ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అసమ్ లో ‘మహాబాహు-బ్రహ్మపుత్ర’ ను ప్రారంభించారు; రెండు వంతెన లకు ఆయన శంకుస్థాపన కూడా చేశారు. ఈ సందర్బం లో రోడ్డు రవాణా, రాజమార్గాల శాఖ కేంద్ర మంత్రి, చట్టం & న్యాయం, కమ్యూనికేశన్స్, ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతిక విజ్ఞాన శాఖ కేంద్ర మంత్రి, నౌకాశ్రయాలు, శిప్పింగ్, జల మార్గాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) లతో పాటు అసమ్, మేఘాలయ ల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.
‘మహాబాహు-బ్రహ్మపుత్ర’ ప్రారంభానికి గుర్తు గా, నెమాటీ-మజులీ ద్వీపం, ఉత్తర గువాహాటీ, దక్షిణ గువాహాటీ, ఇంకా ధూబ్ రీ-హాట్ సింగిమారీ మధ్య రో-పాక్స్ వెసల్ కార్యకలాపాల ను ఆయన ప్రారంభించారు. జోగీఘోపా వద్ద ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ (ఐడబ్ల్యుటి) టర్మినల్ కు, బ్రహ్మపుత్ర నది మీద వివిధ పర్యటక రేవు కట్ట (జెటీ)ల కు ఆయన శంకుస్థాపన చేశారు; వ్యాపార నిర్వహణ లో సౌలభ్యాని కి ఉద్దేశించినటువంటి డిజిటల్ సాల్యూశన్స్ ను కూడా ప్రారంభించారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయం తో ముడిపడిన అలీ-ఐ-లీగాంగ్ పండుగ ను పురస్కరించుకొని మీసింగ్ సముదాయం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ను బుధవారం నాడు జరుపుకొన్నారు. పవిత్రమైన ఈ నది కొన్ని సంవత్సరాలుగా సంధానాని కి, సామూహిక సంబరాల కు మారు పేరు గా నిలచిందని ఆయన అన్నారు. ఇంతకుముందు బ్రహ్మపుత్ర నది లో సంధానానికి సంబంధించిన పనులు ఏవీ పెద్దగా జరగకపోవడం పట్ల ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ కారణం గా అసమ్ లోపల, ఈశాన్య ప్రాంతం లోని ఇతర చోట్ల సంధాన సదుపాయాన్ని సమకూర్చడం అంటే అది ఒక పెద్ద సవాలు గా మారింది అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ యావత్తు ప్రాంతం లోను భౌగోళికం గా, సాంస్కృతికం గా దూరాల ను తగ్గించడానికి ప్రాజెక్టుల ప్రగతి ని చాలా వేగం గా పర్యవేక్షించడం జరుగుతోందని ఆయన చెప్పారు. అసమ్ సహా యావత్తు ఈశాన్య ప్రాంతం లో వనరుల పరమైన, సంస్కృతి పరమైన ఏకీకరణ ను ఇటీవల కొన్నేళ్లుగా బలోపేతం చేయడమైందని కూడా ఆయన వివరించారు.
డాక్టర్ భూపేన్ హజారికా సేతు, బోగీబీల్ వంతెన, సరయ్ ఘాట్ వంతెన ల వంటి అనేక వారధులు ప్రస్తుతం అసమ్ లో జీవనాన్ని సరళతరం గా మార్చుతున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఇది దేశ భద్రత ను పటిష్టం చేసి, మన సైనికుల కు ఎంతో అనుకూలత ను అందిస్తోందని ఆయన అన్నారు. అసమ్ ను, ఈశాన్య ప్రాంతాన్ని జోడించే ఉద్యమాన్ని ఈ రోజు న ముందుకు తీసుకు పోవడం జరిగింది అన్నారు. దీనిని సాధించడానికి కృషి చేసినందుకు గాను అసమ్ ముఖ్యమంత్రి ని, ఆయన ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రి కొనియాడారు. అసమ్ లో తొలి హెలిపాడ్ ను మజులీ అందుకొంది. కాలీబాడీ ని జోర్ హాట్ తో కలిపే 8 కిలో మీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి భూమి పూజ చేయడం తో చాలా కాలం గా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన డిమాండు ను తీర్చినట్లు అయింది. ‘‘ఈ వంతెన అనుకూలత కు, అవకాశాల కు ఒక సేతువు కాబోతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
అలాగే, ధూబ్ రీ నుంచి మేఘాలయ లో ఫూల్ బాడీ వరకు 19 కిలో మీటర్ల పొడవున ఏర్పాటయ్యే వంతన బరాక్ లోయ లో సంధానాన్ని మెరుగు పరుస్తుందని, ఈ వంతెన మేఘాలయ, మణిపుర్, మిజోరమ్, అసమ్ ల మధ్య దూరాన్ని తగ్గించనుందని చెప్పారు. ప్రస్తుతం మేఘాలయ కు, అసమ్ కు మధ్య రహదారి మార్గం లో దూరం సుమారు 250 కిలో మీటర్లు ఉంటే అది ఇక 19- 20 కి.మీ. కి తగ్గుతుందని ప్రధాన మంత్రి వివరించారు.
‘మహాబాహు-బ్రహ్మపుత్ర’ కార్యక్రమాన్ని గురించి శ్రీ నరేంద్ర మోదీ వివరిస్తూ, ఇది నౌకాశ్రయ ప్రధాన అభివృద్ధి ద్వారా బ్రహ్మపుత్ర నది లో జల మార్గ సంధానాన్ని బలోపేతం చేస్తుందన్నారు. ఈ రోజు న ప్రాంభించిన రో-పాక్స్ సర్వీసులు మూడూ ఇంతటి స్థాయి లో రో-పాక్స్ సర్వీసులు సమకూరిన అసమ్ ను ఒక ముందు వరుస లోని రాష్ట్రం గా తీర్చిదిద్దుతాయన్నారు. దీనికి, నాలుగు పర్యటక రేవు కట్టలను కూడా కలుపుకొంటే, ఈశాన్య ప్రాంతం తో అసమ్ సంధానాన్ని ఇవి చెప్పుకోదగ్గ విధం గా మెరుగు పరచగలుగుతాయి అని ఆయన అన్నారు.
ఏళ్ళ తరబడి సంధానాన్ని నిర్లక్ష్యం చేసిన నేపథ్యం లో రాష్ట్రం తన సమృద్ది కి దూరం గా ఉండిపోయింది, ఇది శోచనీయం అని ప్రధాన మంత్రి అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన సన్నగిలింది. జల మార్గాలు దాదాపు గా మటుమాయం అయ్యాయి. ఇది అశాంతి కి దారితీసింది అని ప్రధాన త్రి అన్నారు. పూర్వ ప్రధాని కీర్తి శేషులు అటల్ బిహారీ వాజ్పేయీ కాలం లో దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయని శ్రీ మోదీ అన్నారు. ఇటీవల కొన్నేళ్ళ లోనూ, అసమ్ లో బహుళ విధ సంధానాన్ని పున:స్థాపించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, తూర్పు ఆసియా దేశాలతో మన సాంస్కృతిక వ్యాపార సంబంధాల కు అసమ్ ను, ఈశాన్య ప్రాంతాన్ని ఒక కేంద్రం గా ఆవిష్కరించే ప్రయత్నాలు మొదలయ్యాయని ఆయన చెప్పారు.
అంతర్ దేశీయ జలమార్గాల కు సంబంధించిన పనులు ఇక్కడ ఒక పెను ప్రభావాన్ని కలుగుజేయనున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. ఇటీవలే జల సంధానాన్ని మెరుగు పరచుకోవడం కోసం బాంగ్లాదేశ్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడమైందని ఆయన అన్నారు. బ్రహ్మపుత్ర ను బరాక్ నది తో కలపడం కోసం హూగ్లీ నది వెంబడి ఇండో-బాంగ్లాదేశ్ ప్రోటోకాల్ రూట్ ఏర్పాటు పని సాగుతోంది అని ఆయన అన్నారు. ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశం లోని ఇతర ప్రాంతాల తో జోడించడం ద్వారా ఈ ప్రాంతం ఇరుకు గా ఉన్న సంధాన భాగం పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు వీలు చిక్కుతుందన్నారు. అసమ్ ను హల్దియా నౌకాశ్రయం తోను, కోల్ కాతా తోను ఒక జల మార్గం ద్వారా కలిపేందుకు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని జోగీఘోపా ఐడబ్ల్యుటి టర్మినల్ పటిష్ట పరుస్తుందని కూడా ఆయన చెప్పారు. ఈ టర్మినల్ కు భూటాన్, బాంగ్లాదేశ్ నుంచి వచ్చే సరకు ఓడ లతో పాటు జోగీఘోపా మల్టి మాడల్ లాజిస్టిక్స్ పార్కు లోని సరకు ఓడలు బ్రహ్మపుత్ర నది తీరం లోని వివిధ ప్రాంతాల కు రాకపోకలు జరిపేందుకు తగిన సదుపాయాల కు నోచుకొంటాయని ఆయన వివరించారు.
సామాన్య మానవుడి కి సౌకర్యవంతం గా ఉండేటట్లుగాను, ఈ ప్రాంతం అభివృద్ధి చెందేటట్లుగాను కొత్త మార్గాల ను నిర్మించడమైందని ప్రధాన మంత్రి అన్నారు. మజులీ, నెమాటీ ల మధ్య రో-పాక్స్ సర్వీసు ఆ తరహా మార్గాల లో ఒకటని, ఇది దూరాన్ని సుమారు 425 కిలో మీటర్ల నుంచి 12 కిలో మీటర్ల కు తగ్గిస్తుందని ఆయన చెప్పారు. ఈ దారి లో రెండు నౌకల ను నడపడం జరుగుతుందని, ఇవి దాదాపు 1600 మంది ప్రయాణికుల తో పాటు డజన్ ల కొద్దీ వాహనాల ను ఒక దఫా లో రవాణా చేయగలుగుతాయన్నారు. గువాహాటీ లో ప్రారంభించిన ఇదే కోవ కు చెందిన మరొక సదుపాయం ఉత్తర గువాహాటీ, దక్షిణ గువాహాటీ ల మధ్య దూరాన్ని 40 కిలో మీటర్ల నుంచి 3 కిలో మీటర్ల కు తగ్గించి వేస్తుందన్నారు.
ఈ రోజున ప్రారంభానికి నోచుకొంటున్న ఇ-పోర్టల్స్ వినియోగదారులు ఖచ్చితమైన సమాచారాన్ని అందుకొనేందుకు తోడ్పడుతాయని ప్రధాన మంత్రి చెప్పారు. జాతీయ జలమార్గం తాలూకు కార్గో, క్రూజ్ ట్రాఫిక్ డేటా కు సంబంధించి వాస్తవ కాల సమాచారాన్ని కలపడం లో కార్-డి పోర్టల్ సహాయకారి గా ఉంటుందన్నారు. అది జలమార్గ మౌలిక సదుపాయాల కు సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తుందన్నారు. జిఐఎస్ ఆధారితం గా పని చేసే ఇండియా మ్యాప్ పోర్టల్ ఇక్కడకు వ్యాపారం కోసం తరలి రావాలని కోరుకొనే వారికి సాయపడుతుందన్నారు.
జల మార్గం, రైలు మార్గం, రాజమార్గ (హైవే) సంధానం లతో పాటే ఇంటర్ నెట్ సంధానం సమానమైనటువంటి ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుందని, ఈ విషయం లో నిరంతరం గా పని జరుగుతున్నదని ప్రధాన మంత్రి వివరించారు. వందల కొద్దీ కోట్ల రూపాయల ను పెట్టుబడి గా పెట్టి, ఈశాన్య ప్రాంతం లోని గువాహాటీ లో మొట్టమొదటి డేటా సెంటర్ ను నిర్మించడం జరుగుతోందని ఆయన ప్రకటించారు. ఈ డేటా సెంటర్ 8 రాష్ట్రాల కు ఒక డేటా సెంటర్ హబ్ గా సేవలను అందిస్తుందని, అంతేకాకుండా అసమ్ సహా ఈశాన్య ప్రాంతం లో ఇ-గవర్నెన్స్ ద్వారా సమాచార సాంకేతిక సేవ ఆధారిత పరిశ్రమ ను, బిపిఒ ఇకో సిస్టమ్ ను, స్టార్ట్-అప్స్ ను బలోపేతం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈశాన్య ప్రాంతం తో సహా దేశం లో ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్ మరియు సబ్కా విశ్వాస్’.. ఈ దృష్టి కోణం తో ప్రభుత్వం పని చేస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. మజులీ ప్రాంత సాంస్కృతిక వైభవం, సుసంపన్నత లను గురించి, అసమ్ సంస్కృతి ని గురించి, అక్కడి జీవ వైవిధ్యాన్ని గురించి కూడా ఆయన తన ప్రసంగం లో ప్రస్తావించారు. సాంస్కృతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం, మజులీ కి జీవ వైవిధ్య వారసత్వ స్థలం హోదా, తేజ్ పుర్- మజులీ- శివసాగర్ లో హెరిటేజ్ సర్క్యూట్, నమామీ బ్రహ్మపుత్ర, నమామి బరాక్ ల వంటి వేడుకలు తదితర చర్యల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఆ చర్య లు అసమ్ గుర్తింపు ను ఇనుమడింప చేస్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. ఈ రోజు న ప్రారంభం జరిగిన సంధాన సంబంధి ప్రాజెక్టు లు పర్యటన రంగం లో కొత్త మార్గాల ను తెరుస్తాయి, క్రూజ్ టూరిజమ్ పరంగా ఒక ప్రధానమైన గమ్యస్థానంగా అసమ్ ఎదుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘అసమ్ ను, ఈశాన్య ప్రాంతాన్ని ‘ఆత్మనిర్భర్ భారత్’ కు ఒక దృఢమైన స్తంభం గా నిలబెట్టేందుకు మనం కలసికట్టుగా పని చేయాలి’’ అని చెప్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
***
Working towards #AatmanirbharAssam. Watch. https://t.co/XEBMvejwaX
— Narendra Modi (@narendramodi) February 18, 2021
असम और नॉर्थ ईस्ट के अलग-अलग हिस्सों को जोड़ने के अभियान को आज और आगे बढ़ाया गया है। pic.twitter.com/oEjOPtmYwj
— Narendra Modi (@narendramodi) February 18, 2021
असम में आज ‘महाबाहु ब्रह्मपुत्र’ प्रोग्राम शुरू किया गया है। इसके जरिए ब्रह्मपुत्र के जल से इस पूरे क्षेत्र में Water Connectivity और Port Led Development सशक्त होगा। pic.twitter.com/nXGNaJRrvQ
— Narendra Modi (@narendramodi) February 18, 2021
बीते वर्षों में असम की मल्टी मॉडल कनेक्टिविटी को फिर से स्थापित करने के लिए एक के बाद एक कदम उठाए गए हैं।
— Narendra Modi (@narendramodi) February 18, 2021
कोशिश यह है कि असम और नॉर्थ ईस्ट को दूसरे पूर्वी एशियाई देशों के साथ हमारे सांस्कृतिक और व्यापारिक रिश्तों का भी केंद्र बनाया जाए। pic.twitter.com/6AUw1O5Ciw
अगर सामान्य जन की सुविधा प्राथमिकता हो और विकास का लक्ष्य अटल हो, तो नए रास्ते बन ही जाते हैं। माजुली और निमाटी के बीच रो-पैक्स सेवा ऐसा ही एक रास्ता है। pic.twitter.com/PmVzcqeezw
— Narendra Modi (@narendramodi) February 18, 2021