Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉన్నత న్యాయస్థానాల (పేర్ల మార్పు) బిల్లు, 2016కు మంత్రిమండలి ఆమోదం; బాంబే మరియు మద్రాసు హైకోర్టుల పేర్లలో మార్పునకు వెసులుబాటు


ఉన్నత న్యాయస్థానాల (పేర్ల మార్పు) బిల్లు, 2016ను పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మంత్రి ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.

‘బాంబే హైకోర్టు పేరును ముంబై హైకోర్టు’ గాను, అలాగే ‘మద్రాసు హైకోర్టు పేరును చెన్నై హైకోర్టు’ గాను మార్చేందుకు ఉన్నత

న్యాయస్థానాల (పేర్ల మార్పు) బిల్లు, 2016 వీలు కల్పిస్తుంది.

పూర్వరంగం

బాంబే మరియు మద్రాసు హైకోర్టులకు అవి నెలకొన్న నగరాల పేర్లనే పెట్టారు. అయితే ఈ నగరాల పేర్లను మార్చిన తరువాత, ఈ

హైకోర్టుల పేర్లను కూడా మార్చాలన్న డిమాండ్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ హైకోర్టుల పేర్ల మార్పును పరిష్కరించే కేంద్ర చట్టం ఏదీ లేదు.

దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ బిల్లును తీసుకువస్తున్నారు.

ఈ నగరాల పేర్ల మార్పును పరిగణనలోకి తీసుకొంటే, ఈ హైకోర్టుల పేర్లను కూడా మార్చడం సముచితంగాను, తర్కబద్ధంగాను

ఉండగలదు. ఇది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలదు.