేహాలుంటే అధీకృత సమాచారాన్ని పొందండి. సమీపంలోని వైద్యులను కానీ మీ కుటుంబ వైద్యుడిని కానీ సంప్రదించండి. ఫోన్ ద్వారా వారిని సంప్రదించి సలహా తీసుకోండి. మన వైద్యులు చాలా మంది ఈ బాధ్యతను స్వయంగా తీసుకుంటున్న విషయం నేను చూస్తున్నాను. చాలా మంది వైద్యులు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సమాచారం ఇస్తున్నారు. ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా కూడా కౌన్సెలింగ్ చేస్తున్నారు. చాలా వైద్యశాలల వెబ్సైట్లలో సమాచారం కూడా అందుబాటులో ఉంది. ఆ వెబ్ సైట్ల ద్వారా మీరు వైద్యులను సంప్రదించవచ్చు. ఇది చాలా ప్రశంసనీయం.
శ్రీనగర్ కు చెందిన వైద్యులు డాక్టర్ నావీద్ నజీర్ షా ఇప్పుడు మనతో ఉన్నారు. డాక్టర్ నావీద్ శ్రీనగర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్. ఆయన తన పర్యవేక్షణలో చాలా మంది కరోనా రోగులకు వ్యాధి నయం చేశారు. డాక్టర్ నావీద్ ఈ పవిత్ర రంజాన్ మాసంలో కూడా తన పనిని చేస్తున్నారు. ఆయన మనతో మాట్లాడటానికి కూడా వీలు చేసుకున్నారు. వారితో మాట్లాడదాం.
మోదీ గారు: నావీద్ గారూ.. నమస్కారం!
డాక్టర్ నావీద్ – నమస్కారం సార్!
మోదీ గారు: డాక్టర్ నావీద్ గారూ.. ‘మన్ కీ బాత్‘ శ్రోతలు ఈ క్లిష్ట సమయంలో పానిక్ మేనేజ్మెంట్ ప్రశ్నను లేవనెత్తారు. ఆందోళనను, భయాన్ని దూరం చేసుకునే విషయంలో మీ అనుభవం నుండి మీరు వారికి ఏ సమాధానం ఇస్తారు?
డాక్టర్ నావీద్: కరోనా ప్రారంభమైనప్పుడు కోవిడ్ హాస్పిటల్ గా ప్రత్యేక హోదా పొందిన ఆసుపత్రి మా సిటీ హాస్పిటల్. ఈ వైద్యశాల మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉంది. ఆ సమయంలో భయానక వాతావరణం ఉంది. ఎవరికైనా కోవిడ్ సంక్రమిస్తే దాన్ని మరణశిక్షగా భావించేవారు. అటువంటి పరిస్థితిలో మా ఆసుపత్రిలో వైద్యులు, పారా-మెడికల్ సిబ్బందిలో కూడా ఒక భయంకరమైన వాతావరణం ఉంది. ఈ రోగులకు ఎలా చికిత్స చేయగలం? మాకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం లేదా? మొదలైన ప్రశ్నలు వచ్చాయి. కానీ సరైన రక్షణ పద్ధతులను మనకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం లేదు. కానీ సరైన రక్షణ పద్ధతులను పాటిస్తే మేము, మాతో పాటు మిగతా సిబ్బంది కూడా సురక్షితంగా ఉండవచ్చని కాలం గడుస్తున్న కొద్దీ మనం చూశాం. చాలా మంది రోగుల్లో వ్యాధి లక్షణాలు కూడా లేవు. 90-95% కంటే ఎక్కువ మంది రోగుల్లో చికిత్స లేకుండానే వ్యాధి నయమవుతోంది. కాలం గడిచేకొద్దీ కరోనా అంటే భయం తగ్గింది.
ఈ సమయంలో వచ్చిన ఈ రెండవ దశ కరోనా విషయంలో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. మాస్క్ పెట్టుకోవడం, హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించడం, భౌతిక దూరాన్ని పాటించడం, సమావేశాలకు దూరంగా ఉండడం మొదలైన రక్షణ చర్యలను పాటిస్తే మనం రోజువారీ పనులను చక్కగా చేసుకోవచ్చు. వ్యాధి నుండి రక్షణ పొందవచ్చు.
మోదీ గారు: డాక్టర్ నావీద్ గారూ.. టీకాలతో సహా చాలా విషయాల్లో ప్రజలకు చాలా సందేహాలున్నాయి. టీకా నుండి ఎంతమేరకు రక్షణ లభిస్తుంది? టీకా తర్వాత ఎంత భరోసా ఇవ్వవచ్చు? దీని గురించి మీరు చెప్తే శ్రోతలు ఎంతో ప్రయోజనం పొందుతారు.
డాక్టర్ నావీద్: కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు మనకు కోవిడ్ 19 కి ఎటువంటి సమర్థవంతమైన చికిత్స అందుబాటులో లేదు. అప్పుడు మనం వ్యాధితో కేవలం రెండు విధాలుగా పోరాడవచ్చు. వాటిలో ఒకటి రక్షణ పొందడం. ఏదైనా సమర్థవంతమైన వ్యాక్సిన్ ఉంటే వ్యాధి నుండి బయటపడవచ్చని మనం మొదటి నుండి అనుకుంటున్నాం. ఈ సమయంలో రెండు వ్యాక్సిన్లు మన దేశంలో అందుబాటులో ఉన్నాయి. కోవాక్సిన్, కోవిషీల్డ్ – రెండూ మన దేశంలో తయారైన టీకాలే. కంపెనీలు నిర్వహించిన ట్రయల్స్ లో వాటి సామర్థ్యం 60% కంటే ఎక్కువగా ఉందని తెలిసింది. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఇప్పటివరకు 15 నుండి 16 లక్షల మంది టీకా తీసుకున్నారు. అవును.. సోషల్ మీడియాలో చాలా అపోహలున్నాయి. దుష్ప్రభావాలు ఉన్నాయన్న భ్రమలు ఉన్నాయి. కానీ ఇక్కడ టీకాలు వేసిన వారిలో ఎటువంటి దుష్ప్రభావాలు లేవు. జ్వరం, మొత్తం శరీరంలో నొప్పి లేదా ఇంజెక్షన్ ఉన్న చోట మాత్రమే నొప్పి మొదలైనవి ఇతర టీకాల మాదిరిగానే ఈ టీకా తీసుకున్నవారిలో కూడా కనబడుతున్నాయి. ఈ లక్షణాలన్నీ ప్రతి వ్యాక్సిన్‌తో సాధారణ సంబంధం కలిగి ఉంటాయి. అంతే తప్ప టీకా వేసుకున్న ఎవరిలోనూ ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూడలేదు. అవును.. టీకాలు వేసిన తరువాత కొంతమంది పాజిటివ్ అయ్యారని ప్రజలలో ఒక భయం కూడా ఉంది. ఈ విషయంలో కంపెనీల నుండి మార్గదర్శకాలు ఉన్నాయి. ఆ తరువాత ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. వారు పాజిటివ్ కావచ్చు. కానీ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండదు. అంటే కోవిడ్ పాజిటివ్ ఉన్నా ప్రమాదకరం కాదు. కాబట్టి ఈ అపోహలు ఏవైనా ఉంటే వాటిని మన మెదడులో నుండి తొలగించాలి. మే 1వ తేదీ నుండి మన దేశంలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి టీకా కార్యక్రమం ప్రారంభమవుతోంది. అప్పుడు మనం ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. అందరూ టీకా తీసుకోవాలి. దానిద్వారా ఎవరిని వారు రక్షించుకోవడంతో పాటు మొత్తం సమాజాన్ని రక్షించుకోవచ్చు. అందరూ టీకా తీసుకుంటే కోవిడ్ 19 సంక్రమణ నుండి సమాజానికి రక్షణ లభిస్తుంది.
మోదీ గారు: చాలా ధన్యవాదాలు డాక్టర్ నావీద్ గారూ.. మీకు పవిత్ర రంజాన్ నెల శుభాకాంక్షలు.
డాక్టర్ నావీద్ – చాలా చాలా ధన్యవాదాలు సార్.
మోదీ గారు: మిత్రులారా! ఈ కరోనా సంక్షోభ సమయంలో టీకా ప్రాముఖ్యత అందరికీ తెలుసు. అందువల్ల టీకా గురించి ఎటువంటి పుకార్లనూ నమ్మవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఉచిత వ్యాక్సిన్‌ను భారత ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. 45 ఏళ్లు పైబడిన వారు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. మే 1 నుండి దేశంలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు దేశంలోని కార్పొరేట్ రంగం, కంపెనీలు తమ ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసే ఉద్యమంలో పాల్గొంటాయి. భారత ప్రభుత్వం నుండి ఉచిత వ్యాక్సిన్ అందజేసే కార్యక్రమం ఇకపై కూడా కొనసాగుతుంది. భారత ప్రభుత్వ ఈ ఉచిత వ్యాక్సిన్ ప్రయోజనాలను వీలైనంత ఎక్కువ మందికి విస్తరించాలని నేను రాష్ట్రాలను కోరుతున్నాను.
మిత్రులారా! అనారోగ్యంలో ఉన్న మనల్ని, మన కుటుంబాలను చూసుకోవడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. మన ఆసుపత్రుల నర్సింగ్ సిబ్బంది ఒకేసారి చాలా మంది రోగులకు సేవ చేస్తారు. ఈ సేవ మన సమాజానికి గొప్ప బలం. నర్సింగ్ సిబ్బంది కృషి గురించి చెప్పగలిగే వారు నర్సులు. అందుకే రాయ్‌పూర్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో తన సేవలను అందిస్తున్న సిస్టర్ భావనా ధ్రువ్ గారిని ‘మన్ కి బాత్‘ కు ఆహ్వానించాం. ఆమె చాలా మంది కరోనా రోగులను చూసుకుంటోంది. రండి! ఆమెతో మాట్లాడదాం.
మోదీ గారు: నమస్కారం భావన గారూ!
భావన: – గౌరవనీయ ప్రధానమంత్రి గారూ.. నమస్కారం!
మోదీ గారు: భావన గారూ..
భావన: సార్..
మోదీ గారు: ‘మన్ కీ బాత్‘ వినే వారికి మీరు తప్పక చెప్పాలి. మీ కుటుంబంలో మీకు చాలా బాధ్యతలు ఉన్నాయని. ఎన్నో పనులున్నాయని. అయినా మీరు కరోనా రోగుల కోసం పని చేస్తున్నారు. కరోనా రోగులతో మీ అనుభవలను వినాలని దేశవాసులు ఖచ్చితంగా కోరుకుంటారు. ఎందుకంటే రోగికి దగ్గరగా, ఎక్కువ కాలం ఉండేవారు నర్సులే. అందువల్ల వారు ప్రతి విషయాన్నీ చాలా దగ్గరగా అర్థం చేసుకోగలరు.
భావన: సార్.. COVID లో నా మొత్తం అనుభవం 2 నెలలు సార్. మేము 14 రోజుల డ్యూటీ చేస్తాం. 14 రోజుల తరువాత మాకు విశ్రాంతి లభిస్తుంది. 2 నెలల తరువాత మా COVID విధులు రిపీట్ అవుతాయి సార్. నేను మొదటి సారి COVID డ్యూటీ చేసినప్పుడు ఈ విషయాన్ని నా కుటుంబ సభ్యులతో పంచుకున్నాను. ఇది మే లో జరిగిన విషయం. నేను ఈ విషయాన్ని పంచుకున్న వెంటనే వారందరూ భయపడ్డారు. నేనంటే భయపడ్డారు. సరిగ్గా పని చేయమని నాకు చెప్పారు. అది ఒక భావోద్వేగ పరిస్థితి సార్. కోవిడ్ డ్యూటి చేసే సందర్భంలో నా కుమార్తె నన్ను అడిగింది “అమ్మా! కోవిడ్ డ్యూటీకి వెళుతున్నారా” అని. అది నాకు చాలా భావోద్వేగ క్షణం. కానీ నేను కోవిడ్ రోగి వద్దకు వెళ్ళినప్పుడు నేను ఇంటి బాధ్యతలను విడిచిపెట్టాను. నేను కోవిడ్ రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను మరింత భయపడ్డాడు. రోగులందరూ కోవిడ్ అంటే చాలా భయపడ్డారు సార్. వారికి ఏం జరుగుతుందో, తర్వాత మనం ఏం చేస్తామో వారికి అర్థం కాలేదు. వారి భయాన్ని అధిగమించడానికి వారికి చాలా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇచ్చాం సార్. ఈ కోవిడ్ డ్యూటీ చేయమని అడిగినప్పుడు ముందుగా పిపిఇ కిట్ వేసుకొమ్మని చెప్పారు. ఇది చాలా కష్టం సార్. పిపిఇ కిట్ వేసుకుని డ్యూటీ చేయడం చాలా కష్టం. ఇది మాకు చాలా కఠినమైన పని. నేను 2 నెలల పాటు 14-14 రోజులు వార్డులో, ఐసియులో, ఐసోలేషన్‌లో ఉన్నా సార్.
మోదీ గారు: అంటే, మీరు ఒక సంవత్సరం నుండి ఈ పని చేస్తున్నారు.
భావన: అవును సార్. అక్కడికి వెళ్ళే ముందు నా సహోద్యోగులు ఎవరో నాకు తెలియదు. మేము ఒక జట్టు సభ్యులలా వ్యవహరించాం సార్. వారికి ఉన్న సమస్యల గురించి వివరించాం. వారి భయాన్ని తొలగించాం. సార్.. కోవిడ్ అంటేనే భయపడే చాలా మంది ఉన్నారు. మేం వారి నుండి క్లినికల్ హిస్టరీని తీసుకునేటప్పుడు ఆ లక్షణాలన్నీ వాటిలో వస్తాయి. కానీ భయం కారణంగా వారు ఆ పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధంగా లేరు. మేము వారికి వివరించే వాళ్ళం సార్. తీవ్రత పెరిగినప్పుడు అప్పటికే వారి ఊపిరితిత్తులలోకి ఇన్ఫెక్షన్ వచ్చేది. అప్పుడు వారికి ఐ. సి. యు. అవసరం ఏర్పడేది. అప్పుడు అతను వచ్చేవాడు. అతని కుటుంబ సభ్యులందరితో కలిసి వస్తాడు. మేము అలాంటి 1-2 కేసులను చూశాం సార్. మేము ప్రతి వయస్సు వారితో కలిసి పనిచేశాం సార్. వారిలో చిన్న పిల్లలు, మహిళలు, పురుషులు, వృద్ధులు ఉన్నారు. అన్ని రకాల రోగులు ఉన్నారు. మేము వారందరితో మాట్లాడినప్పుడు భయం వల్ల రాలేదని చెప్పేవారు. అందరి నుండి ఇదే సమాధానం వచ్చింది సార్. భయపడటానికి ఏమీ లేదని వారికి వివరించాం సార్. మీరు మాకు సహకరిస్తే మేము మీకు సహకరిస్తామని చెప్పేవాళ్ళం సార్. పద్ధతులను పాటించండని చెప్పేవాళ్ళం.
మోదీ గారు: భావన గారూ.. మీతో మాట్లాడటం నాకు బాగా నచ్చింది. మీరు చాలా మంచి సమాచారం ఇచ్చారు. ఇది మన స్వంత అనుభవం నుండి వచ్చిన సమాచారం. ఇది ఖచ్చితంగా దేశవాసులకు సానుకూల సందేశాన్ని పంపుతుంది. చాలా ధన్యవాదాలు భావన గారూ!
భావన: చాలా చాలా ధన్యవాదాలు సార్. థాంక్యూ సో మచ్… జై హింద్ సార్..
మోదీ గారు: జై హింద్!
భావన గారిలాంటి నర్సింగ్ స్టాఫ్ లక్షలాది మంది సోదరులు, సోదరీమణులు తమ విధులను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇది మనందరికీ పెద్ద ప్రేరణ. మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి.
మిత్రులారా! బెంగుళూరు నుండి సిస్టర్ సురేఖ గారు కూడా ఈ సమయంలో మనతో ఉన్నారు. సురేఖ గారు కె.సి. జనరల్ హాస్పిటల్లో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ గా ఉన్నారు. రండి! ఆమె అనుభవాలు కూడా తెలుసుకుందాం
మోదీ గారు: నమస్తే సురేఖ గారూ!
సురేఖ: – మన దేశ ప్రధానితో మాట్లాడటం నాకు నిజంగా గర్వంగా, గౌరవంగా ఉంది సార్.
మోదీ గారు: సురేఖ గారూ.. మీతో పాటు తోటి నర్సులు, హాస్పిటల్ సిబ్బంది అందరూ అద్భుతమైన పని చేస్తున్నారు. మీ అందరికీ భారతదేశం కృతజ్ఞతలు తెలియజేస్తోంది. COVID-19 కు వ్యతిరేకంగా ఈ పోరాటంలో ప్రజలకు మీ సందేశం ఏమిటి?
సురేఖ: – అవును సార్. బాధ్యతాయుతమైన పౌరురాలిగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. దయచేసి మీ పొరుగువారితో వినయంగా ఉండండి. ముందస్తు పరీక్షలు, సరైన ట్రాకింగ్ మరణాల రేటును తగ్గించడానికి మనకు సహాయపడతాయి. అంతేకాకుండా ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్ లో ఉండండి. సమీపంలోని వైద్యులను సంప్రదించి, వీలైనంత త్వరగా చికిత్స పొందండి. సమాజం ఈ వ్యాధి గురించి తెలుసుకోవాలి. సానుకూలంగా ఉండాలి. భయాందోళనలకు గురిచేస్తే రోగి పరిస్థితి దిగజారుతుందని తెలుసుకోవాలి. మన ప్రభుత్వానికి చాలా కృతజ్ఞులం. టీకా కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఇప్పటికే టీకా తీసుకున్నాను. నా స్వీయ అనుభవంతో నేను భారత పౌరులకు చెప్పాలనుకుంటున్నాను- ఏ వ్యాక్సిన్ కూడా వెంటనే 100% రక్షణను అందించదు. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సమయం పడుతుంది. టీకా తీసుకోవడానికి భయపడకండి. దయచేసి టీకా తీసుకోండి. దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంట్లో ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. అనారోగ్యంగా ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి. అనవసరంగా ముక్కు, కళ్ళు, నోటిని తాకకుండా ఉండండి. దయచేసి భౌతిక దూరం పాటించండి. మాస్క్ సరిగ్గా వేసుకోండి. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోండి. మీరు ఇంట్లోనే చేసుకోగల నివారణలు పాటించండి. దయచేసి ఆయుర్వేద కషాయాలను తాగండి. ప్రతిరోజూ ఆవిరి పీల్చడం, పుక్కిలించడం చేయండి. శ్వాస వ్యాయామం కూడా మీరు చేయవచ్చు. ఇంకొక విషయం- ఫ్రంట్‌లైన్ కార్మికులు, నిపుణుల పట్ల సానుభూతితో ఉండండి. మాకు మీ సహకారం అవసరం. మనందరం కలిసి పోరాడుదాం. కరోనా మహమ్మారి నుండి తప్పక బయటపడతాం. ప్రజలకు నా సందేశం ఇదే సార్.
మోదీ గారు: ధన్యవాదాలు సురేఖ గారూ.
సురేఖ: – ధన్యవాదాలు సార్.
మోదీ గారు: సురేఖ గారూ.. నిజానికి, మీరు చాలా కష్టమైన కాలాన్ని ఎదుర్కొంటున్నారు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి! మీ కుటుంబానికి కూడా చాలా చాలా శుభాకాంక్షలు. భావన గారు, సురేఖ గారు తమ అనుభవాల నుండి చెప్పినట్లు నేను దేశ ప్రజలను కూడా కోరుతున్నాను. కరోనాతో పోరాడటానికి పాజిటివ్ స్పిరిట్ చాలా ముఖ్యం. దేశవాసులు సానుకూల దృక్పథంతో ఉండాలి.
మిత్రులారా! వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో పాటు ల్యాబ్-టెక్నీషియన్లు ,అంబులెన్స్ డ్రైవర్లు వంటి ఫ్రంట్‌లైన్ కార్మికులు కూడా దేవునిలాగే పనిచేస్తున్నారు. రోగిని అంబులెన్స్ చేరుకున్నప్పుడు వారు అంబులెన్స్ డ్రైవర్ ను దేవదూతలా భావిస్తారు. ఈ సేవల గురించి, వారి అనుభవం గురించి దేశం తెలుసుకోవాలి. ప్రస్తుతం మనతో పాటు అలాంటి ఒక మంచి వ్యక్తి ఉన్నారు. ఆయనే ప్రేమ్ వర్మ గారు. ఆయన ఒక అంబులెన్స్ డ్రైవర్. ఆయన పేరు సూచించినట్లు ఆయన చాలా మంచివారు. ప్రేమ్ వర్మ గారు తన పనిని, కర్తవ్యాన్ని పూర్తి ప్రేమతో, అంకితభావంతో చేస్తారు. రండి ఆయనతో మాట్లాడుదాం..
మోదీ గారు: నమస్తే ప్రేమ్ గారూ!
ప్రేమ్ గారు: నమస్తే సార్..
మోదీ గారు: సోదరా!
ప్రేమ్ గారు: సార్
మోదీ గారు: మీ పని గురించి వివరంగా చెప్పండి. మీ అనుభవాలను కూడా మాకు చెప్పండి.
ప్రేమ్ గారు: నేను క్యాట్స్ అంబులెన్స్‌లో డ్రైవర్ గా పనిచేస్తున్నాను. కంట్రోల్ నుండి మాకు టాబ్లో కాల్ వస్తుంది. 102 నుండి కాల్ వచ్చినవెంటనే మేం రోగి దగ్గరికి వెళ్తాం. రెండు సంవత్సరాలుగా మేము ఈ పని చేస్తున్నాం. మా కిట్ వేసుకుని, చేతి తొడుగులు, మాస్కులు ధరించి, వారు ఎక్కడ డ్రాప్ చేయమని అడిగినా, ఏ ఆసుపత్రిలోనైనా, మేము వీలైనంత త్వరగా వారిని అక్కడికి చేరుస్తాం.
మోదీ గారు: మీకు ఇప్పటికే రెండు వ్యాక్సిన్ డోసులు అంది ఉండాలి కదా…
ప్రేమ్ గారు: ఖచ్చితంగా సార్.
మోదీ గారు: ఇప్పుడు ఇతర వ్యక్తులకు వ్యాక్సిన్ ఇవ్వండి. దీనిపై మీ సందేశం చెప్పండి
ప్రేమ్ గారు: సార్. తప్పకుండా చెప్తాను. ప్రతి ఒక్కరూ ఈ టీకా డోసు తీసుకోవాలి. ఇది కుటుంబానికి కూడా మంచిది. ఈ ఉద్యోగం మానేయమని ఇప్పుడు మా అమ్మ చెప్తోంది. నేను కూడా ఉద్యోగాన్ని వదిలి కూర్చుంటే, రోగులందరినీ వదిలివేసేందుకు ఎవరు వెళ్తారని నేను మా అమ్మను ప్రశ్నించాను. ఎందుకంటే ఈ కరోనా కాలంలో అందరూ పారిపోతున్నారు. అందరూ ఉద్యోగం మానేస్తున్నారు. ఆ ఉద్యోగాన్ని వదిలివేయాలని మా అమ్మ కూడా నాకు చెబుతుంది. “నేను ఉద్యోగాన్ని వదిలిపెట్టను” అని మా అమ్మతో చెప్పాను.
మోదీ గారు: మీ అమ్మను ఏడిపించవద్దు. ఆమెను ఒప్పించండి.
ప్రేమ్ గారు: సరే సార్.
మోదీ గారు: కానీ మీరు మీ అమ్మ గురించి చెప్పిన విషయం
ప్రేమ్ గారు: సార్.
మోదీ గారు: ఈ విషయం మనసుకు చాలా హత్తుకుంటుంది.
ప్రేమ్ గారు: అవును సార్
మోదీ గారు: మీ అమ్మ గారికి కూడా
ప్రేమ్ గారు: సార్
మోదీ గారు: నా నమస్కారం తెలియజేయండి.
ప్రేమ్ గారు: తప్పకుండా సార్
మోదీ గారు: అవును
ప్రేమ్ గారు: సార్
మోదీ గారు: మీ ద్వారా ప్రేమ్ గారూ..
ప్రేమ్ గారు: సార్
మోదీ గారు: అంబులెన్స్‌లను నడుపుతున్న మన డ్రైవర్లు కూడా
ప్రేమ్ గారు: సార్
మోదీ గారు: ఎంత రిస్క్ తీసుకుంటున్నారు?
ప్రేమ్ గారు: అవును సార్
మోదీ గారు: వీరిలో ప్రతి ఒక్కరి అమ్మ ఏం ఆలోచిస్తుంది?
ప్రేమ్ గారు: సార్
మోదీ గారు: ఈ విషయం శ్రోతలను చేరినప్పుడు..
ప్రేమ్ గారు: సార్
మోదీ గారు: వారి హృదయాన్ని కూడా తాకుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.
ప్రేమ్ గారు: అవును సార్
మోదీ గారు: చాలా చాలా ధన్యవాదాలు ప్రేమ్ గారు. మీరు ఒక విధంగా ప్రేమ పూర్వక గంగానదిని ప్రవహింపజేస్తున్నారు.
ప్రేమ్ గారు: ధన్యవాదాలు సార్
మోదీ గారు: ధన్యవాదాలు సోదరా!
ప్రేమ్ గారు: ధన్యవాదాలు.
మిత్రులారా! ప్రేమ్ వర్మ గారిలాంటి వేలాది మంది ప్రజలు ఈ రోజు తమ జీవితాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు. కరోనాకు వ్యతిరేకంగా ఈ పోరాటంలో ఎన్నో జీవితాల రక్షణలో అంబులెన్స్ డ్రైవర్లు కూడా చాలా సహకరించారు. ప్రేమ్గారూ.. మీకు, దేశవ్యాప్తంగా మీ సహోద్యోగులందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మీరు సమయాన్ని చేరుకుంటూ ఉండండి. జీవితాలను కాపాడుతూ ఉండండి.
నా ప్రియమైన దేశవాసులారా! చాలా మంది ప్రజలు కరోనా బారిన పడుతున్నారన్నది నిజం. కానీ కరోనా నుండి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అంతే ఎక్కువగా ఉంది. గురుగ్రామ్‌కు చెందిన ప్రీతి చతుర్వేది గారు కూడా ఇటీవల కరోనాను ఓడించారు. ప్రీతి గారు ఈరోజు ‘మన్ కి బాత్‘ లో మనతో మాట్లాడతారు. వారి అనుభవాలు మనందరికీ ఉపయోగపడతాయి.
మోదీ గారు: ప్రీతి గారూ.. నమస్కారం..
ప్రీతి – నమస్తే సార్! మీరెలా ఉన్నారు?
మోదీ గారు: నేను బాగున్నాను సార్. ముందుగా కోవిడ్ –19 పై విజయవంతంగా పోరాడిన మిమ్మల్ని..
ప్రీతి గారు: సార్..
మోదీ గారు: నేను అభినందిస్తున్నాను
ప్రీతి గారు: చాలా ధన్యవాదాలు సార్
మోదీ గారు: మీరు మరింత త్వరగా పూర్తి ఆరోగ్యం పొందాలని కోరుకుంటున్నాను.
ప్రీతి గారు: ధన్యవాదాలు సార్
మోదీ గారు: ప్రీతి గారూ..
ప్రీతి గారు: సార్
మోదీ గారు: మీ మొత్తం కుటుంబంలో మీ ఒక్కరికే కరోనా వచ్చిందా? లేక కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా ఇందులో చిక్కుకున్నారా?
ప్రీతి – లేదు.. లేదు సార్.. నా ఒక్కదానికే వచ్చింది.
మోదీ గారు: భగవంతుడి కృప ఉంది.
ప్రీతి గారు: సార్
మోదీ గారు: మీ వేదనాభరిత పరిస్థితిలోని కొన్ని అనుభవాలను మీరు పంచుకుంటే.. శ్రోతలకు కూడా అలాంటి సమయంలో ఎలా ఉండాలనే విషయంలో మార్గదర్శకత్వం లభిస్తుంది.
ప్రీతి గారు: సార్.. తప్పకుండా.. ప్రారంభ దశలో నాకు చాలా బద్ధకం వచ్చింది. నీరసంగా ఉన్నా. ఆ తరువాత కొంచెం గొంతు నొప్పి వచ్చింది. కాబట్టి ఆ తరువాత ఈ లక్షణాలున్నాయి కాబట్టి పరీక్ష చేయించుకున్నా. రెండవ రోజు రిపోర్ట్ వచ్చిన వెంటనే నాకు పాజిటివ్ అం తెలిసింది. వెంటనే నన్ను నేను క్వారంటైన్ చేసుకున్నాను. ఒక గదిలో వేరుగా ఉంటూ వైద్యులతో సంప్రదించాను. వారి సలహా ప్రకారం మందులు ప్రారంభించాను.
మోదీ గారు: కాబట్టి మీరు త్వరగా తీసుకున్న చర్య వల్ల మీ కుటుంబం బయటపడింది.
ప్రీతి గారు: సార్. మా కుటుంబంలో మిగతా వారిని కూడా తరువాత పరీక్షించారు. మిగతా అందరూ నెగెటివ్‌గా ఉన్నారు. నేను పాజిటివ్‌గా ఉన్నాను. అంతకు ముందు నేను ఒక గది లోపల ఐసోలేషన్ లో ఉన్నాను. నాకు అవసరమైన అన్ని వస్తువులను ఉంచిన తరువాత గదిలోనే ఉండిపోయాను. నేను డాక్టర్ సలహాతో మందులు ప్రారంభించాను. సార్.. మందులతో పాటు నేను యోగా, ఆయుర్వేదం మొదలుపెట్టాను. ఇవన్నీ ప్రారంభించాను. నేను కషాయాలను కూడా తీసుకోవడం ప్రారంభించాను. రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నాను. నేను తీసుకున్నాను. నేను ద్రవాలు ఎక్కువగా తీసుకున్నాను. నీటి ఆవిరి తీసుకున్నాను. వేడి నీటిని తీసుకున్నాను. నేను రోజంతా ఇవే తీసుకుంటూ ఉన్నాను. సార్.. ఈ విషయంలో భయపడటానికి ఎటువంటి కారణం లేదు. మానసికంగా దృఢంగా ఉండాలి. దీని కోసం నేను చాలా యోగా, శ్వాస వ్యాయామం చేసేదాన్ని. అలా చేయడం వల్ల ఆరోగ్యం బాగా అనిపించేది.
మోదీ గారు: అవును. మీరు చేసిన ప్రక్రియలన్నీ పూర్తయినప్పుడు మీరు ఇబ్బందుల నుండి బయటకు వచ్చారు.
ప్రీతి గారు: అవును సార్
మోదీ గారు: ఇప్పుడు మీ టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది.
ప్రీతి గారు: అవును సార్
మోదీ గారు: మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడానికి మీరు ప్రస్తుతం ఏమి చేస్తున్నారు?
ప్రీతి గారు: సార్.. నేను యోగా ఆపలేదు.
మోదీ గారు: అవునా..
ప్రీతి గారు: అవును సార్. నేను ఇంకా కషాయాలను తీసుకుంటున్నాను. నా రోగనిరోధక శక్తిని పెంచడానికి నేను ప్రస్తుతం మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నాను.
మోదీ గారు: ఓహ్.. .
ప్రీతి గారు: నేను చాలా నిర్లక్ష్యం చేసిన దానిపై నేను చాలా శ్రద్ధ చూపుతున్నాను.
మోదీ గారు: ధన్యవాదాలు ప్రీతి గారూ..
ప్రీతి గారు: చాలా ధన్యవాదాలు సార్.
మోదీ గారు: మీరు నాకు ఇచ్చిన సమాచారం చాలా మందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా ఉండండి. మీ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉండాలి. నేను మీకు చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు మన వైద్య రంగంలోని వారు, ఫ్రంట్‌లైన్ కార్మికులు రోజువారీ సేవా పనిలో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా, సమాజంలోని ఇతర వ్యక్తులు కూడా ఈ సమయంలో వెనుకబడి లేరు. దేశం మరోసారి ఐక్యమై కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ రోజుల్లో క్వారం టైన్ లో ఉన్న కుటుంబాలకు కొందరు మందులు పంపిణీ చేస్తున్నారని, కొందరు కూరగాయలు, పాలు, పండ్లు మొదలైనవి పంపుతున్నారని నేను చూశాను. రోగులకు కొందరు అంబులెన్స్ ఉచిత సేవలను అందిస్తున్నారు. ఈ సవాలు సమయంలో కూడా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈసారి గ్రామాల్లో కూడా కొత్త అవగాహన కనిపిస్తోంది. కోవిడ్ నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రజలు తమ గ్రామాన్ని కరోనా నుండి కాపాడుతున్నారు. బయటి నుండి వస్తున్న వారికి సరైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. తమ ప్రాంతంలో కరోనా కేసులు పెరగకుండా ఉండటానికి నగరాలలో కూడా స్థానిక ప్రజలతో కలిసి పనిచేయడానికి చాలా మంది యువకులు ముందుకు వచ్చారు. అంటే ఒకవైపు దేశం రాత్రింబగళ్లు ఆసుపత్రులు, వెంటిలేటర్లు, మందుల కోసం పరని చేస్తుంటే మరోవైపు దేశవసూలు కూడా కరోనా సవాలుతో ఇష్టపూర్వకంగా పోరాడుతున్నారు. ఈ భావన మనకు చాలా బలాన్ని, చాలా విశ్వాసాన్ని ఇస్తుంది. ఏ ప్రయత్నాలు చేసినా ఇది సమాజానికి గొప్ప సేవ. అవి సమాజ శక్తిని పెంచుతాయి.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు మనం ‘మన్ కి బాత్‘ మొత్తం చర్చను కరోనా మహమ్మారిపై చేశాం. ఎందుకంటే ఈ రోజు ఈ వ్యాధిని ఓడించడమే మన పెద్ద ప్రాధాన్యత. ఈ రోజు భగవాన్ మహావీర్ జయంతి. ఈ సందర్భంగా దేశవాసులందరినీ అభినందిస్తున్నాను. మహావీరుడి సందేశం మనకు స్వీయ నిగ్రహం విషయంలో స్ఫూర్తినిస్తుంది. ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం కూడా జరుగుతోంది. బుద్ధ పూర్ణిమ కూడా త్వరలో ఉంది. గురు తేజ్ బహదూర్ 400 వ ప్రకాశ పర్వం కూడా ఉంది. ఒక ముఖ్యమైన రోజు ఠాగూర్ జయంతి. ఇవన్నీ మన విధులను నిర్వర్తించడానికి ప్రేరేపిస్తాయి. పౌరులుగా మన జీవితంలో సాధ్యమైనంత సమర్థవంతంగా మన విధులను నిర్వర్తిస్తాం. సంక్షోభం నుండి బయటపడిన తరువాత మనం భవిష్యత్ మార్గంలో మరింత వేగంగా వెళ్తాం. ఈ కోరికతో మీ అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని నేను మరోసారి కోరుతున్నాను. మనం పూర్తి జాగ్రత్తగా ఉండాలి. ‘మందులు కూడా – కఠిన నియమాలు కూడా‘. ఈ మంత్రాన్ని ఎప్పటికీ మర్చిపోకండి. ఈ విపత్తు నుండి మనం త్వరలో బయటికి వస్తాం. ఈ నమ్మకంతో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం!
*****
PM @narendramodi speaks about the COVID-19 situation during #MannKiBaat. pic.twitter.com/VjTl2kL7Gi
— PMO India (@PMOIndia) April 25, 2021
Tune in to #MannKiBaat April 2021. https://t.co/ti5rqBhiWH
— Narendra Modi (@narendramodi) April 25, 2021
In order to fight COVID-19, important to go by the views of experts. #MannKiBaat pic.twitter.com/bltOHEfXCZ
— PMO India (@PMOIndia) April 25, 2021
In the prevailing situation, it is commendable that many doctors are using technology to offer online consultations to patients. #MannKiBaat pic.twitter.com/fFGUujFMOo
— PMO India (@PMOIndia) April 25, 2021
During #MannKiBaat, PM @narendramodi speaks to Dr. Shashank Joshi from Mumbai about the COVID-19 situation. https://t.co/H4lBgpIOfu
— PMO India (@PMOIndia) April 25, 2021
Dr. Naveed Nazir Shah from Srinagar is discussing different aspects of fighting COVID-19 during #MannKiBaat programme with PM @narendramodi. https://t.co/H4lBgpIOfu
— PMO India (@PMOIndia) April 25, 2021
PM @narendramodi speaks about the vaccination drive across the nation. #MannKiBaat pic.twitter.com/XqtHGiJXzl
— PMO India (@PMOIndia) April 25, 2021
Sister Bhavana from Raipur shares her contribution (and the important efforts of nurses) in strengthening the fight against COVID-19. https://t.co/H4lBgpIOfu
— PMO India (@PMOIndia) April 25, 2021
Sister Surekha shares her perspective on vaccination, keeping a positive spirit and following COVID protocols. #MannKiBaat https://t.co/H4lBgpIOfu
— PMO India (@PMOIndia) April 25, 2021
India's fight against COVID-19 would be incomplete without the effort of the ambulance drivers, lab technicians and other such individuals.
— PMO India (@PMOIndia) April 25, 2021
Do hear what Prem Verma Ji, who drives an ambulance has to say...
#MannKiBaat https://t.co/H4lBgpIOfu
I would like to commend all those individuals and organisations who are helping others in defeating COVID-19. #MannKiBaat pic.twitter.com/Ct5nNvCdJw
— PMO India (@PMOIndia) April 25, 2021
‘दवाई भी - कड़ाई भी’ #MannKiBaat pic.twitter.com/6HLi6AymiX
— PMO India (@PMOIndia) April 25, 2021