Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శించిన – ప్రధానమంత్రి

పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శించిన – ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శించి, సంస్థకు చెందిన శాస్త్రవేత్తల బృందంతో సంభాషించారు.  టీకా తయారీని మరింత వేగవంతం చేయడానికి వారు ఏవిధమైన ప్రణాళిక అమలుచేస్తున్నదీ, దానిపై, ఇప్పటివరకు వారు సాధించిన పురోగతి వివరాలను, శాస్త్రవేత్తలు, ప్రధానమంత్రికి తెలియజేశారు.   

ఈసందర్భంగా, ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ,   “సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థలోని శాస్త్రవేత్తల బృందంతో మంచి సంభాషణ జరిగింది.  టీకా తయారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి వారు పాటిస్తున్న ప్రణాళికల వివరాలనూదానిపై వారు ఇప్పటివరకు సాధించిన పురోగతి వివరాలనూ శాస్త్రవేత్తలు తెలియజేశారు. వారి తయారీ సదుపాయాలను కూడా పరిశీలించాను.” అని పేర్కొన్నారు. 

*****