భారత ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ, సొషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి న్యూయెన్ క్జుయాన్ ఫుక్ 2020 డిసెంబర్ 21న వర్చువల్ శిఖరాగ్ర సమ్మేళనానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు ద్వైపాక్షిక, ప్రాంతీ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి విస్తృత అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.భవిష్యత్ ఇండియా – వియత్నాం సమగ్ర వ్యూహౄత్మక భాగస్వామ్యం, శాంతి,సుసంపన్నత, ప్రజలకు సంబంధించి సంయుక్త దార్శనికతను ముందుకు తెచ్చారు.
శాంతి:
1. వ్యూహాత్మక సమగ్ర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న ఆకాంక్షను ఉభయ పక్షాల నాయకులు వ్యక్తం చేశారు.
సంస్థాగతంగా క్రమంతప్పకుండా ఉన్నతస్థౄయి సంస్థాగత సంభాషణలు కొనసాగించాలని, వీటిని చారిత్రక , సాంస్కృతిక పరంగా ఉభయదేశాలమధ్యగల సంబంధాల పునాదిగా కొనసాగించాలని, ఉభయ పక్షాలు అనుసరించే విలువలు, ప్రయోజనాలు, పరస్పర వ్యూహాత్మక విశ్వాసం, అవగాహన , అంతర్జాతీయ చట్టానికి నిబద్ధత వంటి వాటిని కొనసాగించాలని నిర్ణయించారు.
అన్ని రంగాలలో ద్వైపాక్షిక సహకారానికి , ఒకరి జాతీయ అభివృద్ధికి మరోకరు మద్దతు నివ్వడంతోపాటు శాంతియుత ,సుస్థిర, భద్రమైన, స్వేచ్ఛాయుత, బహిరంగ, సమ్మిళిత, నిబంధనలకు లోబడిన ప్రాంతం సాధనకు కృషి చేయాలని నిర్ణయించారు.
2. ఈ ప్రాంతంలోను, దాని అవతల గల రాజకీయ, ఆర్థిక పరిధులల పరస్పర సహకారానికి తమ ప్రధాన పాత్రను ఇరు దేశాలు గుర్తించాయి. ఇండియా , వియత్నాంల మధ్య విస్తారిత రక్షణ, భద్రతా భౄగస్వామ్యం ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఒక కీలక అంశంగా ఉంటుందని ఇరువురు నాయకులూ అంగీకరించారు. ఇందుకు సంబంధించి ఇరువైపాఉలా తమ సైనిక దళాల నుంచి సైనిక దళాలకు మార్పిడులు, శిక్షణ, సామర్ద్యాలన పెంపు, అలాగే రక్షణ పరిశ్రమ రంగంలో పరస్పర సహకారం ,వియత్నాంకు భారత రక్షణ క్రెడిట్ లైన్ కార్యక్రమాల వర్తింపు విషయంలో సహకారం వంటివాటిని తీవ్రతరం చేయనున్నారు. పరస్పరలాజిస్టిక్ మద్దతు ద్వారా రక్షణ రంగ మార్పిడులను సంస్థాగతం చేయనున్నారు.అలాగే రెగ్యులర్షిప్విజిట్లు, జాయింట్ ఎక్సర్సైజ్లు, మిలటరీ , సైన్స్ టెక్నాలజీ రంగంలో పరస్పర ఇచ్చిపుచ్చుకోవడాలు, మిలటరీ సైన్స్ టెక్నాలజీ , సమాచార మార్పిడి, ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణలో సహకారం వంటివి ఇందులో ఉన్నాయిది. సైబర్, సముద్ర రవాణా రంగాలు, ఉగ్రవాదం వంటి అంశాలలో సంప్రదాయకంగా , సంప్రదాయేతరంగ ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఇరువైపులా మరింత సన్నిహితంగా సంస్థాగత చర్చలు కొనసాగించనున్నాయి. అవసరమైన సందర్భాలలో న్యాయ, చట్టపరంగా కూడా సహకరించుకుంటారు.
3. సుసంపననత, భద్రత కు సంబంధించి ఉన్న సంబంధాన్ని అనుసంధానిస్తూ దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో నావిగేషన్స్వేచ్ఛ, భద్రత,సుస్థఙరత , శాంతిని కాపాడాల్సిన ఆవశ్యకతను ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. బలప్రయోగం, బెదరింపులకు ఆస్కారం లేకుండా అంతర్జాతీయ చట్టాల ప్రకారం వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ప్రత్యేకించి 1982 నాటి యునైటెడ్నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ (యు ఎన్ సిఎల్ఒ ఎస్) ప్రకారం శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నం.ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతకు వీలుగా అలాగేఈ ప్రాతంలో నిస్సైనికీకరణ ప్రాధాన్యతను ఇరువురు నాయకులూ గుర్తించారు. అలాగే ఈ ప్రాంతంలో అన్ని దేశాలు సంయమనం పాటించాలని, ఈ ప్రాంతంలో శాంతి , సుస్థిరతకు ఏమాత్రం భంగం కలగకుండా చూడాలని అభిప్రాయపడ్డారు. యుఎన్సిఎల్ ఒ ఎస్ ఫ్రేమ్‌వర్క్‌కు లోబడి మహాసముద్రాలు, సముద్రాలకు సంబంధించిన కార్యకలాపాలను కొనసాగించాలని , సముద్ర జలరవాణాకు సంబంధించి న హక్కుకు సంబంధించి యుఎన్సిఎల్ ఒఎస్ ప్రాతిపదికగా ఉండాలని , అలాగే సముద్రరవాణా జోన్ల విషయంలో సార్వభౌమత్వ హక్కులు,పరిధి, చట్టబద్ధ ప్రయోజనాలు ఉండాలని అభిప్రాయపడ్డారు.
దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో కోడ్ ఆఫ్ కాండక్ట్ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉండాలని అభిప్రాయ పడ్డారు. ప్రత్యేకించి యుఎన్సిఎల్ఒఎస్ చట్టబద్ధ హక్కులకు ఏమాత్రం భంగం కలిగించరాదని,ఈ చర్చలలో సంబంధం లేని పార్టీల ప్రయోజనాలకు కూడా భంగకరం కారాదని అభిప్రాయపడ్డారు.
4. ఈ ప్రాంతంలో శాంతి, సుస్తిరత , సుసంపన్నత లను కొనసాగించడంలో ఏసియాన్ -ఇండియా ప్రాధాన్యతను ఉభయ నాయకులు గుర్తించారు. ఏసియాన్- ఇండియా లమధ్య కీలక రంగాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకునేందుకు గల అవకాశాలను ఉభయ నాయకులు స్వాగతించారు. ఇండియా – పసిఫిక్, ఇండియాకు చెందిన ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్(ఐపిఒఐ), ఇండో పసిఫిక్ ప్రాంతంలో , ఏసియాన్ కేంద్రిత అంశాలపై ఉమ్మడి అంశాలపై దృష్టిపెట్టాలని నిర్ణయించారు.
సముద్ర ఆర్ధిక వ్యవస్థ, జలమార్గ రవాణా భద్రత, రక్షణ, సముద్ర పర్యావరణం, సుస్థిరత, సముద్ర వనరుల వినియోగం, సముద్ర మార్గ అనుసంధానత వంటి వాటి విషయంలో నూతన ,వాస్తవిక సహకారానికి కృషి చేయాలని, సామర్ధ్యాలను నిర్మించేందుకుగల అవకాశాలను ఉభయపక్షాలూ అవకాశాలను పరిశీలించనున్నాయి.
5.ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల విషయంలో తమ ఉమ్మడి వైఖరులలోని బలాలలను స్వీకరిస్తూ అంతర్జాతీయ చట్టాలు , నిబంధనల ఆధారిత ఆర్డర్పట్ల వారికి గల గౌరవానికి, అంతర్జాతీయ అంశాల విషయంలో సమష్టితత్వం, సమానత్వం పట్ల గల విశ్వాసానికి గౌరవమిస్తూ ఉభయ పక్షాలూ ఐక్యరాజ్య సమితితో సహా బహుళపక్ష, ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాయి. ఆసియాన్ నాయకత్వ యంత్రాంగాలు, మెకాంగ్ సబ్ ర ఈజనల్ సహకారం ఇందులో ఉన్నాయి.
ఉభయపక్షాలూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలితో సహా వివిధ అంతర్జాతీయ సంస్థలు సంస్కరలతో కూడిన బహుళపక్ష సంస్థలుగా ఎదగడానికి, అవి మరింత ప్రాతినిధ్యం కలిగి ఉండేలా ,సమకాలీనత, కలిగి ఉండేలా, ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనేలా ఉండాలాచేయడానికి బహుళ పక్ష విధానాన్ని చురుకుగా ప్రోత్సహించనున్నాయి. కోవిడ్ -19 మహమ్మారి నియంత్రణ విషయంలో ఆయా దేశాల అనుభవాలను పంచుకోవడానికి , ఆరోగ్య రంగ ప్రొఫెషనల్స్‌కు ఆన్లైన్ శిక్షణకు మద్దతు, వాక్సిన్ అభివృద్ధిలో సంస్థాగత మద్దతు, ఓపన్ సప్లయ్ చెయిన్ల ప్రోత్సాహం, ప్రజలు అత్యవసర పనుల నిమిత్తం సరిహద్దులు దాటేందుకు వీలు కల్పించడం,ప్రపంచ ఆరోగ్ సంస్థవంటి బహుళపక్ష సంస్థలతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండాలని ఉభయపక్షాలూ నిర్ణయించాయి.
6.ఉగ్రవాదం నుంచి పొంచిఉన్నముప్పు, హింసాత్మక అతివాదం, రాడికలిజం వంటి వాటి నుంచి ప్రపంచ శాంతికి, మానవాళికి ఎదురౌతున్న ముప్పును ప్రస్తావిస్తూ , సీమాంతర ఉగ్రవాదం తోసహా అన్నిరూపాలలోని ఉగ్రవాద కార్యకలాపాలనుఎదుర్కొనాలని, ఇందుకు మరింత సహకారంతో ద్వైపాక్షిక, ప్రాంతీయ ,అంతర్జాతీయ కృషిని కొనసాగించాలని ఉభయపక్షాలూనిర్ణయించాయి. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే నెట్‌వర్క్‌లు వంటి వాటిపై ద్వైపాక్షిక, ప్రాంతీయ , అంతర్జాతీయస్థాయిలో పరస్పర సహకారంతో మరింత సమన్వయంతో ఎదుర్కోవాలని నిర్ణయించారు. ఉభయ పక్షాలూ అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర కన్వెన్షన్‌ను వీలైనంత త్వరగా చేపట్టేందుకు బలమైన ఏకాభిప్రాయ సాధనకు సంయుక్త కృషి సాగించాలని ఉభయపక్షాలూ నిర్ణయించాయి.
సుసంపన్నత:
7.కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఏర్పడిన సవాళ్లు,తెచ్చిన అవకాశాలను ఉభయ పక్షాలూ గుర్తిస్తూ,రెండు వైపులా నమ్మకమైన,సమర్ధమైన, సప్లయ్ చెయిన్‌ను ఏర్పాటుచేయడానికి కృషి చేయనున్నాయి. అలాగే మానవ కేంద్రిత ప్రపంచీకరణకు కృషి చేస్తాయి. వీలైనంత త్వరగా 15 బిలియన్ అమెరికన్‌డాలర్ల వాణిజ్య టర్నోవర్ సాధనకు ఉభయపక్షాలూ కృషి చేస్తాయి. అలాగే ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి పటిష్టమైన ప్రణాళికతో ,ఆయా దేశాలలోని నూతన సప్లయ్ చెయిన్ల ఉన్నతస్థాయి లక్ష్యాలను చేరుకునేందుకు కృషిచేయనున్నారు.
8. ఇండియా కుగల భారీ దేశీయ మార్కెట్, స్వావలంబనకు గల దార్శనికత ఒకవైపు,వియత్నాం లో పెరుగుతున్న ఆదేశ ఆర్ధిక వ్యవస్థ, సామర్ద్యాలు మరోవైపు ఉన్నాయి. ఉభయపక్షాల వైపున తమ ద్వైపాక్షిక ఆర్ధిక కార్యకలాపాలను నిరంతరం స్థాయి పెంచనున్నారు. దీనితో ఒక దేశం మరో దేశ ఆర్ధిక వ్యవస్థలో దీర్ఘ కాలిక పెట్టుబడులకు అవకాశంకల్పించడం, సంయుక్త భాగస్వామ్యాలను ప్రోత్సహించడం, నూతన అంతర్జాతీయ వాల్యూ చెయిన్లలో పాలు పంచుకోవడం, భౌతిక, డిజిటల్ అనుసంధానత, ఈ కామర్స్‌కు ప్రోత్సాహం, బిజినెస్ ట్రావెల్స్‌కు వీలు కల్పించడం,ప్రాంతీయ వాణిజ్య వ్యవస్థ స్థాయి పెంపు, పరస్పరం పెద్ద ఎత్తున మార్కెట్‌కు అనుసంధానత కల్పించడం వంటివాటి స్థాయి పెంచుతారు.
2024 నాటికి భారత దేశం 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఎదిగేందుకు పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా భారతదేశం భాగస్వామ్యాలకు సృష్టించిన నూతన అవకాశాలు, మరోవైపు 2045 నాటికి ఉన్నత స్థాయి ఆర్ధిక వ్యవస్థగా ఎదిగేందుకు వియత్నాం పెట్టుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ఆర్ధిక వ్యవస్థలోని అన్ని రంగాలలో గల అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేయడం జరుగుతుంది. ఉభయ దేశాలకు చెందిన ఎం.ఎస్.ఎం.ఇలతో పాటు ఫార్మింగ్ కమ్యూనిటీల విషయంలోనూ అవకాశాలను సద్వినియోగం చేయడం జరుగుతుంది.
9. అభివృద్ధి, సుసంపన్నతకు ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా రెండు ఆర్ధిక వ్యవస్థలు యువతరాన్ని కలిగిఉన్నాయి. ఇండియా, వియత్నాం మధ్య అభివృద్ధి భాగస్వామ్యం నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, డిజిటైజేషన్,సుపరిపాలన, ప్రజల సాధికారత, సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి ఆధారంగా ముందుకు సాగనున్నాయి.
ఇందుకు సంబంధించి ఇరువైపులా ఇండియాకుచెందిన డిజిటల్ ఇండియా మిషన్, వియత్నాం వారి డిజిటల్ సొసైటీ విజన్, శాంతియుత అవసరాలకు అణు, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ లలో ట్రాన్స్ఫర్మేటివ్ టెక్నాలజీలు,సముద్ర విజ్ఞానం, సుస్థిర వ్యవసాయం, జలవనరుల నిర్వహణ,సమగ్ర ఆరోగ్య సంరక్షణ, ఫార్మాసూటికల్స్, స్మార్ట్ సిటీలు, స్టార్టప్‌ల వంటి వాటిలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేస్తారు.
10.సుస్థిరాభివృద్ధి, వాతావరణ మార్పులకు సంబంధించినచర్యల విషయంలో తమ నిబద్ధతను ఇరుదేశాల పునరుద్ఘాటించాయి. అభివృద్ధి చెందిన దేశాలుగా తమ ఇంధన భద్రత సమస్యను పరిష్కరించుకుంటూ ఇరు పక్షాలూ నూతన ,పునరుత్పాదక ఇంధన వనరులను ,ఇంధన పొదుపు, వాతావరణ మార్పులను తట్టుకునే సాంకేతిక పరిజ్ఞానం విషయంలో పరస్పరం భాగస్వామ్యం వహించనున్నాయి. అంతర్జాతీయ సౌర కూటమిలో వియత్నాం చేరే అవకాశం ఉండడంతో సౌర ఇంధన రంగంలో సహకారానికి నూతన అవకాశాలను ఏర్పరచనుంది.ఇది పెద్ద మొత్తంలో సైర ఇంధనానికి వీలు కల్పిస్తుంది. అదే సమయంలో చమురు, వాయువు రంగంలో ఎంతోకాలంగా తమ మధ్య ఉ న్నభాగస్వామ్యాన్ని ఉభయదేశాలూ మరింత బలోపేతం చేసుకోనున్నాయి. తృతీయ దేశాలలో అన్వేషణ ప్రాజెక్టులు,డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్టులలో కొలాబరేషన్లు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి.
రెండు వైపులా వాతావరణ మార్పులకు సంబంధించి తమ మధ్యసహకారాన్ని బలోపేతం చేసుకుంటాయి.ఈ దిశగా సమీపభవిష్యత్తులో విపత్తులను తట్టుకునే మౌలికసదుపాయాల విషయంలో గల కూటమిలో వియత్నాంచేరగలదని ఇండియాభావిస్తుంది.
11. తమ అభివృద్ధి భాగస్వామ్యం స్థానిక కమ్యూనిటీల విషయంలో నిర్మాణాత్మక, వైవిద్యంతో కూడిన ప్రయోజనాలను అందించగల కీలక పాత్రను గుర్తిస్తూ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు తోడ్పాటునందిస్తూ, వియత్నాంలో ఇండియా అభివృద్ధి సహాయాన్ని , సామర్ధ్యాల నిర్మాణాన్ని మరింత దృఢతరం చేయనున్నారు. అలాగే మెకాంగ్- గంగా సత్వర ప్రభావ ప్రాజెక్టులు, ఐటిఇసి, ఈ- ఐటిఇసి కార్యక్రమాలు భిన్న రంగాలలో విస్తరించనున్నారు.
ప్రజలు:
12. ఇండియా , వియత్నాంల మధ్యగల లోతైన సాంస్కృతిక చారిత్రక బంధాన్ని గుర్తిస్తూ ఇరువైపులా ఉభయ దేశాల సాంస్కృతిక, నాగరిక వారసత్వంపై అవగాహన పరిశోధన ను ప్రోత్సహించడం అలాగే బౌద్ధ ,చామ్ సంస్కృతులు, సంప్రదాయాలు, పురాతన గ్రంధాలపై అవగాహన పరిశోధనను పెంపొందించడం ఉమ్మడి సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో పరస్పరసహకారం అభివృద్ధి భాగస్వామంలో కీలక స్తంభంగా ఉండనుంది. సంప్రదాయ వైద్యవిధానలు ఉభయ దేశాలకూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2,3 ను సాధించడానికి ఎంతో కీలకమైనవి. వేలాది సంవత్సరాలుగా ఉభయదేశాల మధ్య సాంస్కృతిక మార్పిడిని దృష్టిలో ఉంచుకుని ఆయుర్వేద వంటి సంప్రదాయ వైద్య వ్యవస్థలు, వియత్నాం వారి సంప్రదాయ వైద్యం ఆరోగ్యానికి సంబంధించి ఉభయదేశాలలో ఎన్నో ఉమ్మడి అంశాలను కలిగి ఉన్నాయి. యోగా శాంతి, సామరస్యానికి చిహ్నంగా రూపుదిద్దుకుంది. ఉభయదేశాలూ తమతమ సంప్రదాయ వైద్య విధానాలను బలోపేతం చేసేందుకు పరస్పరం సహకరించుకోనున్నాయి. అలాగే ఇండియా – వియత్నాం సాంస్కృతిక, నాగరిక సంబంధాలకు సంబంధించి ఒక ఎన్సైక్లోపేడియాను తీసుకురానున్నారు. దీనిని ఇండియా- వియత్నాం దౌత్య సంబంధాల 50 వ వార్షికోత్సవాల సందర్భంగా2022లో తీసుకురానున్నారు.
13. ఇరుదేశాల ప్రజల స్నేహ పూర్వక విశ్వాసాలనుంచి ఇరుదేశాల సంబంధాలకు మద్దతు,బలం లభించిన వాస్తవాన్ని గుర్తిస్తూ,ఉభయ దేశౄలూ ప్రజలకు- ప్రజలకు మధ్యగల సంబంధాలను మరింత పెంచడంతోపాటు , ఉభయదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపడం, సులభతర వీసా ప్రక్రియలను , సదుపాయాలను కల్పించడం ద్వారా రాకపోకలను సులభతరం చేయడం., పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు నిర్ణయించడం జరిగింది. అలాగే పార్లమెంటరీ రాకపోకలు, భారతీయ రాష్ట్రాలు, వియత్నాం ప్రావిన్సుల మధ్య సంబంధాల పెంపు, విద్యా సంస్థల మధ్య కొలాబరేషన్, మీడియా ,ఫిల్మ్,టివి షోలు, క్రీడా రంగాల మధ్య రాకపోకల పెంపు కూడా ఇందులో ఉన్నాయి. ఇండియా – వియత్నాం సంబంధాలకు సంబంధించిన అంశాలను ఇరుదేశాల పాఠశాల పాఠ్యపుస్తకాలలో చేర్చనున్నారు.
14. భారత – వియత్నాంల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి పైన పేర్కొన్న ఉమ్మడి దార్శనిక లక్ష్యాలు కీలకం కానున్నాయని ఉభయ దేశాల ప్రధానమంత్రులు తమ విశ్వాసం వ్యక్తం చేశారు.2021-23 కాలానికి ఉభయ దేశాలూ ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన సమగ్ర కార్యాచరణను చేపట్టనున్నాయి..
ఫలితాలు:
(ఎ) ఈ సంయుక్త ప్రకటనను స్వీకరిస్తూ ఉభయదేశౄల నాయకులు 2021-23 కాలానికి కార్యాచరణప్రణాళికపై సంతకం చేయడాన్ని స్వాగతించారు.
(బి) వియత్నాంకు భారతదేశం అందించిచిన డిఫెన్స్ లైన్ ఆఫ్ క్రెడిట్ 100 మిలియన్ అమెరికన్ డాలర్ల కింద వియత్నాం బార్డర్ గార్డ్కమాండ్ కోసం హై స్పీడ్ గార్డ్ బోట్ తయారీ ప్రాజెక్టు విజయవంతంగా అమలు జరగుతుండడంపట్ల ఇరువురు ప్రధానమంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పూర్తి అయిన హెచ్.ఎస్.జిబిని వియత్నాంకు అప్పగించడం, ఇండియాలో తయారైన హెచ్.ఎస్.జిబిల ఆవిష్కరణ,వియత్నాంలో తయారైన హెచ్.ఎస్.జి.బిల పై ఉభయ ప్రధానులు సంతృప్తి వ్యక్తం చేశారు.
(సి) వియత్నాంలోని నిన్ తున్ ప్రావిన్స్‌లో స్థానిక కమ్యూనిటీ ప్రయోజనం కోసం 1.5 మిలియన్ అమెరికన్ డాలర్ల సహాయాన్ని భారత దేశ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అసిస్టెన్సు కింద ఏడు అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తికావవడం పట్ల ఇరువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
డి) ఎం.ఒ.యులపై సంతకాలు, ఒప్పందాల అమలు ఏర్పాట్లు, వివిధ రంగాలో ద్వైపాక్షిక సహకారంపై ఉభయప్రధానమంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు.
సంతకాలు జరిగిన ఎంఓయులు, ఒప్పందాలు :
1. రక్షణ పరిశ్రమ సహకార ఒప్పంద ఏర్పాటు
2.నా తాంగ్లోని నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనివర్సిటీ ఆర్మీ సాఫ్ట్వేర్ పార్క్ కోసం 5 మిలియన్ అమెరికన్ డాలర్ల గ్రాంటుకు సంబంధించిన ఒప్పందం
3.ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణలో సహకారానికి సియుఎన్ పికెఒ- విఎన్డిపికెఒ మధ్య అమలు ఏర్పాటు
4. భారత అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు, వియత్నాం ఏజెన్సీ ఫర్ రేడియేషన్, న్యూక్లియర్ ఎనర్జీ మధ్య అవగాహనా ఒప్పందం.
5. సిఎస్ఐఆర్- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంకు వియత్నాం పెట్రోలియం ఇన్స్టిట్యూట్కు మధ్య అవగాహనా ఒప్పందం
.6నేషనల్ సోలార్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, వియత్నాం క్లీన్ ఎనర్జీఅసోసియేషన్ మధ్య అవగాహనా ఒప్పందం.
7.టాటా మొమోరియల్ సెంటర్‌కు వియత్నాం నేషనల్కాన్సర్ ఆస్పత్రికి మధ్య ఎం.ఒ.యు
ప్రకటనలు:
1.2021-2022 ఆర్థిక సంవత్సరం నుంచి సత్వర ప్రభావ ప్రాజెక్టులను ప్రస్తుతం ఉన్న సంవత్సరానికి 5 నుంచి సంవత్సరానికి 10కి పెంచనున్నారు. వియత్నాం వారసత్వ పరిరక్షణ (మై సన్‌లోని ఎఫ్ బ్లాక్ ఆలయం, క్యుయాంగ్ నామ్లో డాంగ్ డ్యుయాంగ్ బుద్ధిస్ట్ మొనాస్టరీ, ఫు ఎన్ లో నాన్ చామ్ టవర్) లో కొత్త అభివృద్ధి ప్రాజెక్టుల ను చేపట్టడం.
3. ఇండియా- వియత్నాం నాగరిక, సాంస్కృతిక సంభంధాలు,ఇండియా- వియత్నాంపై ద్వైపాక్షిక ప్రాజెక్టు ఆవిష్కరణ
****
Addressing the India-Vietnam Virtual Summit. https://t.co/EJoqxllN6Q
— Narendra Modi (@narendramodi) December 21, 2020
Held a Virtual Summit H.E. Nguyen Xuan Phuc, PM of Vietnam. We reviewed our cooperation on bilateral, regional and multilateral issues, and adopted a ‘Joint Vision for Peace, Prosperity and People’ to give direction to our Comprehensive Strategic Partnership.
— Narendra Modi (@narendramodi) December 21, 2020