ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన ‘ప్రగతి’ సమావేశానికి అధ్యక్షత వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొనే, ఐసిటి ఆధారిత మల్టి- మాడల్ ప్లాట్ ఫార్మ్ ఫార్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ ఎండ్ టైమ్ లీ ఇమ్ ప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ) మాధ్యమం ద్వారా నిర్వహించిన ఈ తరహా సమావేశం జరగడం ఇప్పటికి ఇది 33 వ సారి.
నేటి ‘ప్రగతి’ సమావేశం లో, వివిధ ప్రాజెక్టులను, ఫిర్యాదులను, కార్యక్రమాలను గురించి సమీక్షించారు. రైల్వేల మంత్రిత్వ శాఖ, ఎమ్ఒఆర్ టిహెచ్, డిపిఐఐటి, విద్యుత్ శాఖలకు చెందిన ప్రాజెక్టులపైన సమీక్ష చేపట్టారు. మొత్తం 1.41 లక్షల కోట్ల రూపాయల ఖర్చు తో కూడిన ఈ ప్రాజెక్టు లు ఒడిశా, మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తర్ ప్రదేశ్, జమ్ము- కశ్మీర్, గుజరాత్, హరియాణా, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, దాద్ రా-నాగర్ హవేలీ సహా, పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినవి. ఈ ప్రాజెక్టు పనులను అనుకొన్న కాలాని కంటే ముందే పూర్తి చేసేటట్టు చూడవలసిలందిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యదర్శులకు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ప్రధాన మంత్రి సూచించారు.
సమావేశం కొనసాగిన క్రమం లో, కోవిడ్-19 కి సంబంధించిన ఫిర్యాదులతో పాటు పిఎమ్ ఆవాస్ యోజన (గ్రామీణ్) కు సంబంధించిన ఫిర్యాదులను సమీక్షించడమైంది. పిఎమ్ స్వనిది, వ్యవసాయ సంస్కరణలు, ఎగుమతి కేంద్రాలు గా జిల్లాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలపైన సైతం సమీక్ష ను నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ఎగుమతి వ్యూహానికి రూపకల్పన చేయవలసిందిగా కూడా రాష్ట్రాలకు ప్రధాన మంత్రి సూచించారు.
ఫిర్యాదుల పరిష్కారం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. అటువంటి పరిష్కారాల పరిమాణం పై మాత్రమే కాక, నాణ్యత పైన కూడా దృష్టి సారించాలని ఆయన అన్నారు. సంస్కరణలను అమలు చేసినప్పుడే అవి ప్రయోజనాలను అందిస్తాయని, ఇది ఒక్కటే దేశాన్ని మార్చడానికి మన ముందున్న మార్గం అని ఆయన చెప్పారు.
ఇంతవరకు జరిగిన 32 ‘ప్రగతి’ సమావేశాలలో, మొత్తం 12.5 లక్షల కోట్ల రూపాయల విలువైన 275 ప్రాజెక్టులను సమీక్షించడం జరిగింది. వీటితో పాటు 47 కార్యక్రమాలు / పథకాలు, 17 రంగాల ఫిర్యాదులు కూడా పరిశీలన కు వచ్చాయి.
***
Had extensive discussions during today’s PRAGATI meeting, in which we discussed key projects worth Rs. 1.41 lakh crore spread across various states. These will benefit citizens and further ‘Ease of Living.’ https://t.co/4mXbZv3J8n
— Narendra Modi (@narendramodi) November 25, 2020