Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యుకె ప్రధానితో టెలిఫోన్ లో ప్రధాన మంత్రి సంభాషించారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని థెరెసా మే తో మంగళవారం టెలిఫోన్ లో మాట్లాడారు. థెరెసా మే నూతన పదవీబాధ్యతలను స్వీకరించిన సందర్భంగా ఆమెను ప్రధాన మంత్రి అభినందించారు.

గత నవంబరు లో తన యు కె పర్యటనను ప్రధాన మంత్రి శ్రీ మోదీ జ్ఞ‌ప్తికి తెచ్చుకొన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచుకోవడానికి భారతదేశం కట్టుబడి ఉందని ఆయన స్పష్టంచేశారు. వేరు వేరు అంతర్జాతీయ వేదికలపైన భారతదేశాన్ని యు కె నిలకడగా సమర్థిస్తూ వస్తోందంటూ ప్రధాన మంత్రి మెచ్చుకోలు వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రికి యు కె ప్రధాని థెరెసా మే ధన్యవాదాలు తెలిపారు. దృఢమైన ద్వైపాక్షిక సంబంధాలను నిర్మించుకోవడానికి, అత్యవసర అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి ప్రధాన మంత్రితో కలసి పనిచేయడం కోసం తాను ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు.