Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాఫ్నా లో భారతదేశం నవీకరించిన దురైయప్ప స్టేడియమ్ ను శ్రీ లంక ప్రజలకు అంకితం చేయనున్నారు


జాఫ్నా లో నవీకరించిన దురైయప్ప స్టేడియమ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన లు ఇరువురూ రేపు ఉదయం శ్రీ లంక ప్రజలకు అంకితం చేయనున్నారు. జాఫ్నాలోని ఈ స్టేడియమ్ లో అధ్యక్షుడు శ్రీ సిరిసేన పాల్గొంటారు. కాగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ నుండి వీడియో సమావేశం మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటారు.

జాఫ్నా పూర్వ మేయర్ కీర్తి శేషుడు ఆల్ఫ్రెడ్ తంబిరాజా దురైయప్ప గౌరవార్థం దురైయప్ప స్టేడియమ్ కు ఆ పేరును పెట్టారు. రూ. 7 కోట్లకు పైగా వ్యయంతో భారత ప్రభుత్వం ఈ స్టేడియమ్ ను నవీకరించింది.

ఈ స్టేడియమ్ లో 1850 మంది కూర్చోవడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఇది క్రీడలు తదితర వినోద కార్యకలాపాల ప్రోత్సాహానికి ఉపయోగపడడమే కాకుండా, శ్రీ లంకలోని ఉత్తర ప్రాంతం యువజనుల సర్వతోముఖ అభివృద్ధికి కూడా తోడ్పడనుంది.

ఈ స్టేడియమ్ ను 1997 నుండి ఉపయోగించడం లేదు.

నవీకరించిన స్టేడియమ్ లో జరుగనున్న మొట్టమొదటి ప్రధాన కార్యక్రమం యోగా రెండవ అంతర్జాతీయ దిన వేడుకలు. ఈ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి శ్రీ మోదీ మరియు అధ్యక్షుడు శ్రీ సిరిసేన లు ఇరువురు తిలకించనున్నారు. యోగాభ్యాస ప్రదర్శనలో 8,000 మందికి పైగా ప్రజలు పాలుపంచుకొనే అవకాశం ఉంది.