Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్కును సందర్శించిన – ప్రధానమంత్రి

అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్కును సందర్శించిన – ప్రధానమంత్రి


జైడస్ కాడిలా అభివృద్ధి చేస్తున్న డి.ఎన్.‌ఎ. ఆధారిత స్వదేశీ వ్యాక్సిన్ గురించి మరింతగా తెలుసుకోవడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్కును ఈరోజు సందర్శించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, “జైడస్ కాడిలా అభివృద్ధి చేస్తున్న డి.ఎన్.‌ఎ. ఆధారిత వ్యాక్సిన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అహ్మదాబాద్‌ లోని జైడస్ బయోటెక్ పార్కును సందర్శించాను.  ఈ ప్రయత్నం వెనుక పనిచేస్తున్న బృందం కృషిని నేను అభినందిస్తున్నాను.  ఈ ప్రయాణంలో వారికి మద్దతుగా భారత ప్రభుత్వం వారితో పాటు కలిసి చురుకుగా పనిచేస్తోంది.” అని పేర్కొన్నారు. 

*****