Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అలీగఢ్ ముస్లిమ్ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

అలీగఢ్ ముస్లిమ్ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


అలీగఢ్ ముస్లిమ్ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.  ఈ కార్యక్రమానికి గుర్తు గా ఒక తపాలా బిళ్ల ను కూడా ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, దేశం గురించి పట్టించుకొనే వ్యక్తి ఒకటో కర్తవ్యమూ, ప్రధాన కర్తవ్యమూ కులం తో , వర్గం తో, లేదా మతం తో సంబంధం లేకుండా ప్రజలందరి సంక్షేమం కోసం పనిచేయడమే’’ అని సర్ సైయద్ అన్న మాటలను గుర్తు కు తెచ్చారు.   ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ఒక్క పౌరురాలికి రాజ్యాంగం అతనికి, లేదా ఆమె కు ప్రసాదించిన హక్కుల పట్ల హామీ లభించే మార్గం లో దేశం పయనిస్తున్నదని, ఎవరిని అయినా వారి మతం కారణం గా వెనుకపట్టు న వదలివేయ కూడదని, ఇదే అంశం ‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’’ అనే వాగ్ధానానికి ఆధారం గా ఉందంటూ ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఎలాంటి విచక్షణ కు తావు ఇవ్వకుండా ప్రయోజనాలను అందిస్తున్న ప్రభుత్వ పథకాలను గురించి శ్రీ మోదీ ఈ సందర్భం లో ఉదాహరణలు ఇచ్చారు.  40 కోట్ల మంది కి పైగా పేదల బ్యాంకు ఖాతాలను ఎలాంటి భేదభావాలకు తావు ఇవ్వకుండా తెరవడమైందని ఆయన అన్నారు.  2 కోట్ల కు పైగా పేదలకు పక్కా ఇళ్లను ఎలాంటి భేదభావాలకు తావు ఇవ్వకుండా అందించడమైందని తెలిపారు.  8 కోట్ల కు పైగా మహిళలు ఎలాంటి భేదభావాలకు తావు లేకుండా గ్యాస్ కనెక్షన్ ను పొందుతున్నారని ఆయన వివరించారు.  సుమారు 50 కోట్ల మంది ప్రజలు ఆయుష్మాన్ పథకంలో భాగం గా 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య చికిత్స ను ఎలాంటి విచక్షణ కు తావు లేకుండానే పొందారని ఆయన చెప్పారు.  ‘‘దేశ వనరులు ప్రతి ఒక్క పౌరునికి, పౌరురాలికి చెందేవే, ఈ వనరులు అందరికీ ఉపయోగపడాలి. ఈ అవగాహన తో మా ప్రభుత్వం పనిచేస్తోంది’’అని ప్రధాన మంత్రి శ్రీ మోదీ అన్నారు.

దేశ అభివృద్ధి ని, సమాజ అభివృద్ధి ని రాజకీయ కోణం లో నుంచి చూడకూడదు అనేది న్యూ ఇండియా దార్శనికత గా ఉందని ప్రధాన మంత్రి అన్నారు.  తప్పుదోవ పట్టించే ప్రచారం పట్ల జాగరూకత తో ఉండాలని, దేశ హితాన్నే అన్నిటి కన్న మిన్న గా ప్రతి ఒక్కరి హృదయం లో ప్రతిష్ఠించుకోవాలని శ్రీ మోదీ సూచించారు.  రాజకీయాలు వేచి ఉండవచ్చును కానీ సమాజం వేచి ఉండకూడదు; అదే మాదిరి గా ఏ వర్గానికి చెందిన పేద ప్రజలు అయినప్పటికీ వారు ఎదురుచూపులు చూస్తూ ఉండకూడదు అని ఆయన చెప్పారు.  మనం కాలాన్ని వృథాపోనీయలేం. మరి మనం ఒక ఆత్మనిర్భర్ భారత్ ను ఆవిష్కరించడానికి కలిసి పనిచేయాలి.  జాతీయ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి అన్ని అభిప్రాయభేదాలను పక్కన పెట్టి తీరాలి అని కూడా శ్రీ మోదీ అన్నారు.

PM India

కరోనా మహమ్మారి కాలం లో సమాజానికి ఇంతవరకు కని విని ఎరుగని తోడ్పాటు ను అందించినందుకు గాను అలీగఢ్ ముస్లిమ్ యూనివర్సిటీ  ని ప్రధాన మంత్రి ప్రశంసించారు.  వేల కొద్దీ ప్రజలకు ఉచితంగా పరీక్షల ను నిర్వహించడం, రోగులను విడిగా ఉంచే వార్డులను నిర్మించడం, ప్లాజ్ మా బ్యాంకులను ఏర్పాటు చేయడం, పిఎమ్ కేర్ ఫండ్ కు ఒక పెద్ద మొత్తాన్ని విరాళం గా ఇవ్వడం సమాజానికి మీరు మీ  కర్తవ్యాలను నెరవేర్చడాన్ని ఎంత గంభీరం గా తీసుకొంటున్నదీ చాటిచెప్తున్నాయి అని ఆయన అన్నారు.  ఆ కోవకు చెందిన సంఘటిత ప్రయాసల ద్వారా, భారతదేశం ప్రస్తుతం అన్నింటి కంటే మిన్న గా దేశాన్ని నిలబెడుతూ, కరోనా వంటి ప్రపంచ వ్యాప్త అంటువ్యాధి తో విజయవంతంగా పోరాడుతోందని ఆయన అన్నారు.

గత వందేళ్ల కాలం లో ప్రపంచం లోని అనేక దేశాలతో భారతదేశం సంబంధాలను పటిష్టం చేయడానికి కూడా అలీగఢ్ ముస్లిమ్ యూనివర్సిటీ (ఎఎమ్ యు) కృషి చేసిందని ప్రధాన మంత్రి అన్నారు.  ఇక్కడ ఉర్దూ, అరబిక్, పర్షియన్ భాషల్లోనూ, ఇస్లామిక్ సాహిత్యంలోనూ జరుగుతున్న పరిశోధనలు యావత్ ఇస్లామిక్ ప్రపంచం తో భారతదేశానికి ఉన్న సాంస్కృతిక సంబంధాలకు ఒక కొత్త శక్తి ని ఇస్తున్నాయని  కూడా ఆయన అన్నారు.  దేశ నిర్మాణ కర్తవ్యాన్ని నెరవేర్చడంతో పాటు విశ్వవిద్యాలయ నైపుణ్య శక్తి ని మరింతగా వృద్ధి చేసుకోవడం అనే  రెండు బాధ్యతలు విశ్వ విద్యాలయం భుజస్కంధాల పైన ఉన్నాయని ఆయన అన్నారు.

టాయిలెట్ సౌకర్యం లోపించిన కారణంగా ముస్లిమ్ కుమార్తెలు బడి ని మధ్యలోనే మానివేసే స్థాయి 70 శాతానికి మించిపోయిన స్థితి అంటూ ఒకటి ఉండేదని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు.  ప్రభుత్వం స్వచ్చ్ భారత్ అభియాన్ లో భాగంగా ఒక ఉద్యమం తరహా లో పాఠశాల విద్యార్థినుల కోసం వేరు గా టాయిలెట్ లను నిర్మించింది అని ఆయన అన్నారు.  మరి ఇప్పుడు బడి ని మధ్యలో మానివేస్తున్న ముస్లిమ్ కుమార్తెల స్థాయి దాదాపుగా 30 శాతానికి దిగి వచ్చింది అని ఆయన తెలిపారు.  బడి ని మధ్యలో మానివేస్తున్న విద్యార్థుల కోసం అలీగఢ్ ముస్లిమ్ విశ్వవిద్యాలయం బ్రిడ్జి కోర్సులను నిర్వహిస్తూ ఉండటాన్ని ఆయన మెచ్చుకొన్నారు.  ప్రభుత్వం ముస్లిమ్ కుమార్తెల విద్య పై, వారికి సాధికారిత కల్పన పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటోందని కూడా ఆయన చెప్పారు.  గడచిన ఆరు సంవత్సరాల కాలంలో ఇంచుమించు కోటి మంది ముస్లిమ్ కుమార్తెలకు ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనాలను ఇవ్వడం జరిగిందని ఆయన వివరించారు.  మహిళ, పురుషుడు అనే భేదం ఆధారం గా ఎలాంటి విచక్షణ ఉండకూడదని, ప్రతి ఒక్కరు సమాన హక్కులను పొందాలని, దేశ అభివృద్ధి ప్రయోజనాలను ప్రతి ఒక్కరు పొందాలని కూడా ఆయన నొక్కిచెప్పారు.

మూడు సార్లు తలాక్ పద్ధతి ని రద్దు చేస్తూ ఒక ఆధునిక ముస్లిమ్ సమాజాన్ని నిర్మించే దిశ లో సాగుతున్న ప్రయత్నాలను దేశం ముందుకు తీసుకుపోయిందని ప్రధాన మంత్రి అన్నారు.  ఇంతకు ముందు, ఒక మహిళ చదువుకుంటే పూర్తి కుటుంబం చదువుకున్నట్టే అని అనే వారు, విద్య తనతో పాటు ఉద్యోగ కల్పన ను, నవ పారిశ్రామికత్వాన్ని వెంటబెట్టుకు వస్తుందని ఆయన చెప్పారు.  ఉద్యోగం, నవ పారిశ్రామికత్వం తమతో పాటు ఆర్థిక స్వాతంత్య్రాన్ని తోడు తీసుకు వస్తాయన్నారు.  ఆర్థిక స్వాతంత్ర్యంతో పాటే సాధికారిత కూడా తరలివస్తుందని చెప్పారు. సాధికారిత ను సొంతం చేసుకున్న మహిళ ప్రతి ఒక్క నిర్ణయానికి, ప్రతిఒక్క స్థాయి లోను, మరే వ్యక్తి మాదిరిగా తాను సైతం సమానమైనటువంటి తోడ్పాటు ను అందిస్తారన్నారు.

 

ఎఎమ్ యు ఉన్నత విద్య లోని తన సమకాలీన పాఠ్య ప్రణాళిక నుంచి ఎంతోమందిని ఆకట్టుకొందని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ విశ్వవిద్యాలయం లో ఇప్పటికే బోధిస్తున్న అంశాలను పోలిన ఇంటర్ డిసిప్లీనరీ సబ్జెక్టులను నూతన జాతీయ విద్య విధానం లో పొందుపరచినట్లు ఆయన చెప్పారు.  దేశానికే అగ్ర ప్రాధాన్యం అనే పిలుపు ను అందుకొని దేశాన్ని ముందుకు తీసుకు పోవడానికి మన యువత కంకణం కట్టుకొందని ఆయన అన్నారు.  భారతదేశ యువతీ యువకుల్లోని ఈ ఆకాంక్ష కు నూతన జాతీయ విద్య విధానం లో పెద్దపీట ను వేయడం జరిగిందని ఆయన తెలిపారు.  నూతన జాతీయ విద్య విధానం లోని బహుళ ప్రవేశ, నిష్క్రమణ స్థానాలు విద్యార్థులకు వారి విద్య విషయం లో నిర్ణయాలు తీసుకోవడాన్ని సులభతరం చేస్తాయి అని ఆయన అన్నారు.  ఇది విద్యార్థులకు మొత్తం కోర్సు రుసుములకు సంబంధించి బెంగ పెట్టుకోకుండా వారు ఒక నిర్ణయాన్ని తీసుకొనే స్వేచ్ఛ ను కూడా వారికి అందిస్తుంది అని ఆయన వివరించారు.

ఉన్నత విద్య లో సీట్లను పెంచడానికి, అందులో చేరే వారి సంఖ్య ను పెంచడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు.  విద్య.. అది ఆన్ లైన్ మాధ్యమంలో అయినా గాని, లేక ఆఫ్ లైన్ మాధ్యమంలో అయినా గాని, ప్రభుత్వం ఆ విద్య ప్రతి ఒక్కరికి అందేటట్లుగానూ, ప్రతి ఒక్కరి జీవితంలో పరివర్తన ను తీసుకువచ్చేటట్టుగానూ చూడటానికి కృషి చేస్తోందని ఆయన అన్నారు.  ఎఎమ్ యు కు చెందిన వంద వసతి గృహాలు ఈ వందేళ్ల సందర్భం లో ఒక పాఠ్య ప్రణాళికేతర కార్య భారాన్ని నిర్వర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యభారం ఏమిటంటే… భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం 75 వ వార్షికోత్సవ సందర్భానికి అనుగుణం గా, అంతగా వెలుగులోకి రాని స్వాతంత్ర్య యోధులను గురించి పరిశోధించడం అని ఆయన అన్నారు.

 

***