Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నైపుణ్యాభివృద్ధిలో సహకారం కోసం భారతదేశానికి, స్విస్ కాన్ఫెడరేషన్ కు మధ్య ఎమ్ ఒ యు పై సంతకాలకు మంత్రిమండలి ఆమోదం


నైపుణ్యాల అభివృద్ధిలో సహకారం కోసం భారతదేశానికి, స్విస్ కాన్ ఫెడరేషన్ కు చెందిన ది స్టేట్ సెక్రటేరియట్ ఫర్ ఎడ్యుకేషన్, రిసర్చ్ అండ్ ఇన్నోవేషన్ కు మధ్య సంతకాలు జరిగిన ఒక అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎమ్ ఒ యు కు) కేంద్ర మంత్రిమండలి ఎక్స్- పోస్ట్- ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు. నైపుణ్యాల అఅభివృద్ధి, నవ పారిశ్రామికులకు ప్రోత్సాహం శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) నాయకత్వంలో ఒక ప్రతినిధి వర్గం 2016 జూన్ 20-22 తేదీల మధ్య స్విట్జర్ లాండ్ సందర్శించిన సందర్భంలో 22.6.2016 న ఈ ఎమ్ ఒ యు పై సంతకాలు జరిగాయి.

ఈ ఎమ్ ఒ యు నైపుణ్యాల అభివృద్ధి రంగంలో అత్యుత్తమ అభ్యాసాల ఆదాన ప్రదానం, ఇంకా సామర్థ్యాల పెంపుదలపై స్థూలంగా శ్రద్ధ తీసుకొంటుంది. ఎమ్ ఒ యు యొక్క ఫ్రేమ్ వర్క్ ను రూపొందించడం, పర్యవేక్షించడం, మరియు సమీక్షించడం కోసం సంయుక్త కార్యాచరణ సంఘాన్ని (జె డబ్ల్యు జి) ఏర్పాటు చేయాలని ఎమ్ ఒ యు లో పేర్కొన్నారు. నైపుణ్యాల అభివృద్ధి రంగంలో ఇరు దేశాలకు మధ్య ద్వైపాక్షిక సహకారం కోసం ఒక ఫ్రేమ్ వర్క్ ను ఈ ఎమ్ ఒ యు సిద్ధం చేయడంతో పాటు ఈ భాగస్వామ్యాన్ని క్రమబద్ధం చేసి, పటిష్టపరచగలదు.