Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జన‌ర‌ల్ కేట‌గిరి వ‌ర్క‌ర్ల నియామ‌కం కోసం భార‌త దేశం, సౌదీ అరేబియా లు కుదుర్చుకొన్న శ్ర‌మ స‌హ‌కార ఒప్పందానికి మంత్రిమండ‌లి ఆమోదం


జన‌ర‌ల్ కేట‌గిరి వ‌ర్క‌ర్ల నియామ‌కం కోసం భార‌తదేశం, సౌదీ అరేబియా లు కుదుర్చుకొన్న శ్ర‌మ స‌హ‌కార ఒప్పందానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ ఒప్పందం పై 2016 ఏప్రిల్ 2, 3 తేదీల‌లో ప్ర‌ధాన మంత్రి సౌదీ అరేబియా లో ప‌ర్య‌టించిన‌ప్పుడు సంత‌కాలు జ‌రిగాయి.

ఈ ఒప్పందం తాలూకు ప్ర‌యోజ‌నాలు భార‌తదేశం నుంచి వ‌ల‌స వెళ్ళి సౌదీ అరేబియా లో ప‌ని చేస్తున్న నైపుణ్యం లేని, పాక్షిక నైపుణ్యం క‌లిగిన మ‌రియు నిపుణులైన కేటగిరీల‌కు చెందిన శ్రామికుల‌కు వారి కులం, వ‌ర్గం, మ‌తం, లింగ భేదాల‌కు అతీతంగా సిద్ధిస్తాయి.