ఐక్య రాజ్య సమితి సాధారణ సభ అధ్యక్షుడు శ్రీ వోల్కన్ బోజ్ కిర్, విశిష్ట అతిథులు, మహిళలు, సజ్జనులారా,
నమస్తే.
75 సంవత్సరాల క్రిందట యుద్ధ బీభత్సాల నుంచి ఒక కొత్త ఆశ రేకెత్తింది. మానవ జాతి చరిత్ర లో మొట్టమొదటి సారిగా యావత్తు ప్రపంచం కోసం ఒక సంస్థ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఐరాస అధికారపత్రంలో వ్యవస్థాపక సంతకందారుగా భారతదేశం ఆ పవిత్ర దార్శనికత లో పాలుపంచుకొంది. ఈ ఘటన భారతదేశం స్వీయ సిద్ధాంతమైన ‘వసుధైవ కుటుంబకమ్’ (ఈ సృష్టి అంతా ఒకే కుటుంబం అనే భావన) ను ప్రతిబింబించింది.
మన ప్రపంచం ప్రస్తుతం ఒక ఉత్తమ ప్రాంతం గా ఉందీ అంటే, అందుకు కారణం ఐక్య రాజ్య సమితే. ఐరాస పతాకం నీడలో అభివృద్ధి, శాంతి అనే ఆశయాల ను ముందుకు తీసుకుపోయిన వారందరికీ ఐరాస శాంతి పరిరక్షక దళం సహా మనం శ్రద్ధాంజలి ని ఘటిద్దాం. ఐరాస శాంతి పరిరక్షక దళాలకు భారతదేశం పెద్ద ఎత్తున సైనికుల ను అందించిన దేశాల్లో భారతదేశం ఒక దేశ గా ఉంది.
ఎన్నో మైలురాళ్ళను అధిగమించినప్పటికీ, సిసలైన లక్ష్యాన్ని చేరుకోవడం ఇంకా అసంపూర్తిగానే ఉండిపోయింది. ఈ రోజున మనం స్వీకరిస్తున్న దీర్ఘ ప్రభావ ప్రకటన చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయని సూచిస్తోంది. ఆ కార్యాల్లో ..ఘర్షణ ను నివారించడం, అభివృద్ధి జరిగేటట్లు చూడటం, జలవాయు పరివర్తన సంబంధిత సమస్యలను పరిష్కరించడం, అసమానతలను తగ్గించడం, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాల ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం వంటి కార్యాలు ఉన్నాయి. ఐక్య రాజ్య సమితిని సైతం సంస్కరించవలసిన అవసరం ఉందని ఈ ప్రకటన అంగీకరిస్తోంది.
మనం ఈ కాలపు సవాళ్ళ ను కాలం చెల్లిన వ్యవస్థల తో ఎదుర్కోలేము. సమగ్ర సంస్కరణల కు బాట వేయకుండా ఐరాస ఒక విశ్వాస సంబంధిత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక దేశంతో మరో దేశం పరస్పరం ఆధారపడిన ప్రస్తుత ప్రపంచంలో సంస్కరణలకు చోటు ఉండే బహుళ సంస్థలు అనేవి ఎంతయినా అవసరం. అటువంటి సంస్థలు ఈనాటి వాస్తవాల కు అద్దం పడుతూ, స్టేక్ హోల్డర్స్ అందరికీ స్వరాన్ని ఇస్తూ, సమకాలీన సవాళ్ళ ను పరిష్కరించేవి అయి వుండి, మానవాళి సంక్షేమం పై శ్రద్ధ తీసుకొనేవి అయివుండాలి.
ఈ గమ్యాన్ని చేరే దిశ లో అన్ని దేశాల తో కలసి కృషి చేసేందుకు భారతదేశం ఎదురుచూస్తోంది.
మీకు ధన్యవాదాలు.
https://youtu.be/Ym90Jx9W7fs
Marking 75 years of the @UN. https://t.co/2j7HPYjEGA
— Narendra Modi (@narendramodi) September 21, 2020