నా మంత్రిమండలి సహచరులు శ్రీ మన్సుఖ్ మాండవీయ, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు, విశిష్ట అతిథులుసహా…
ప్రియ మిత్రులారా!
సాగర భారత సదస్సు-2021కి మిమ్మల్నందర్నీ స్వాగతిస్తున్నాను. ఈ రంగంలోని అనేకమంది భాగస్వాములను ఈ సదస్సు ఒకచోటకు చేర్చింది. ఈ నేపథ్యంలో సాగర ఆర్థిక వ్యవస్థకు ఉత్తేఉమిచ్చే దిశగా మనం సమష్టి కృషితో గొప్ప విజయం సాధించగలమని నేను విశ్వసిస్తున్నాను.
మిత్రులారా!
ఈ రంగంలో భారత్ సహజంగానే అగ్రగామి. మా దేశానికి సుసంపన్న సముద్ర చరిత్ర ఉంది. మా తీరాల్లో అనేక నాగరికతలు వికసించాయి. వేల ఏళ్లుగా మా రేవులు ముఖ్యమైన వాణిజ్య కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. మా తీరాలు మొత్తం ప్రపంచంతో సంధానమై ఉన్నాయి.
మిత్రులారా!
మా ప్రగతి పయనంలో భాగస్వామ్యం కోసం భారత్ రావాల్సిందిగా ప్రపంచ దేశాలను ఈ సాగర భారత సదస్సు మూలకంగా ఆహ్వానిస్తున్నాను. సముద్ర రంగంలో ఎదిగే దిశగా భారత్ ఎంతో శ్రద్ధతో ముందుకు వెళ్తోంది. ఆ క్రమంలో అంతర్జాతీయ నీలి ఆర్థికవ్యవస్థగా ఆవిర్భావానికి ఉరకలు వేస్తోంది. మేం ప్రధానంగా దృష్టి సారించిన అంశాల్లో ప్రస్తుత మౌలిక సదుపాయాల ఉన్నతీకరణ మొట్టమొదటిది. ఇందులో భాగంగా భవిష్యత్తరం మౌలిక వసతుల సృష్టి… తద్వారా సంస్కరణలకు పయనానికి ఉత్తేజం కల్పించడానికి ప్రాధాన్యమిస్తున్నాం. మా స్వయం సమృద్ధ భారత స్వప్నాన్ని ఈ చర్యలతో మరింత బలోపేతం చేయడమే మా లక్ష్యం.
మిత్రులారా!
ప్రస్తుత మౌలిక సదుపాయాల ఉన్నతీకరణ విషయానికొస్తే- సామర్థ్యం మెరుగుకు నేను అత్యంత ప్రాధాన్యమిస్తాను. విడివిడిగా కాకుండా కలివిడిగా ఈ రంగం మొత్తం మీద దృష్టి సారించడమే మా విధానం. దీని ఫలితాలు కూడా ప్రస్ఫుటమవుతున్నాయి. మా ప్రధాన రేవుల వార్షిక సామర్థ్యం 2014లో సుమారు 870 మిలియన్ టన్నులు కాగా, ప్రస్తుత సంవత్సరం దాదాపు 1550 మిలియన్ టన్నులకు పెరిగింది. ఈ ఉత్పాదకత లబ్ధి మా రేవులకు తోడ్పడటం మాత్రమేగాక మా ఉత్పత్తులకు పోటీతత్వాన్నిచ్చి మొత్తం ఆర్థిక వ్యవస్థకే ఉత్తేజం కల్పించింది. నేడు భారత రేవుల సామర్థ్యం- నేరుగా రేవులకు చేరవేత, నేరుగా ప్రవేశం, సమాచార ప్రవాహ సౌలభ్యం దిశగా ఉన్నతీకరించబడిన రేవుల సమాచార వ్యవస్థలతో మరింత పరిపుష్టమైంది. మా రేవులలోకి సరకుల రాకపోకలలో వేచి ఉండాల్సిన సమయం తగ్గింది. రేవులలో నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు రేవుల తీర భూములవైపు పరిశ్రమలను ఆకర్షించగల తక్షణ వినియోగ మౌలిక వసతుల కల్పనపైనా మేం భారీ పెట్టుబడులు కూడా పెడుతున్నాం. సుస్థిర పూడికతీత, దేశీయ నౌకా పునరుపయోగ పరిశ్రమలద్వారా ‘వ్యర్థంనుంచి సంపద’ సృష్టికీ మా రేవులు తోడ్పడతాయి.
మిత్రులారా!
సామర్థ్యాన్ని పెంపుసహా అనుసంధానాన్ని ఇనుమడింపజేసే దిశగా ఎంతో కృషి సాగుతోంది. ఆ మేరకు తీరప్రాంత ఆర్థిక మండళ్లు, రేవు ఆధారిత అత్యాధునిక నగరాలు, పారిశ్రామిక పార్కులను మేము రేవులతో మమేకం చేస్తున్నాం. దీనివల్ల పారిశ్రామిక పెట్టుడులకు ఊతం లభించడమేగాక రేవుల వద్ద అంతర్జాతీయ తయారీ కార్యకలాపాలకు ప్రోత్సాహం లభిస్తుంది.
మిత్రులారా!
సరికొత్త మౌలిక వసతుల సృష్టికి సంబంధించి వాధవాన్, పరదీప్, కాండ్లాలోని దీన్‌దయాళ్ రేవు వంటి భారీ రేవులలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. అలాగే మునుపెన్నడూ లేని రీతిలో జలమార్గాల అభివృద్ధికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. సరుకుల రవాణాలో దేశీయ జలమార్గాలు చౌకైనవే కాకుండా పర్యావరణ హితమైనవి. ఆ మేరకు 2030నాటికి దేశంలో 23 జలమార్గాలు అందుబాటులోకి తేవాలని మేం సంకల్పించాం. మౌలిక వసతుల పెంపు, ప్రయాణానుకూల మార్గాభివృద్ధి, నౌకా గమన ఉపకరణాలు, నదుల సమాచార వ్యవస్థ సదుపాయ కల్పన తదితరాల ద్వారా మా సంకల్పాన్ని సాకారం చేయనున్నాం. దీంతోపాటు బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాలతో ప్రాంతీయ అనుసంధానానికి ఉద్దేశించిన తూర్పు జలమార్గ అనుసంధాన-రవాణా గ్రిడ్ వల్ల ప్రాంతీయ వాణిజ్యం, సహకారం ప్రభావశీలంగా బలోపేతం అవుతాయి.
మిత్రులారా!
జీవన సౌలభ్యాన్ని పెంచడంలో సముద్ర మౌలిక సదుపాయాలు గొప్ప ఉపకరణాలు. అలాగే నదుల సద్వినియోగంపై మా విధానంలో “రో-రో, రో-పాక్స్” వంటి ప్రాజెక్టులు కూడా గణనీయ పాత్ర పోషించగలవు. సముద్ర-విమాన కార్యకలాపాలకు వీలు కల్పించే జల-విమానాశ్రయాలను 16 ప్రదేశాల్లో సిద్ధం చేస్తున్నాం. అంతేగాక 5 జాతీయ జలమార్గాల్లో ప్రయాణిక ఓడల కేంద్ర మౌలిక వసతులు, జెట్టీలను నిర్మిస్తున్నాం.
మిత్రులారా !
జాతీయ, అంతర్జాతీయ ఓడ ప్రయాణ కూడళ్లను కూడా ఎంపిక చేసిన రేవులలో అభివృద్ధి చేయాలని మేం నిర్ణయించుకున్నాం. ఈ మేరకు 2023 నాటికి మౌలిక సదుపాయాల పెంపు, నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. భారత్‌లోని విశాల తీరప్రాంతంలో 189 వరకూ దీపస్తంభాలు (లైట్‌హౌస్) ఉన్నాయి. వీటిలో 78 దీపస్తంభాల పరిసర ప్రదేశంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని మేం రూపొందించాం. ప్రస్తుత దీపస్తంభాల అభివృద్ధి, ఆ పరిసర ప్రాంతాలను విశిష్ట సముద్ర పర్యాటక చిహ్నాలుగా తీర్చిదిద్దడం కూడా ఈ కీలక లక్ష్యంలో భాగమే. అలాగే గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కేరళ వంటి కొన్ని కీలక రాష్ట్రాలతోపాటు కొచ్చి, ముంబైవంటి ప్రధాన నగరాల్లో పట్టణ జలమార్గ వ్యవస్థలను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
మిత్రులారా!
ఇతర రంగాల తరహాలోనే సముద్ర రంగంలోనూ సంబంధిత అభివృద్ధి కార్యకలాపాల విషయంలో ఒంటెద్దు పనితీరుకు తావులేకుండా జాగ్రత్త వహిస్తున్నాం. ఆ మేరకు ఇటీవలే అన్నిటినీ ఏకంచేసి నౌకాయాన శాఖను ‘నౌకాయానం-రేవులు-జలమార్గాల’ శాఖగా మార్చాం. ఇక ‘సముద్ర యానం-నౌకా గమన నిర్దేశం, వాణిజ్య నావికా దళానికి విద్య-శిక్షణ, నౌకా నిర్మాణం-మరమ్మతు పరిశ్రమ, నౌకల విచ్ఛిన్నం, చేపలవేట ఓడల పరిశ్రమ, తేలే ఉపకరణాల పరిశ్రమల ముందంజ’కు ఈ శాఖ కృషిచేస్తుంది. మిత్రులారా! ఇందులో భాగంగా పెట్టుబడులకు వీలున్న దాదాపు 400 ప్రాజెక్టుల జాబితాను నౌకాయానం-రేవులు-జలమార్గాల శాఖ సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టులలో సామర్థ్యం 31 బిలియన్ డాలర్లు లేదా రూ.2.25 లక్షల కోట్లదాకా పెట్టుబడులకు అవకాశాలున్నాయి. మా సముద్ర రంగ సర్వతోముఖాభివృద్ధిలో మా చిత్తశుద్ధిని ఇది మరింత బలోపేతం చేస్తుంది.
మిత్రులారా!
సాగర భారత కార్యక్రమం-2030 ఇప్పటికే ప్రారంభించబడింది. ప్రభుత్వ ప్రాథమ్యాలను ఇది వివరిస్తుంది. ఆ మేరకు ‘సాగర్-మంథన్’ వాణిజ్య నావికాదళ విభాగం అవగాహన కేంద్రం కూడా ఇవాళ మొదలైంది. ఇది సముద్ర భద్రత, గాలింపు-రక్షణ సామర్థ్యాలు, సముద్ర పర్యావరణ రక్షణ-భద్రతలకు సంబంధించిన సమాచార వ్యవస్థ. ఇక రేవుల ఆధారిత ప్రగతిని ప్రోత్సహించే ‘సాగరమాల’ ప్రాజెక్టును ప్రభుత్వం 2016లోనే ప్రకటించింది. ఇందులో భాగంగా 2015-2035 మధ్య కాలంలో అమలుకు వీలుగా 82 బిలియన్ డాలర్లు లేదా రూ.6 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టగల 574కుపైగా ప్రాజెక్టులు గుర్తించబడ్డాయి. మిత్రులారా! దేశీయ నౌకా నిర్మాణం-మరమ్మతు మార్కెట్‌పైనా భారత ప్రభుత్వం దృష్టి సారించింది. స్వదేశీ నౌకా నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు భారత నౌకానిర్మాణ రంగం కోసం నౌకా నిర్మాణ ఆర్థికసహాయ విధానాన్ని మేం ఆమోదించాం. రెండు రేవుల తీరంలో 2022నాటికి నౌకల మరమ్మతు సముదాయాలను రూపొందిస్తాం. ‘వ్యర్థం నుంచి సంపద‘ సృష్టికి దేశీయ నౌకా పునరుపయోగ పరిశ్రమను కూడా ప్రోత్సహిస్తాం. ఇందుకోసం ‘నౌకా పునరుపయోగ చట్టం-2019’ని రూపొందించడంసహా హాంకాంగ్ అంతర్జాతీయ సదస్సు తీర్మానాలను కూడా భారత్ అంగీకరించింది.
మిత్రులారా !
మా ఉత్తమాచరణ విధానాలను ప్రపంచంతో పంచుకోవాలని భావిస్తున్నాం. అందులో భాగంగా అంతర్జాతీయ ఉత్తమాచరణల అనుసరణకూ మేం సిద్ధమే. ‘బిమ్స్టెక్, ఐవోఆర్’ దేశాలతో వాణిజ్యం, ఆర్థిక అనుసంధానంపై మా శ్రద్ధను కొనసాగిస్తాం. అంతేగాక 2026కల్లా మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెంచడంతోపాటు పరస్పర ఒప్పందాల ప్రక్రియను పూర్తి చేయాలని భారత్ యోచిస్తోంది. అలాగే ద్వీపాల్లో మౌలిక సదుపాయాలు, పర్యావరణ వ్యవస్థ సమగ్ర అభివృద్ధికి భారత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సముద్ర రంగంలో పునరుపయోగ ఇంధన వనరుల వినియోగం పెంపుపైనా మేం దృష్టి సారించాం. ఆ మేరకు దేశవ్యాప్తంగా ప్రధాన రేవులలో సౌర, పవన విద్యుదుత్పాదన వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నాం. భారత రేవులలో వాడే మొత్తం విద్యుత్తులో 2030నాటికి పునరుపయోగ ఇంధనం వాటాను 60 శాతంకన్నా అధిక స్థాయికి పెంచాలని నిర్ణయించాం.
మిత్రులారా !
అత్యంత పొడవైన భారత తీరప్రాంతం మీకోసం ఎదురుచూస్తోంది… శ్రమజీవులైన భారతీయులు మీకోసం వేచి ఉన్నారు… రండి- మా రేవులలో, ప్రజలపైనా పెట్టుబడులు పెట్టండి. భారతదేశాన్ని మీ ప్రధాన వాణిజ్య గమ్యం చేసుకోండి… భారత రేవులను మీ వ్యాపార, వాణిజ్యాలకు కేంద్రాలుగా మార్చుకోండి. ఈ సదస్సుకు నా శుభాకాంక్షలు… ఈ వేదికపై విస్తృత, ఫలవంతమైన చర్చలు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
ధన్యవాదాలు…
థ్యాంక్యూ వెరీమచ్,
***
Watch Live https://t.co/gRZRQUXGDV
— PMO India (@PMOIndia) March 2, 2021
Our nation has a rich maritime history.
— PMO India (@PMOIndia) March 2, 2021
Civilisations flourished on our coasts.
For thousands of years, our ports have been important trading centres.
Our coasts connected us to the world: PM @narendramodi
Through this Maritime India Summit, I want to invite the world to come to India and be a part of our growth trajectory.
— PMO India (@PMOIndia) March 2, 2021
India is very serious about growing in the maritime sector and emerging as a leading Blue Economy of the world: PM @narendramodi
Indian ports now have measures such as:
— PMO India (@PMOIndia) March 2, 2021
Direct port Delivery, Direct Port Entry and an upgraded Port Community System (PCS) for easy data flow.
Our ports have reduced waiting time for inbound and outbound cargo: PM @narendramodi
Ours is a Government that is investing in waterways in a way that was never seen before.
— PMO India (@PMOIndia) March 2, 2021
Domestic waterways are found to be cost effective and environment friendly way of transporting freight.
We aim to operationalise 23 waterways by 2030: PM @narendramodi
India has as many as 189 lighthouses across its vast coastline.
— PMO India (@PMOIndia) March 2, 2021
We have drawn up a programme for developing tourism in the land adjacent to 78 lighthouses: PM @narendramodi
The key objective of this initiative is to enhance development of the existing lighthouses and its surrounding areas into unique maritime tourism landmarks: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 2, 2021
The Government of India is also focusing on the domestic ship building and ship repair market.
— PMO India (@PMOIndia) March 2, 2021
To encourage domestic shipbuilding we approved the Shipbuilding Financial Assistance Policy for Indian Shipyards: PM @narendramodi
India’s long coastline awaits you.
— PMO India (@PMOIndia) March 2, 2021
India’s hardworking people await you.
Invest in our ports.
Invest in our people.
Let India be your preferred trade destination.
Let Indian ports be your port of call for trade and commerce: PM @narendramodi