శ్రీమద్ భగవద్గీత లోని శ్లోకాల కు 21 మంది పండితులు చేసిన వ్యాఖ్యానాలతో కూడిన లిఖిత ప్రతి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో జమ్ము- కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా తో పాటు ధర్మార్థ ట్రస్టు జమ్ము- కశ్మీర్ అధ్యక్షుడు డాక్టర్ కరణ్ సింహ్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భం లో భారత తత్త్వశాస్త్రం పై డాక్టర్ కరణ్ సింహ్ చేసిన పనులను ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు. డాక్టర్ కరణ్ సింహ్ కృషి ఫలితం గా జమ్ము- కశ్మీర్ తాలూకు గుర్తింపు ను పునర్జీవింపచేయడం సాధ్యపడిందని, అది శతాబ్దాలుగా సాగుతున్న భారతదేశ ఆలోచన సంప్రదాయానికి నాయకత్వం వహించిందని ఆయన అన్నారు. గీతను గురించి వేల కొద్దీ పండితులు లోతైన అధ్యయనం చేయడం కోసం వారి యావత్తు జీవనాన్నే అంకితం చేశారని, దీనిని ఒక గ్రంథం లోని ప్రతి ఒక్క శ్లోకం పైన విభిన్నమైన వ్యాఖ్యలతో కూడిన విశ్లేషణ, వివిధ రహస్యాల అభివ్యక్తి ల రూపం లపో స్పష్టం గా చూడవచ్చని ఆయన అన్నారు. ఇది భారతదేశ సైద్ధాంతిక స్వతంత్రం, సహనాలకు కూడా ప్రతీక గా ఉందని, ఇది ప్రతి ఒక్క వ్యక్తి కి తనదైనటువంటి దృష్టికోణం కలిగివుండేటట్టు స్ఫూర్తిని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
భారతదేశాన్ని ఒక్క తాటి మీదకు తీసుకు వచ్చిన ఆది శంకరాచార్యులు గీత ను ఆధ్యాత్మిక చైతన్య వాహిని గా పరిగణించారు అని ప్రధాన మంత్రి అన్నారు. రామానుజాచార్య వంటి సాధువులు ఆధ్యాత్మిక జ్ఞాన వ్యక్తీకరణ గా గీత ను అభివర్ణించారు. స్వామి వివేకానంద విషయం లో ఆయనకయితే గీత కఠోర పరిశ్రమ కు, తిరుగులేనటువంటి ఆత్మవిశ్వాసానికి వనరు గా ఉండిందని ప్రధాన మంత్రి చెప్పారు. శ్రీ అరబిందో గీత ను జ్ఞానం, మానవతల నిజ అవతారం గా ఎంచారు; గీత అనేది మహాత్మ గాంధీ కి అన్నిటికన్న కష్టమైనటువంటి సమయాలలో ప్రకాశస్తంభం గా నిలచిందన్నారు. గీత నేతాజీ సుభాష్ చంద్ర బోస్ దేశభక్తి కి, వీరత్వానికి ప్రేరణ అయిందన్నారు. గీత ను గురించి బాల గంగాధర్ తిలక్ చేసిన వ్యాఖ్య స్వాతంత్య్ర సంగ్రామానికి ఒక కొత్త బలాన్ని ఇచ్చిందని స్పష్టం చేశారు.
మన ప్రజాస్వామ్యం మనకు ఆలోచనపరమైనటువంటి స్వేచ్ఛ ను, పని పరం గా స్వేచ్ఛ ను, జీవనం లో ప్రతి ఒక్క రంగం లో సమాన హక్కులను ఇస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ స్వేచ్ఛ ప్రజాస్వామ్య సంస్థ ల నుంచి దక్కింది, ఆ సంస్థ లు మన రాజ్యాంగానికి సంరక్షకులు గా ఉన్నాయి అని ఆయన అన్నారు. ఈ కారణం గా మనం మన హక్కులను గురించిన ప్రస్తావన ను తీసుకు వచ్చినప్పుడల్లా మనం మన ప్రజాస్వామ్య సంబంధి కర్తవ్యాలను కూడా గుర్తు కు తెచ్చుకోవాలని ఆయన అన్నారు.
గీత మొత్తం ప్రపంచానికి, ప్రతి ప్రాణి కి ఒక మహత్వపూర్ణమైనటువంటి గ్రంథం అని ప్రధాన మంత్రి అన్నారు. దీనిని భారతదేశం లో అనేక భాషల లోకి, ప్రపంచంలో అనేక భాషల లోకి అనువాదం చేయడం జరిగిందని, అనేక దేశాలలో అనేక అంతర్జాతీయ పండితులు దీనిని గురించి పరిశోధనలు చేస్తున్నారని చెప్పారు.
జ్ఞానాన్ని పంచుకోవడం భారతదేశం సంస్కృతి లో భాగంగా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. గణితం, వస్త్ర- లోహవిజ్ఞానం లేదా ఆయుర్వేదం లో మన జ్ఞానాన్ని సదా మానవ జాతి తాలూకు సంపద గా భావన చేయడం జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ రోజున మరొక్క సారి, భారతదేశం యావత్తు ప్రపంచం తాలూకు ప్రగతి కి తోడ్పడడం తో పాటు మానవాళి కి సేవ చేయడానికి తన సామర్థ్యాన్ని పెంచుకొంటోందని ఆయన చెప్పారు. ఇటీవలి కాలం లో భారతదేశం సహకార స్ఫూర్తి ని ప్రపంచం ప్రత్యక్షం గా చూసిందని ఆయన అన్నారు. అలాగే ఆత్మనిర్భర్ భారత్ (లేదా స్వయంసమృద్ధియుత భారతదేశం) ను ఆవిష్కరించే దిశ లో జరుగుతున్న ప్రయాసలతో కూడిన ఈ తోడ్పాటు తో మొత్తం ప్రపంచానికి విస్తృత స్థాయి లో సహాయం అందుతుందని ఆయన స్పష్టం చేశారు.
***
Releasing Manuscript with commentaries by 21 scholars on Shlokas of the sacred Gita. https://t.co/aS6XeKvWuc
— Narendra Modi (@narendramodi) March 9, 2021
डॉ कर्ण सिंह जी ने भारतीय दर्शन के लिए जो काम किया है, जिस तरह अपना जीवन इस दिशा में समर्पित किया है, भारत के शिक्षा जगत पर उसका प्रकाश और प्रभाव स्पष्ट देखा जा सकता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 9, 2021
आपके इस प्रयास ने जम्मू कश्मीर की उस पहचान को भी पुनर्जीवित किया है, जिसने सदियों तक पूरे भारत की विचार परंपरा का नेतृत्व किया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 9, 2021
किसी एक ग्रंथ के हर श्लोक पर ये अलग-अलग व्याख्याएँ, इतने मनीषियों की अभिव्यक्ति, ये गीता की उस गहराई का प्रतीक है, जिस पर हजारों विद्वानों ने अपना पूरा जीवन दिया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 9, 2021
ये भारत की उस वैचारिक स्वतन्त्रता और सहिष्णुता का भी प्रतीक है, जो हर व्यक्ति को अपना दृष्टिकोण, अपने विचार रखने के लिए प्रेरित करती है: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 9, 2021
भारत को एकता के सूत्र में बांधने वाले आदि शंकराचार्य ने गीता को आध्यात्मिक चेतना के रूप में देखा।
— PMO India (@PMOIndia) March 9, 2021
गीता को रामानुजाचार्य जैसे संतों ने आध्यात्मिक ज्ञान की अभिव्यक्ति के रूप में सामने रखा।
स्वामी विवेकानंद के लिए गीता अटूट कर्मनिष्ठा और अदम्य आत्मविश्वास का स्रोत रही है: PM
गीता श्री अरबिंदो के लिए तो ज्ञान और मानवता की साक्षात अवतार थी।
— PMO India (@PMOIndia) March 9, 2021
गीता महात्मा गांधी की कठिन से कठिन समय में पथप्रदर्शक रही है: PM @narendramodi
गीता नेताजी सुभाषचंद्र बोस की राष्ट्रभक्ति और पराक्रम की प्रेरणा रही है।
— PMO India (@PMOIndia) March 9, 2021
ये गीता ही है जिसकी व्याख्या बाल गंगाधर तिलक ने की और आज़ादी की लड़ाई को नई ताकत दी: PM @narendramodi
हमारा लोकतन्त्र हमें हमारे विचारों की आज़ादी देता है, काम की आज़ादी देता है, अपने जीवन के हर क्षेत्र में समान अधिकार देता है।
— PMO India (@PMOIndia) March 9, 2021
हमें ये आज़ादी उन लोकतान्त्रिक संस्थाओं से मिलती है, जो हमारे संविधान की संरक्षक हैं: PM @narendramodi
इसलिए, जब भी हम अपने अधिकारों की बात करते हैं, तो हमें अपने लोकतान्त्रिक कर्तव्यों को भी याद रखना चाहिए: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 9, 2021
गीता तो एक ऐसा ग्रंथ है जो पूरे विश्व के लिए है, जीव मात्र के लिए है।
— PMO India (@PMOIndia) March 9, 2021
दुनिया की कितनी ही भाषाओं में इसका अनुवाद किया गया, कितने ही देशों में इस पर शोध किया जा रहा है, विश्व के कितने ही विद्वानों ने इसका सानिध्य लिया है: PM @narendramodi
आज एक बार फिर भारत अपने सामर्थ्य को संवार रहा है ताकि वो पूरे विश्व की प्रगति को गति दे सके, मानवता की और ज्यादा सेवा कर सके।
— PMO India (@PMOIndia) March 9, 2021
हाल के महीनों में दुनिया ने भारत के जिस योगदान को देखा है, आत्मनिर्भर भारत में वही योगदान और अधिक व्यापक रूप में दुनिया के काम आयेगा: PM