Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్-ఇటలీ అంతర్జాల ద్వైపాక్షిక సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

భారత్-ఇటలీ అంతర్జాల ద్వైపాక్షిక సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం


ఎక్స్ లెన్సీ నమస్కారం,

మీ ప్రారంభ వచనాలకు గానూ మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను.

మీరు చెప్పినట్లుగా.. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది మేలో జరగాల్సిన నా ఇటలీ పర్యటనను రద్దుచేసుకోవాల్సి వచ్చింది. కానీ ఇవాళ అంతర్జాల వేదిక ద్వారా మనం కలుసుకోవాల్సి రావడం శుభపరిణామం. ముందుగా.. కరోనా కారణంగా ఇటలీలో జరిగిన ప్రాణ నష్టానికి గానూ.. నా తరపున, భారతదేశం తరపున ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. ప్రపంచంలోని వివిధ దేశాలు కరోనా గురించి తెలుసుకుంటూ, అర్థం చేసుకుంటున్న సమయంలో మీ దేశంలో కరోనా దుష్ప్రభావం ప్రారంభమైంది.

ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ మీరు ఈ పరిస్థితులను అదుపులోకి తీసుకురావడంలో, దేశాన్ని ఏకం చేయడంలో విజయవంతం అయ్యారు. కరోనా ఉగ్రరూపం ప్రారంభంలో ఇటలీ తీసుకున్న నిర్ణయాలు మాకు ప్రేరణగా నిలిచాయి. మీ అనుభవాలే మాకు మార్గదర్శనం చేశాయి.

ఎక్స్ లెన్సీ,
మీలాగే నేను కూడా భారత్-ఇటలీ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రతిబద్ధుడనై ఉన్నాను. 2018లో టెక్ సమ్మిట్ కోసం మీరు భారత్ వచ్చిన సందర్భంగా జరిగిన సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. భారత ప్రజల్లోనూ ఇటలీపై ఆసక్తి పెరిగేందుకు కారణభూతమైంది. 2018లో మన సమావేశం తర్వాత ఇరుదేశాల సంబంధాల్లో పురోగతి కనిపించడం చాలా సంతోషకరం.
ఇటలీ పార్లమెంటు సభ్యులు గతేడాది ఇండియా-ఇటలీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్ ను ఏర్పాటుచేశారని తెలిసి చాలా సంతోషం కలిగింది. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత ఇటాలియన్ పార్లమెంటు సభ్యులకు భారతదేశానికి స్వాగతం పలికేందుకు అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాను.

ఎక్స్ లెన్సీ,
కరోనా మహమ్మారి రెండో ప్రపంచయుద్ధం లాగా ప్రపంచ చరిత్రలో ఓ మరకలా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మనందరికీ.. కరోనా అనంతర ప్రపంచాన్ని నిర్మించేందుకు మనల్ని మనం అర్థం చేసుకుంటూ.. దీని ద్వారా తలెత్తే ఇతర సమస్యలు, సవాళ్లకోసం మరింత వినూత్న పద్ధతులతో సిద్ధం చేసుకోవాలి.
నేటి మన ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, పరస్పర సమన్వయం, వివిధ క్షేత్రాలను గుర్తించి ఆయా రంగాల్లో సహకారం మరింత పెరుగుతుందని  నాకు విశ్వాసముంది.

 

*****