గడచిన కొన్ని సంవత్సరాల లో దేశం లో, ప్రత్యేకించి పల్లెల లో చేపట్టిన ప్రయాసల ను గురించి ప్రధాన మంత్రి తెలియజేశారు. ఈ ప్రయత్నాల లో పోషణ విజ్ఞాన సప్తాహం లోను, పోషణ విజ్ఞాన మాసం లోను ప్రజల ప్రాతినిధ్యం పోషణ విజ్ఞాన సంబంధిత జాగృతి ని ఒక సామూహికోద్యమం గా మలచడం జరుగుతోంది అని ఆయన అన్నారు. పోషణ విజ్ఞానం పట్ల స్పృహ ను పెంచడం కోసం బాలల కు పోటీల ను నిర్వహించే ప్రయత్నాలను చేపడుతూ ఈ ప్రజాందోళన లోకి పాఠశాలల ను ఏకీకృతపరచడమైందని కూడా ఆయన తెలిపారు.
ఒక తరగతి లో తరగతి ప్రబోధకుడు ఉన్నట్లుగానే, పోషణ విజ్ఞాన ప్రబోధకుడు అంటూ కూడా ఒకరు ఉండాల అని ప్రధాన మంత్రి అన్నారు. అదే విధం గా, వివరణ పత్రం మాదిరిగా ఒక పోషణ విజ్ఞాన వివరణ పత్రాన్ని కూడా ప్రవేశపెట్టాలి అని ఆయన అన్నారు. పోషణ విజ్ఞాన మాసాన్ని పాటించే క్రమం లో, ఆహారం మరియు పోషణ విజ్ఞాన సంబంధిత క్విజ్ ను, అలాగే ఒక మీమ్ కాంపెటీశన్ ను కూడా My Gov పోర్టల్ లో నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. దాని లో పాలుపంచుకోవలసింది గా శ్రోతల ను ఆయన కోరారు.
స్టాచూ ఆఫ్ యూనిటీ లో ఒక విశిష్టమైన న్యుట్రిశన్ పార్క్ ను కూడా ఏర్పాటు చేయడమైందని, అక్కడ వినోదం మరియు ఉల్లాసాల తో పాటే పోషణ విజ్ఞాన సంబంధిత శిక్షణ ను కూడా గమనించవచ్చని ప్రధాన మంత్రి తెలిపారు.
ఆహారం పరంగా, పానీయాల పరం గా భారతదేశం లో బోలెడంత వైవిధ్యం ఉందని ప్రధాన మంత్రి నొక్కిపలుకుతూ, ఒక ఫలానా ప్రాంతం లోని రుతువు కు అనుగుణం గా స్థానికంగా సాగు చేసే ఆహార ధాన్యాలు, ఫలాలు, ఇంకా కాయగూరల ను చేర్చుతూ ఒక చక్కని సమతులమైన మరియు పోషకపదార్థాల తో నిండిన నియతాహారాన్ని రూపొందించాలన్నారు. ‘భారతదేశ వ్యవసాయ నిధి’ ని ఏర్పాటు చేయడం జరుగుతోందని ప్రధాన మంత్రి తెలియజేస్తూ, అందు లో ప్రతి జిల్లా లో పండే పంటల ను గురించిన, ఇంకా ఆయా పంటల తాలూకు పోషణ విజ్ఞాన సంబంధ విలువ ను గురించిన పూర్తి సమాచారాన్ని చేర్చడం జరుగుతుందని వివరించారు. పోషణ మాసం సందర్బం లో బలవర్ధక ఆహారాన్ని భుజిస్తూ ఆరోగ్యం గా ఉండవలసిందంటూ శ్రోతల కు ప్రధాన మంత్రి సూచన చేశారు.
*****
India is marking Nutrition Month. This will benefit young children. #MannKiBaat pic.twitter.com/ryxScfs9Ua
— PMO India (@PMOIndia) August 30, 2020