Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌హాత్మా జ్యోతిబా ఫూలె జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళుల‌ర్పించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ


గొప్ప సాంఘిక సంస్క‌ర్త‌, ఆలోచ‌నాప‌రుడు, తాత్విక‌వేత్త‌, ర‌చ‌యిత మ‌హాత్మా జ్యోతి బా ఫూలే జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.

జ్యోతిబా ఫూలే మ‌హిళ‌ల విద్య‌కు వారి సాధికార‌త‌కు క‌ట్టుబ‌డి జీవితాంతం విశేష‌కృషి చేశార‌ని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ కొనియాడారు.
సాంఘిక‌సంస్క‌ర‌ణ‌ల ప‌ట్ల ఆయ‌న అంకిత‌భావం రాబోయే త‌రాల‌కు ఒక స్ఫూర్తిగా ఉంటుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

***