జమ్మూ, కశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలలో, 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు ఐదేళ్ల కాలానికి, 520 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేక ప్యాకేజీ ని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. ఈ పొడిగించిన కాలంలో పేదరిక నిష్పత్తితో కేటాయింపులను అనుసంధానించకుండా డిమాండ్ ఆధారిత ప్రాతిపదికన, కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ-కశ్మీర్, లడఖ్ లలో దీన్ దయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డి.ఏ.వై-ఎన్.ఆర్.ఎల్.ఎమ్) నిధులను కేటాయించడం జరిగింది.
కేంద్ర పాలిత ప్రాంతాలకు అవసరమయ్యే విధంగా, ఈ మిషన్ కింద తగినంత నిధులను ఇది నిర్ధారిస్తుంది. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ-కశ్మీర్, లడఖ్ లలోని కేంద్ర ప్రాయోజిత లబ్ధిదారుల ఆధారిత పథకాలను సార్వత్రికపరచాలనే భారత ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇది ఉంటుంది.
కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ-కశ్మీర్, లడఖ్ లలో మారిన పరిస్థితులను బట్టి, గ్రామీణ కుటుంబాల జీవన ప్రమాణాలు మరియు మహిళల సాధికారతను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఈ పధకం యొక్క సామర్థ్యాన్ని సూచించే మూల్యాంకనం యొక్క ఫలితాలపై ఇది ఆధారపడి ఉంటుంది.
దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డి.ఏ.వై-ఎన్.ఆర్.ఎల్.ఎమ్) అనేది, దేశవ్యాప్తంగా గ్రామీణ పేద కుటుంబాలకు బహుళ జీవనోపాధిని ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో రూపొందించిన పధకం. గ్రామీణ పేదరికాన్ని పరిష్కరించడం కోసం 2011 జూన్ నెలలో ప్రారంభించిన, డి.ఏ.వై-ఎన్.ఆర్.ఎల్.ఎమ్. పధకం పేదరిక కార్యక్రమాలలో ఒక నమూనా మార్పును సూచించింది. డి.ఏ.వై-ఎన్.ఆర్.ఎల్.ఎమ్. అన్ని గ్రామీణ పేద గృహాలను చేరుకోవాలని, అంటే సుమారు 10 కోట్ల గృహాలను చేరుకోవాలని అంచనా వేయడం జరిగింది. ప్రతి గ్రామీణ పేద ఇంటి నుండి ఒక మహిళా సభ్యురాలిని, స్వయం సహాయక బృందాలు (ఎస్.హెచ్.జి.లు) గా రూపొందించి, సార్వత్రిక సామాజిక సమీకరణ ద్వారా, ఈ పధకం, వారి జీవనోపాధిని ప్రభావితం చేస్తుంది. వారి శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం, వారి సూక్ష్మ జీవనోపాధి ప్రణాళికలను సులభతరం చేయడం మరియు వారి స్వంత సంస్థలు మరియు బ్యాంకుల నుండి ఆర్థిక వనరులను పొందడం ద్వారా వారి జీవనోపాధి ప్రణాళికలను అమలు చేయడానికి ఈ పధకం వీలు కల్పిస్తుంది.
ఈ పధకంలో, స్వయం సహాయక స్ఫూర్తితో కమ్యూనిటీ నిపుణుల ద్వారా కమ్యూనిటీ సంస్థలతో కలిసి పనిచేయడం ఈ పధకం ప్రత్యేకత. వినూత్నమైన ఈ ప్రతిపాదన కారణంగా, డి.ఏ.వై-ఎన్.ఆర్.ఎల్.ఎమ్. పధకం, గతంలో రూపొందించిన పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు భిన్నంగా ఉంటుంది. మిషన్ మోడ్ లో ప్రత్యేక ప్రయోజన వాహనాలు (స్వతంత్ర ప్రతిపత్తి రాష్ట్ర సొసైటీలు) జాతీయ, రాష్ట్ర, జిల్లా, బ్లాకు స్థాయిలలో అంకితమైన అమలు సహాయక యూనిట్లతో, వృత్తిపరమైన మానవ వనరులను ఉపయోగించి నిరంతరాయంగా అందించడానికి మరియు ప్రతి గ్రామీణ పేద కుటుంబానికి దీర్ఘకాలిక హ్యాండ్ హోల్డింగ్ మద్దతు ఇవ్వడం, ఈ కార్యక్రమం యొక్క ఇతర ప్రత్యేక లక్షణాలు.
*****
Today’s Cabinet decision will further 'Ease of Living' for the people of Jammu and Kashmir as well as Ladakh. https://t.co/QoMGNnm7WF
— Narendra Modi (@narendramodi) October 14, 2020